జక్కన్న డ్రీం ప్రాజెక్టుపై దాసరి పంజా | Dasari Narayana rao shocks to SS Rajamouli

Dasari narayana rao shocks to ss rajamouli

Dasari Narayana rao shocks to rajamouli, Dasari Narayana rao talks about mahabharath, Dasari Narayana rao upcoming films, Dasari Narayana rao movie updates, Dasari Narayana rao birthday special, Dasari Narayana rao latest stills, Dasari Narayana rao

Dasari Narayana rao shocks to SS Rajamouli: Director Dasari Narayana rao birthday special interviews. Dasari Narayana rao talks about his upcoming films and projects.

జక్కన్న డ్రీం ప్రాజెక్టుపై దాసరి పంజా

Posted: 05/04/2016 04:46 PM IST
Dasari narayana rao shocks to ss rajamouli

తెలుగులో కమర్షియల్ సక్సెస్ ఫుల్ చిత్రాల దర్శకుడిగా పేరు తెచ్చుకున్న దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళికి దర్శకరత్న దాసరి నారాయణరావు పెద్ద షాక్ ఇచ్చాడు. ఇప్పటివరకు తాను తీసిన సినిమాలన్నీ కూడా ‘మహాభారతం’ను దృష్టిలో వుంచుకునే తీసినవని రాజమౌళి పలు సంధర్భాలలో చెప్పుకొచ్చాడు. పైగా ప్రస్తుతం తీస్తున్న ‘బాహుబలి’ సినిమా కూడా మహాభారతంను దృష్టిలో వుంచుకునే రూపొందిస్తున్నట్లుగా తెలిపారు. తాను ఏ సినిమా తీసిన కూడా మహాభారతం తరహాలో విజువల్ వండర్ గా తీయాలనే ప్రయత్నిస్తానని రాజమౌళి చెప్పుకొచ్చాడు.

అలాగే ‘బాహుబలి’ తర్వాత మహాభారతం సినిమాను పూర్తిస్థాయి విజువల్ వండర్ గా ఎప్పటికైనా తెరకెక్కిస్తానని రాజమౌళి ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. కానీ రాజమౌళి కంటే ముందుగా దాసరి నారాయణ రావు మహాభారతంపై కన్నేసారు. ఇప్పటికే మహాభారతం సినిమా తీయడానికి స్ర్కిప్ట్ వర్క్ కూడా సిద్ధం చేసేసాడట.

దాసరి నారాయణ రావు తన పుట్టినరోజు సంధర్భంగా తాజాగా ఓ మీడియాతో మాట్లాడుతూ... మహాభారతం సినిమాను 5 భాగాలుగా రూపొందించేందుకు సన్నాహాలు చేస్తున్నానని, అదే తన చివరి డైరెక్టోరియల్ చిత్రమని స్పష్టం చేసారు. అంతేకాకుండా ఇప్పటికే 2 భాగాలకు సంబంధించిన స్ర్కిప్ట్ పనులు పూర్తయ్యాయని, త్వరలోనే ఈ ప్రాజెక్ట్ ను సెట్స్ పైకి తీసుకెళ్తానని.. ఓ వైపు షూటింగ్ చేస్తూనే మరోవైపు మిగతా మూడు భాగాల స్ర్కిప్ట్ పనులు పూర్తి చేస్తానని ఆయన చెప్పుకొచ్చారు.

అంటే ప్రస్తుతం దర్శకధీరకు దర్శకరత్న వల్ల గట్టి పోటీయే ఏర్పడింది. రాజమౌళి కంటే ముందుగా దాసరి నారాయణ రావు ‘మహాభారతం’ సినిమా మొదలుపెట్టి విడుదల చేస్తే... ఇక రాజమౌళి తీయడం కుదరదు. ఎందుకంటే చూసిన సినిమానే జనాలు ఎంత బాగా తీసిన మళ్లీ మళ్లీ చూడటం కష్టమే. ఇక అసలే తన డ్రీం ప్రాజెక్ట్ అని చెప్పుకుంటున్న రాజమౌళికి దాసరి తన పుట్టినరోజున పెద్ద షాక్ ఇచ్చాడని అర్ధమవుతోంది. మరి ఈ మహాభారతం వీరిద్దరిలో ఎవరిని వరిస్తుందో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Dasari Narayana rao  SS Rajamouli  Mahabharatham  

Other Articles