18 ఏళ్ల తర్వాత శంకర్ సినిమా | Ditrector cinema after 18 years

Shankar director shankar mudhalavan robo 2 0

Shankar, Director Shankar, Mudhalavan, Robo, 2.0, శంకర్, శంకర్ దర్శకుడు

Star Director Shankar cinema may release after 18 long years. On dewali festival Shakar plans to release 2.0 cinema.

18 ఏళ్ల తర్వాత శంకర్ సినిమా

Posted: 04/29/2016 01:49 PM IST
Shankar director shankar mudhalavan robo 2 0

ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 18 ఏళ్ల తర్వాత సూపర్ స్టార్ డైరెక్టర్ సినిమా రిలీజ్ అవుతోంది.. ఇదంతా అబద్దం అనుకుంటున్నారా..? కాదు కాదు అక్షరాల నిజం. ఇక్కడ ఉన్న చిన్న లాజిక్ ఏంటీ అంటే శంకర్ సినిమాను దీపావళి కానుకగా విడుదల చెయ్యడం 18 ఏళ్ల తర్వాత మళ్లీ కుదురుతోంది అని సమాచారం. భారీ సినిమాలకు కేరాఫ్ గా నిలిచే శంకర్ అద్భుతాలను సృష్టిస్తారు అని కొత్తగా ఏమీ చెప్పక్కర్లేదు. తాజాగా ఆయన రోబో సినిమాకు సీక్వెల్ గా ‘2.0’ తెరకెక్కబోతోంది. రజినీతో పాటుగా అమీ జాక్సన్ ఈ సినిమాలో నటిస్తోంది.

భారీ అంచనాల మధ్య వస్తున్న ఈ 2.0 సినిమాను వచ్చే ఏడాది అక్టోబర్‌ 19న దీపావళి కానుకగా విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయని కోడంబాక్కం వర్గాల కథనం. 23 ఏళ్ల సినీ కెరీర్‌లో ఇప్పటివరకు ఒకే ఒక్కసారి దీపావళికి తన సినిమాను తీసుకొచ్చారు శంకర్‌. అదే ‘ముదలవన్’ (తెలుగులో ‘ఒకే ఒక్కడు’). 1999లో వచ్చిన ఆ చిత్రం తరువాత మళ్లీ 18 ఏళ్లకు అదే పండగ సమయంలో ‘2.0’ని తీసుకొచ్చేందుకు సన్నాహాలు జరుగుతుండడం విశేషమే. పోస్ట్‌ ప్రొడక్షన్ కార్యక్రమాలకే ఏడాదికి పైగా సమయం తీసుకోనున్న ‘2.0’ బాక్సాఫీస్‌ వద్ద ఎన్ని రికార్డులు సృష్టిస్తుందో చర్చ సాగుతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles