జనతా గ్యారేజ్ ఐటెం సాంగ్ లో కాజల్ | kajal agarwal item song in janatha garage

Kajal item song in janatha garage

janatha garage item song, kajal Item for NTR, NTR item song, NTR Kajal Item song, NTR item girl change, tamanna no for NTR, Tamanna out from Janatha Garaje

kajal agarwal item song in janatha garage.

కాజల్ మరోసారి బుడ్డొడితో కానీ...

Posted: 07/29/2016 01:27 PM IST
Kajal item song in janatha garage

రెండు బ్యాక్ టూ బ్యాక్ డిజాస్టర్ లు, పైగా స్టార్ హీరోలతో కావటం, ఇంకోవైపు బాలీవుడ్ సినిమా ఇలా వచ్చి అలా వెళ్లిపోవటంతో కాజల్ మొహం చూసేందుకు తెలుగు దర్శకులు జడుసుకుంటున్న సమయంలో పిలిచి మరీ సినిమా తీస్తున్నాడు దర్శకుడు తేజ. అయితే మరో బిగ్ ఆఫర్ ఆమె తలుపు తట్టినట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ సరసన గ్యారేజ్ లో నటించేందుకు కాజల్ ఓకే చెప్పిందట. ఇద్దరు హీరోయిన్లు ఉండగా ఇదేంటీ అని అనుకోకండి ఐటెం సాంగ్ కోసం...

ఎన్టీఆర్ సూచన మేరకు ముందుగా దీనిని తమన్నాపై చిత్రీకరించాలని దర్శకుడు కొరటాల శివ ఫ్లాన్ చేశాడు. అయితే ఊపిరి బాలీవుడ్ రీమేక్ తోపాటు, మరో బాలీవుడ్ చిత్రంలో తమన్నాకు అవకాశం దక్కటంతో ఆమె అందుకు ఆసక్తి చూపలేదని సమాచారం. దీంతో ఐటెమ్ సాంగ్ కోసం కాజల్ ను సంప్రదించగా, భారీ రెమ్యునరేషన్ తో ఆమె అంగీకరించినట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం జనతా గ్యారేజ్ షూటింగ్ ప్రస్తుతం కేరళలో జరుగుతోంది. అక్కడి నుంచి తిరిగి వచ్చిన తరువాత ఈ ఐటెమ్ సాంగ్ ను చిత్రీకరించనున్నారంట. గతంలో ఎన్టీఆర్ కాజల్ కలిసి నటించిన బృందావనం, బాద్ షా. టెంపర్ విజయం సాధించిన సెంటిమెంట్ తో గ్యారేజ్ కూడా హిట్ అవుతుందని అభిమానులు ఆశిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Janatha Garaje  NTR  Kajal  Item Song  Tamanna  

Other Articles