శిల్పాశెట్టి తో రాందేవ్ ఢింక చిక ఢింక చిక... | Baba Ramdev's Super YOGA Dance for Shilpa Shetty

Baba ramdev s super yoga dance for shilpa shetty

Baba Ramdev's Super YOGA Dance, Super YOGA Dance for Shilpa Shetty, Super Dance Baba Ramdev, Super YOGA Dance, Baba Ramdev Shilpa Shetty dance

Baba Ramdev's Super YOGA Dance for Shilpa Shetty.

రాందేవ్ చిందులతో అంతా సందడి

Posted: 10/20/2016 08:55 AM IST
Baba ramdev s super yoga dance for shilpa shetty

ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్ మరోసారి వార్తల్లో నిలిచాడు. అయితే వివాదంతో కాదు సుమీ. వెరైటీ వెరైటీ ఫీట్లతో ఆకట్టుకునే ఆయన ఈసారి డాన్సర్ అవతారంలో కనిపించారు. ఆయనకు అదేం కొత్త కాకపోవచ్చు. కానీ, ఈసారి కాస్త స్పెషల్ ఎందుకంటే... ఆయన ఓ రియాలిటి షో లో సందడి చేయటమే అందుకు కారణం.

ప్రముఖ ఛానెల్ సోనీలో సూపర్ డాన్సర్ షో వస్తున్న సంగతి తెలిసిందే. ఈ షోకి జడ్జిలుగా హీరోయిన్ శిల్పాశెట్టి, దర్శకుడు అనురాగ్ బసు, కొరియోగ్రాఫర్ గీతా కపూర్ వ్యవహరిస్తున్నారు. మాములుగా తమ సినిమా ప్రమోషన్ లకి హీరోలు, హీరోయిన్లు, దర్శకులు ఈ కార్యక్రమాన్ని వాడుకుంటారు. అయితే ఈసారి వెరైటీగా బాబా రాందేవ్ ను షోకి హాజరయ్యాడు. షోలో పాల్గొని పిల్లలను నృత్యాలను హుషారుగా తిలకించాడు.

అంతటితో ఆగలేదాయన, వారిని ఎంకరేజ్ చేస్తూ స్టెప్పులు వేశాడు. ఆయన్ని అలా చూసిన ఆనందంలో జడ్జిలు కూడా జత కలిశారు. వారంతా కలిసి డాన్సులు చేస్తుంటే స్టేజీ మొత్తం సందడిగా మారిపోయింది. రాందేవ్ కు ఆటపాటలు కొత్తకాదు. గతంలో యోగా క్లాసులలో సైతం పలు సందర్భాల్లో ఆయన ఆటపాటలతో అలరించిన సందర్భాలు ఉన్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Baba Ram Dev  Shilpa Shetty  Super Dancer show  YOGA dance  

Other Articles