మహేష్ సినిమాకి కామన్ టైటిల్ పెద్ద చిక్కు | title trouble for mahesh murugadoss movie

Title trouble for mahesh murugadoss movie

Title trouble for mahesh movie, Mahesh movie not Vascodangama, mahesh murugadoss movie common title, mahesh murugadoss movie new title

Not Vascodamaga, Title trouble for mahesh murugadoss movie.

కామన్ టైటిల్ పెద్ద సమస్యే!

Posted: 07/29/2016 11:56 AM IST
Title trouble for mahesh murugadoss movie

రెండు భాషల్లో ఏకకాలంలో ఒక సినిమాను నిర్మిస్తుంటే ఆయా భాషలను బట్టి కథానుగుణంగా చిత్రాలకు వేర్వేరు టైటిల్స్ పెడుతుంటారు. అయితే, మహేశ్ బాబు, మురుగదాస్ కాంబినేషన్లో రూపొందుతున్న భారీ చిత్రానికి ఈ సంప్రదాయాన్ని బ్రేక్ చేయాలని చూస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో కామన్ టైటిల్ నిర్ణయించడానికి ఆలోచిస్తున్నారట. దీంతో ఈ చిత్ర టైటిల్ వాస్కోడిగామా కాదనే విషయం స్పష్టమౌతోంది.

80 కోట్ల బడ్జెట్టుతో ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కించడానికి సన్నాహాలు జరుగుతున్న సంగతి మనకు తెలిసిందే. అయితే, రెండు భాషలలోను వేర్వేరు టైటిళ్లు వుండడం కన్నా, కామన్ టైటిల్ గా ఒకటే వుంటే బాగుంటుందని, సినిమాకి మంచి హైప్ వస్తుందని నిర్ణయానికొచ్చిన దర్శక నిర్మాతలు ఆ విధంగా ఆలోచిస్తున్నారట. ఇలా కామన్ టైటిల్ ఉండాలంటే, క్యాచీగా వుండే ఏదైనాఇంగ్లిష్ పదమే పెట్టవచ్చని మనం అనుకోవచ్చు!

అయితే తమిళ భాషలో తెరకెక్కే సినిమాలకు తమిళంలోనే టైటిల్ పెడితే టాక్స్ మినహాయింపు వెసులుబాటు ఉంటుంది. గతంలో చాలా వరకు పెద్ద చిత్రాలు ఇలా టైటిల్ చివరి నిమిషంలో కూడా మార్చి లాభపడినవే. ఈ నేపథ్యంలో మహేష్ చిత్రం భారీ బడ్జెట్ కావటంతో కామన్ టైటిల్ తో నష్టపోయే అవకాశం ఉందని నిర్మాతలు పునరాలోచనలో పడ్డారని తెలుస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mahesh Babu  AR Murugadoss  Vascodagama  new title  

Other Articles