kajal agarwal shares her feelings about film industry | Indian Film Industry

Kajal agarwal film industry experience kollywood hindi movies

kajal agarwal news, kajal agarwal updates, kajal agarwal movies, kajal agarwal hot pics, kajal agarwal hot photo shoot, kajal agarwal hot gossips, kajal agarwal gossips, kajal agarwal gallery, kajal agarwal scandals, kajal agarwal love affairs, kajal agarwal affairs

kajal agarwal film industry experience kollywood hindi movies : After journey of ten years in film industry kajal agarwal shares her feeling about movie life.

‘మరే వృత్తిలో లేని సంతృప్తి సినిమారంగంలో దొరికింది’

Posted: 04/18/2015 11:07 AM IST
Kajal agarwal film industry experience kollywood hindi movies

సినీ ఇండస్ట్రీ అంటే ఎవరికి ఇష్టం వుండదు చెప్పండి.. చిన్నపిల్లల నుంచి పెద్దలవరకు ఈ రంగుల ప్రపంచంలో విహరించేందుకు ఎంతో ఆశిస్తుంటారు. ఇండస్ట్రీలో స్థానం దక్కకపోయినా.. అందులో వున్న తారలను చూసి ప్రతిఒక్కరు సంబరిపడిపోతుంటారు. అలాంటప్పుడు ఆ ఇండస్ట్రీలో స్టార్ హోదాలో చెలామణి అవుతున్న వాళ్లు మరెంత ఎగ్జైట్ అవుతుంటారో ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. కొత్తవ్యక్తులతో పరిచయాలు.. రకరకాల ప్రదేశాలకు విహరించడం.. విభిన్న పాత్రల్లో నటించడంతోపాటు ఫ్యాన్స్ అభిమానాన్ని పొందడం లాంటివి వారిని ఎంతో ఉత్సాహపరుస్తుంటాయి. ఆ ఉత్సాహాన్ని నటి కాజల్ అగర్వాల్ తాజాగా వ్యక్తపరిచింది.

‘సినీరంగంలో వున్నవారికి మరే వృత్తిలో లేని కొత్తదనం నిత్యం కనిపిస్తూ వుంటుంది’ అని కాజల్ సంతోషంగా చెబుతోంది. గత పదేళ్ల నుంచి ఇండస్ట్రీలో కొనసాగుతున్న ఈ అమ్మడికి ఇన్నాళ్లు ఆ రంగంలో కొనసాగినందుకు ఒక్కసారి కూడా బోర్ ఫీలవ్వలేదని.. అందులో తాను నిత్యం కొత్తదనాన్ని ఆస్వాదిస్తున్నానని అమ్మడు వెల్లడిస్తోంది. ఈ నేపథ్యంలోనే కాజల్ మాట్లాడుతూ.. ‘ఇతర ఉద్యోగాలు కొన్నాళ్లకే బోర్ కొట్టేస్తాయి. అదే ఆఫీసు.. అదే పని.. అవే మనుషులు! కానీ సినీ పరిశ్రమ అలా కాదు. ఇక్కడి ప్రతిరోజూ కొత్తగా వుంటుంది. ప్రతి సినిమాకి కొత్త వ్యక్తులు చేరుతారు.. ఒక చోట నుంచి మరో చోట విహరిస్తాం.. రకరకాల పాత్రలు పోషిస్తాం.. అందుకే, బోర్ కొట్టని వృత్తి సినీ ఇండస్ట్రీ ఒకటే అని చెప్పొచ్చు’ అని అంటోంది.

ఇదిలావుండగా.. ప్రస్తుతం తెలుగులో ఒక్క ఆఫర్ కూడా లేని ఈ అమ్మడు తమిళంలో రెండు, హిందీలో ఓ సినిమా షూటింగ్ లో బిజీగా వుంది. తీరిక సమయం లేకుండా ఈ మూవీ సినిమాల చిత్రీకరణల్లో బిజీగా వున్న ఈ భామ.. కొత్త పరిచయాలు పెంచుకోవడంతో రకరకాల లొకేషన్లకు విహరిస్తూ బాగానే ఎంజాయ్ చేస్తోంది.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : kajal agarwal  indian film industry  telugu heroines  

Other Articles