Hansika tweets about her blood test

Hansika tweets about her blood test

Hansika went to hospital, Hansika blood test, Hansika health news, Hansika fans in tension, Hansika latest news, Hansika health updates, Hansika movies, Hansika movie news, Hansika hot stills, Hansika latest stills

Hansika tweets about her blood test: kollywood star young heroine Hansika went to hospital for blood test. Hansika tweets about her health and blood test details.

బొద్దుగుమ్మకు బ్లడ్ టెస్ట్... గందరగోళంలో ఫ్యాన్స్!

Posted: 11/30/2015 03:55 PM IST
Hansika tweets about her blood test

తమ అభిమాన హీరోహీరోయిన్లకు ఏమైనా జరిగితే ఫ్యాన్స్ తెగ హడావిడి చేస్తుంటారు. ఇక హీరోయిన్ల గురించి ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. అందులోను హాట్ హాట్ బ్యూటీలకు ఫ్యాన్స్ చాలా ఎక్కువే. ఇక బొద్దుగుమ్మ హన్సికకు తమిళంలో ఫ్యాన్స్ చాలా ఎక్కువనే విషయం తెలిసిందే.

ఎక్కడ నుంచి తెలిసిందో ఏమో కానీ... హన్సిక బ్లడ్ టెస్ట్ చేయించుకుందనే వార్త బయటకొచ్చింది. అంతే ఇక... ఈ అమ్మడి సన్నిహితులు, అభిమానులు తెగ కంగారుపడిపోయారు. హన్సికకు ఏమయ్యిందోనని టెన్షన్ పడ్డారు. అంతేకాకుండా సోషల్ మీడియాలో ఈ అమ్మడికి అభిమానులు పలు జాగ్రత్తలు, ఆరోగ్య క్షేమ సమాచారాలు అడిగేసారు.

ఇక అభిమానుల కంగారు, టెన్షన్ ను గమనించిన హన్సిక.. ఎట్టకేలకు ఈ వార్తపై ఓ క్లారిటీ ఇచ్చేసింది. అయ్యో నాకేం కాలేదు. నేను బాగానే వున్నాను. అయితే రెగ్యులర్ చెకప్ లో భాగంగానే టెస్ట్ చేయించుకున్నానని తెలిపింది. బ్లడ్ టెస్ట్ కోసం రక్తం తీసుకున్నప్పుడు తాను గట్టిగా ఏడ్చానని, కానీ తన తల్లి జాగ్రత్తగా, ఓపికగా సముదాయించినట్లుగా హన్సిక ట్వీట్ చేసింది.

హన్సిక తన హెల్త్ విషయంపై వస్తున్న వార్తలపై క్లారిటీ ఇచ్చేసరికి అభిమానులు కాస్త రిలాక్స్ అయ్యారు. అభిమానులు టెన్షన్ ఈ అమ్మడు గమనించకపోయి వుంటే.. హన్సిక హెల్త్ పూర్తిగా బాగోలేదు కావచ్చని పూజలు, వ్రతాలు చేసేవారేమో మరి. అసలే ఈ అమ్మడికి తమిళంలో గుడిలు కట్టేంత అభిమానులు వున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Hansika  Blood test  Hospital  Hot stills  tweets  

Other Articles