Srija Family members meets Pawan Kalyan | Janasena Party Office

Srija family members meets pawan kalyan

srija family members, pawan kalyan news, pawan kalyan controversy, pawan kalyan updates, pawan kalyan gossips, pawan kalyan updates, srija family news, srija met pawan news, srija updates

Srija Family members meets Pawan Kalyan : Srija who fought with death before few days back is finally cured well with pawan offers. She and family members meets pawan for helping her to cure.

పవన్ తో ముచ్చటించిన ‘శ్రీజ’ కుటుంబం

Posted: 04/20/2015 04:28 PM IST
Srija family members meets pawan kalyan

గతకొన్నాళ్ల కిందట ఆసుపత్రిలో కొనఊపురితో చివరిక్షణాలను లెక్కిస్తున్న ‘శ్రీజ’ అనే అమ్మాయి.. పవన్ ని చూడాలనుందని చివరి కోరిక కోరింది. అంతే! ఈ విషయం తెలుసుకున్న పవర్ స్టార్ పవన్ కల్యాణ్.. మరో క్షణం ఆలస్యం చేయకుండా వెంటనే ఆ అమ్మాయి ముందుకెళ్లి కోరిక తీర్చారు. మొదట కొద్దిసేపటివరకు కళ్లు తెరవలేకపోయిన ఆ అమ్మాయిని చూసి చలించిపోయిన పవన్.. ‘కళ్లు తెరువమ్మా’ అంటూ కన్నీటిపర్యంతమయ్యారు. చివరికి ఆ అమ్మాయి కళ్లు తెరువగా సంతోషంతో ఉప్పొంగి.. ఆపరేషన్ నిమిత్తం రెండులక్షలు సమర్పించారు. ఆయన ఇచ్చిన ఆ రెండు లక్షలు.. రెండు క్షణాల్లో గాల్లో కలిసిపోవాల్సిన ఆమె ప్రాణాలు తిరిగి నిండుగా నూరేళ్లు ఆయుష్షు పోసుకునేలా అభయహస్తాన్నిచ్చాయి.

pawan-srija-01
pawan-srija-02
pawan-srija-03
pawan-srija-04
pawan-srija-05
pawan-srija-06
pawan-srija-07
pawan-srija-08

పవన్ కల్యాణ్ ఇచ్చిన ఆ డబ్బులతో డాక్టర్లు మెరుగైన వైద్యం చేసి ఆమెను కాపాడగలిగారు. అలా తీవ్ర అనారోగ్యం బారినుంచి పవన్ ఓదార్పుతో తిరిగి కోలుకుంది శ్రీజ! దీంతో పవన్ చేసిన సహాయానికి శ్రీజ తల్లిదండ్రులు ఎంతో మురిసిపోయారు. ఒక నటుడిగా కాకుండా సాటి మనిషిగా సహాయం చేసిన పవన్ ను తాము మనసారా ధన్యవాదాలు తెలుపుతున్నామంటూ ఆనందభాష్పాలతో తమ సంతోషాన్ని వ్యక్తపరిచారు. ఈ నేపథ్యంలో శ్రీజ తన తల్లిదండ్రులు నాగయ్య, నాగమణి, సోదరి షర్మిల శ్రీలతో కలసి ఈ రోజు (సోమవారం) ఉదయం తన అభిమాన నటుడు పవన్ ను ఆయన కార్యాలయంలో కలిశారు.

దాదాపు రెండుగంటల సమయం పవన్ ఎంతో ఓదార్పుతో శ్రీజ కుటుంబ సభ్యులతో సంభాషిస్తూ గడిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శ్రీజ పూర్తి ఆరోగ్యవంతురాలు కావటం పట్ల తన సంతోషాన్ని వ్యక్తం చేసారు. శ్రీజకు వైద్యం చేసిన డాక్టర్ ‘అసాదారణ్’కు కృతఙ్ఞతలు తెలిపారు. ‘శ్రీజ’ కుటుంబసభ్యులు పవన్ కళ్యాణ్ ను కలవటం తమకెంతో ఆనందాన్ని కలిగించిందని, ఆయనకు కృతఙ్ఞతలు తెలిపారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Srija family members  Pawan Kalyan  Tollywood News  

Other Articles