Bollywood actress Shilpa Shetty Turns RJ For a London Based Radio Station | Bollywood News

Shilpa shetty turns rj for a london based radio station

Shilpa Shetty, Shilpa Shetty news, Shilpa Shetty updates, Shilpa Shetty photo shoot, Shilpa Shetty gallery, Shilpa Shetty news, Shilpa Shetty radio jockey, Shilpa Shetty london based radio station, Shilpa Shetty radio news, bollywood news

Shilpa Shetty Turns RJ For a London-Based Radio Station : Actress Shilpa Shetty, who found popularity in Britain after winning a season of Celebrity Big Brother in 2007, has turned into a radio jockey to talk about Bollywood with the people in London.

‘రేడియో’పై వాలిన పొడుగుకాళ్ల సుందరి

Posted: 05/30/2015 03:20 PM IST
Shilpa shetty turns rj for a london based radio station

వెండితెరపై వెలిగిన కొందరు తారలు బుల్లితెర మీద కూడా సందడి చేస్తున్న విషయం తెలిసిందే! పారితోషికంపరంగా బాగా వర్కౌట్ అవుతుండటంతోపాటు ఆడియెన్స్ కు మరింత చేరువయ్యే అవకాశం వున్న నేపథ్యంలో చాలామంది నటీనటులు ఇలా రెండు తెరలమీద రాణించేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ ట్రెండ్ బాలీవుడ్ లో అయితే ఎక్కువగా కొనసాగుతోంది. నిన్నటివరకు వెండితెరపై అందచందాలతో అలరించిన తారలు.. ఇప్పుడు వెండితెర మీద తళుక్కుమంటున్నారు. ఈ కోవలోకి పొడుగుకాళ్ల సుందరి శిల్పాశెట్టి ఎప్పుడో చేరిపోయింది. ఇప్పుడు ఆమె సరికొత్త అవతారంలో ఎత్తుతోంది.

మొన్నటివరకు బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్.. నిన్నటివరకు బుల్లితెర నటి.. ఇలా రెండు తెరలపై తన మాయాజాలం ప్రదర్శించిన శిల్పాశెట్టి ఇప్పుడు రేడియోపై వాలిపోయింది. అంటే.. రేడియో జాకీ అవతారం ఎత్తనుంది. ‘బీబీసీ రేడియో-2’ ద్వారా లండన్ వాసులకు బాలీవుడ్ ప్రముఖులను పరిచయం చేసేందుకు సన్నద్ధమవుతోంది. ఈ విషయాన్ని స్వయంగా శిల్పాయే తన ట్వీట్ ద్వారా వెల్లడించింది. ఈ రేడియో కార్యక్రమంలో భాగంగానే ఇప్పటికే ఈ అమ్మడు లతామంగేష్కర్, కరణ్ జోహర్ వంటి ప్రముఖులను ఇంటర్వ్యూలు చేసిందట! ఇందుకు తాను ఆ ఇద్దరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు ఆమె పేర్కొంది.

ప్రస్తుతం శిల్పాశెట్టి ఆయా కార్యక్రమాల రికార్డింగులతో లండన్ లో బిజీగా వున్నట్లు చెబుతోంది. అందుకు సంబంధించిన కొన్ని ఫోటోలతో ఈమె పోస్ట్ చేసింది. చివరగా.. సెప్టెంబర్ నుంచి తన వాయిస్ లండన్ శ్రోతులు వింటారని ఆమె ట్వీట్ చేసింది. ఏదైమైనా.. శిల్పాశెట్టి బిజినెస్ పరంగా బాగానే దూసుకుపోతున్నట్లు కనిపిస్తోంది.

shilpa-bba-radio-news

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Shilpa Shetty  London Based Radio Station  bollywood news  

Other Articles