mega power star ram charan tej to launch Nakshatram's logo

Charan to launch nakshatram s first ten looks

sai dharam taj, sandeep kishan, regina, pragna jaiswal, krishna vamshi, mega power star Ram Charan, ‘Nakshatram’, Nakshatram logo launch, Nakshatram first ten looks, tollywood

Krishna Vamsi is one of the talented director of Tollywood, is coming back to greet the audiences by his upcoming action entertainer drama ‘Nakshatram’. Ram Charan is going to launch its logo and First Ten Looks.

మెగా పవర్ స్టార్ చేతుల మీదుగా నక్షత్రం లోగో లాంచ్

Posted: 09/04/2016 01:34 PM IST
Charan to launch nakshatram s first ten looks

క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో రూపోందుతున్న 'నక్షత్రం' చిత్రం ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో శరవేగంగా నిర్మాణం జరుపుకుంటోంది. ఈ చిత్రం తొలి పది ప్రచార చిత్రాలను మరికొద్ది రోజులలో విడుదల చేయనున్నారు  మెగా పవర్ స్టార్ 'రామ్ చరణ్'. ఈ విషయాన్ని మీడియాతో పంచుకుంటున్నారు దర్శకుడు కృష్ణ వంశీ. 'నక్షత్రం' లోగో,  ప్రచార చిత్రాలు ఎంతో ఆసక్తిని రేకెత్తించేలా ఉంటాయని తెలుస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

"పోలీస్" అవ్వాలనే ప్రయత్నం లో వున్న ఓ యువకుడి కథే ఈ "నక్షత్రం" అని తెలిపారు క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణ వంశీ. ఈ చిత్రానికి దర్శకత్వం కృఫ్ణవంశీ వహించగా, శ్రీ చక్ర మీడియా సారధ్యంలో "బుట్ట బొమ్మ క్రియేషన్స్" పతాకంపై  ప్రొడ్యూసర్ కే.శ్రీనివాసులు "విన్ విన్ విన్ క్రియేషన్స్"పతాకంపై నిర్మాతలు ఎస్.వేణుగోపాల్, సజ్జు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో సాయి ధరమ్ తేజ్, సందీప్ కిషన్, రెజీనా, ప్రగ్య జైస్వాల్ ప్రధాన తారాగణం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sai dharam taj  sandeep kishan  regina  pragna jaiswal  krishna vamshi  

Other Articles