mahesh babu latest flick srimanthudu first look bicycle cost is very high range | tollywood news

Mahesh babu srimanthudu first look bicycle cost

mahesh babu, srimanthudu first look, mahesh in bicycle, mahesh babu updates, srimanthudu movie updates, koratala siva, shruti hassan, mahesh gallery, mahesh babu photo shoot, srimanthudu movie

mahesh babu srimanthudu first look bicycle cost : the cost of mahesh babu's srimanthudu first look bicycles is 3.5 lakhs which is equal to family car.

‘సైకిలే’ కదాని సైడైపోతే.. కళ్లు బైర్లు కమ్మడం ఖాయం!

Posted: 05/30/2015 02:06 PM IST
Mahesh babu srimanthudu first look bicycle cost

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘శ్రీమంతుడు’. గతేడాది నుంచి చాలా జాగ్రత్తగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీకి సంబంధించి ఫస్ట్ లుక్, టీజర్ ఎప్పుడెప్పుడు విడుదలవుతుందాని అభిమానులు ఎంతగానో వెయిట్ చేశారు. చివరికీ ఈ మూవీ ఫస్ట్ లుక్ ని మే 29వ తేదీన మూవీ యూనిట్ విడుదల చేసింది. ఆ ఫస్ట్ లుక్ లో మహేష్ సైకిల్ మీద కూర్చుని ఎంతో సింపుల్ గా కనువిందు చేశాడు. గతంలో ఎన్నడూలేని విధంగా విడుదలైన ఈ ఫస్ట్ లుక్ కి సినీజనాల నుంచి బాగానే రెస్పాన్స్ వచ్చింది.

అయితే.. మహేష్ లాంటి సూపర్ స్టార్ మూవీ ఫస్ట్ లుక్ అంటే భారీ బ్యాక్ డ్రాప్ తో, యాక్షన్ తరహాలో వుంటుందని అంతా భావించారు. కానీ.. తీరాచూస్తే సైకిల్ మీద కూర్చుని వుండటం అందరికీ ఆశ్చర్యం కలిగించింది. ఏ బెంజి కార్లోనే కూర్చుని వున్న స్టిల్ వుంటే బాగుండేదని, మరీ సామాన్యుడిలా సైకిల్ తొక్కడమేంటి? అని వాదనలు కూడా వినిపించాయి. అయితే.. సైకిలే కదాని సింపుల్ గా తీసిపారేస్తే పొరపాటే! ఎందుకంటే.. మహేష్ ఎక్కిన ఆ సైకిల్ ఆషామాషీ సైకిల్ కాదు. దాని ధర వింటే అందరి కళ్లు బైర్లు కమ్మాల్సిందే! SCALPEL 29ER CARBON2 అనే ఆ బైసికిల్ ధర ఏకంగా మూడున్నర లక్షల ఖరీదైంది. ‘శ్రీమంతుడి’ కోసం ఆ సైకిల్ ని ప్రత్యేకంగా డిజైన్ చేయించారు.

srimanthudu-first-look-imag

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : srimanthudu  mahesh babu  koratala siva  

Other Articles