Tamanna talks about Arya biryani party

Tamanna talks about arya biryani party

Tammanah hot comments on Arya biryani treet, Tammanah talks about arya, Tammanah arya, Tammanah arya movie, Tammanah latest news, Tammanah movie news, Tammanah movie updates, Tammanah stills, Tammanah

Tamanna talks about Arya biryani party: Actress Tammanah hot comments on tamil crazy hero Arya. tamannah talks about arya biryani treat.

ఆర్య బిర్యానీ కోసం తహతహలాడుతున్న తమన్నా

Posted: 06/30/2015 12:07 PM IST
Tamanna talks about arya biryani party

తమిళ సినీ ఇండస్ట్రీలో హిట్టు, ఫ్లాపులతో సంబంధం లేకుండా అమ్మాయి గుండెల్లో భారీ క్రేజ్ ను దక్కించుకున్న క్రేజీ హీరో ఆర్య. ఆర్యకు అమ్మాయిల ఫ్యాన్ ఫాలోయింగ్ బాగా ఎక్కువే. అల్లరి పనులతో తనదైన శైలిలో ఎప్పుడూ అందరిని నవ్విస్తూనే వుంటాడు. అయితే ఆర్యతో నటించే హీరోయిన్లకు మాత్రం ఆర్య అంటే ఎంత ఇష్టమో... అతను పెట్టే బిర్యానీ కూడా అంతే ఇష్టం.

ఇప్పటివరకు ఆర్య తన తోటి నటీనటులకు బిర్యానీ విందు ఇస్తుంటాడు. ఇప్పటి వరకు చాలా మంది హీరోయిన్లు కూడా ఆర్య బిర్యానీకి చాలా ఫిదా అయిపోయారు. కానీ ఆ బిర్యానీలో ఏముందో ఎవరికి అర్థం కావడంలేదట. కానీ బిర్యానీ రుచి మాత్రం కేక అంతే. అయితే ఈ బిర్యానీ విందును తమన్నా మాత్రం ఇంకా రుచి చూడలేదట. ఎందుకంటే ఆర్య ఇంకా తనకు బిర్యానీ విందు ఇవ్వలేదని వాపోతుంది.

తమన్నా ప్రస్తుతం ఆర్యతో కలిసి ‘వాసువుం సరవననుం ఒన్న పడిచ్చవంగ’ అనే చిత్రంలో నటిస్తోంది. అయితే ఈ చిత్ర షూటింగ్ సమయంలో అందరూ కూడా ఆర్య బిర్యానీ గురించే అడుగుతున్నారట. కానీ ఇప్పటి వరకు తనకు మాత్రం అలాంటి బిర్యానీ విందు ఇంకా ఆర్య ఇవ్వలేదని, బహుశా చిత్రం విడుదలైన తర్వాత గ్రాండ్ గా బిర్యానీ పార్టీ ఇస్తాడేమోనని తమన్నా ఎదురుచూస్తోందట.

మరి పాపం తమన్నా బిర్యానీ బాధను ఆర్య అర్థం చేసుకొని కాస్త.. ఆ బిర్యానీ రుచిని చూపిస్తే సినిమా విడుదలయ్యే వరకైనా ఎదురుచూస్తుందేమో. ఆర్య కొంచెం తమన్నాకు కూడా నీ బిర్యానీ రుచి చూపించరాదా!

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Tammanah  Arya  Biryani party  movie news  baahubali  

Other Articles