బిగ్ బీ-బాలయ్య కలయిక ఊహించగలమా? | balayya meets amitabh bachchan in sarkar 3 sets

Balayya meets amitabh bachchan in sarkar 3 sets

Balayya meets amitabh bachchan, balayya in sarkar 3 sets, Senior Hero bala Krishna meets amitabh bachchan, Big B Balayya, Balayya Raythu Big B, Big B in Balayya movie, Why Balayya meet Big B, Balayya meet Bollywood Megastar

Tollywood Senior Hero bala Krishna meets amitabh bachchan in sarkar 3 sets,

బిగ్ బీతో బాలయ్య ఊహించలేదు కదా

Posted: 10/19/2016 03:59 PM IST
Balayya meets amitabh bachchan in sarkar 3 sets

నిజంగా ఈ కలయికను కలలో కూడా ఎవరూ ఊహించి ఉండరేమో. బాలయ్య ఏంటి? బిగ్ బీని కలవటం ఏంటి? అది కూడా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న శాతకర్ణి షూటింగ్ కి బ్రేక్ ఇచ్చి మరీ. కారణం ఏంటో తెలీదుగానీ, ముంబై వెళ్లిన బాలయ్య సర్కార్-3 సెట్స్ కి వెళ్లి మరీ అమితాబ్ బచ్చన్ ను కలిశాడు.

వారిద్దరి కలయిక తో ఉన్న ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో నిజంగా రచ్చ రేపుతోంది. బాలయ్య ఎన్టీఆర్ స్టైల్ లో మెగాస్టార్ కి ఏదో చెబుతుంటే... .ఆయన ఎంతో ఆసక్తిగా వింటున్నాడు. తన 100వ చిత్రం శాతకర్ణి గురించి కూడా ఆయనకు వివరించినట్లు తెలుస్తోంది. ఆపై దర్శకుడు రాంగోపాల్ వర్మతోపాటు, చిత్ర యూనిట్ లోని పలువురిని కలిసిన వారితో సరదాగా కాసేపు మాట్లాడాడంట. బాలయ్య తమ సెట్లో సందడి చేసినందుకు వారంతా సంతోషం వ్యక్తం చేసినట్లు సమాచారం.

నిజానికి కెరీర్ మొదట్లో ఎన్టీఆర్ కొడుకుగా బాలయ్యకు అమితాబ్ కి మంచి సంబంధాలు ఉండేవి. కానీ, ఈ మధ్య వారు కలుసుకున్న దాఖలాలు లేవు. ఆపై నాగ్ కుటుంబంతోనే అమితాబ్ ఎక్కువ సంబంధాలు కొనసాగిస్తున్నాడు. ఇప్పుడు హఠాత్తుగా బాలయ్య వెళ్లి ఆయన్ను కలవటంతో ఆసక్తి నెలకొంది. ఇక తెలుగులో మంచి కథతో అప్రోచ్ అయితే తప్పకుండా నటిస్తానంటూ ఆ మధ్య అమితాబ్ ఓ ఇంటర్వ్యూలో చెప్పిన సంగతి తెలిసిందే. తెలుగులో బాలీవుడ్ కన్నా బెటర్ సినిమాలు వస్తున్నాయని, బాహుబలి అందుకు నిదర్శనమని బిగ్ బీ అప్పుడు ఓ రేంజ్ లో పొగిడాడు. కొంపదీసి శాతకర్ణిలో అమితాబ్, పోనీ ‘రైతు’ లో అయినా... ఛా.. ఛా... ఛా.... అయ్యి ఉండకపోవచ్చు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Balayya  Big B  Sarkar 3 sets  

Other Articles