Trsiha | Kamalhasan | Movie | Lion

Heroine trisha got new film chance with kamalhassan

Trisha, trisha uodates, trisha news, lion updates, kamalhassan, kamal hassan new film, trsiha with kamalhassan, trisha stills, trsiha gossips

heroine trisha got new film chance with kamalhassan.Trisha did not got hit from last one year. But she getting new offers from star heros. She romancing with nandamuri balakrishna in lion movie.

హిట్ లు లేకున్నా ఛాన్సులు కొట్టేస్తున్నచెన్నై చిన్నది

Posted: 04/18/2015 09:57 AM IST
Heroine trisha got new film chance with kamalhassan

సినిమా ఇండస్ట్రీలో అన్నీ ఉన్నా లక్ లేకపోతే అంతే మరి... చాలా కష్టం. కానీ ఓ చెన్నై చిన్నదానికి మాత్రం లక్ లక్కలాగా అతుక్కు తిరుగుతోంది. వరుస పరాజయాలతో రేసులో వెనకబడిపోయిన ఈ అమ్మడు ఇటీవలకాలంలో అగ్రహీరోల సరసన నటించే అవకాశాల్ని పొందుతోంది. తెలుగు, తమిళ భాషల్లో గత వైభవాన్ని దక్కించుకునే దిశగా ప్రయత్నాల్నిముమ్మరం చేస్తోంది. తాజాగా ఈ సుందరి మరో భారీ చిత్రానికి ఓకే చెప్పింది. కమల్‌హాసన్ సరసన మరోమారు నటించే అవకాశాన్ని సొంతం చేసుకుంది. కమల్‌హాసన్ కథానాయకుడిగా నటిస్తూ స్వీయ నిర్మాణంలో ఓ యాక్షన్, థ్రిల్లర్ చిత్రాన్ని రూపొందించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. జేమ్స్‌బాండ్ తరహాలో సాగే ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో త్రిష కథానాయికగా ఎంపికైంది. ఇందులో ఆమె బాండ్‌గర్ల్ తరహాలో స్టైలిష్‌గా, సరికొత్త రీతిలో వుంటుందని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. మే నెలాఖరున ఈ సినిమా సెట్స్‌పైకి రానుంది. కమల్‌హాసన్ సరసన రెండోసారి నటించే అవకాశం రావడం పట్ల త్రిష ఆనందం వ్యక్తం చేసింది. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన మన్నధన్‌అంబు (తెలుగులో మన్మథబాణం) పెద్ద విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే.

తెలుగులో పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, నాగార్జున, బాలక్రిష్ణ లాంటి స్టార్ హీరోలతో జత కట్టినా పెద్దగా హిట్ సంపాదించలేకపోయింది. ఇక తాజాగా విడుదలైన చిరునవ్వుల చిరుజల్లు డబ్బింగ్ సినిమా కావడం అందులోనూ సినిమా పెద్దగా ఆడకపోవడంతో త్రిషకు పెద్దగా కలిసి రాలేదు. కానీ లెజెండ్ సినిమా తర్వాత బాలక్రిష్ణ నటిస్తున్న భారీ ఎంటర్ టైనర్ లయన్ లో మాత్రం ఛాన్స్ కొట్టేసింది. అలా సినిమాలు హిట్ టాక్ తో సంబందం లేకుండా ఛాన్సులు కొట్టేస్తోంది త్రిష. మొత్తానికి కమల్ హాసన్ లాంటి బిగ్ స్టార్ పక్కన ఛాన్స్ కొట్టేయడం అంటే లక్కేగా మరి..!

**అభినవచారి**

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles