Actress Shamili | romance | Vikram prabhu

Actress shamili romance with vikram prabhu

Shamili re entry, Shamili in vikram prabhu film, Shamili romance, Shamili in vikram prabhu film, Shamili latest news, Shamili movie news, Shamili movie updates, Shamili latest stills, Shamili stills, Shamili

Actress Shamili romance with Vikram prabhu: Kollywood actress Shamili romance with Vikram prabhu in his upcoming film. Shamili movies, news, gossips, stills, gallery.

విక్రమ్ ప్రభుతో రొమాన్స్ చేయనున్న షామిలీ

Posted: 08/26/2015 03:49 PM IST
Actress shamili romance with vikram prabhu

బాలనటిగా మంచి పేరును దక్కించుకున్న బేబీ షామిలి... ఆ తర్వాత హీరోయిన్ గా మారింది. షామిలి హీరోయిన్ గా ‘ఓయ్’ అనే ఒకే ఒక్క చిత్రంలో నటించింది. ఈ సినిమా తర్వాత షామిలి మరే ఇతర సినిమాల్లో నటించలేదు. అయితే ఇపుడు మళ్లీ సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమవుతుంది.

తమిళ యువ నటుడు విక్రమ్ ప్రభు హీరోగా తాజాగా ఓ చిత్రం తెరకెక్కబోతుంది. ఈ చిత్రానికి వీరశివాజీ అనే టైటిల్ ను నిర్ణయించినట్లుగా తెలిసింది. ఇందులో హీరోయిన్ గా షామిలి నటించబోతున్నట్లుగా తెలిసింది. ప్రస్తుతం వరుస హిట్ చిత్రాలతో విక్రమ్ ప్రభు మంచి జోష్ మీదున్నాడు.

ఈ చిత్రానికి గణేష్ వినయన్ దర్శకత్వం వహించనున్నారు. కామెడీ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందనున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. షామిలికి సంబంధించిన విషయాలను త్వరలోనే చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించనున్నారు. కేవలం తమిళంలోనే కాకుండా తెలుగులో కూడా షామిలికి భారీ ఆఫర్లు వస్తున్నాయి. మరి తెలుగులో మళ్లీ ఏ సినిమాతో షామిలి రీ ఎంట్రీ ఇవ్వనుందో త్వరలోనే తెలియనున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Shamili  re entry  vikram prabhu  news  stills  movies  

Other Articles