Junior ntr temper movie audio release date puri jagannath kajal agarwal bandla ganesh

temper movie news, junior ntr temper movie news, temper movie audio release, temper movie audio function, junior ntr puri jagannath movie news, kajal agarwal movies, kajal agarwal temper movie, kajal agarwal hot photo shoot, bandla ganesh news

junior ntr temper movie audio release date puri jagannath kajal agarwal bandla ganesh : finally temper movie audio release date fixed.

ఈసారి గ్యారెంటీగా 28న ‘టెంపర్’ లేచిపోద్ది...

Posted: 01/24/2015 04:58 PM IST
Junior ntr temper movie audio release date puri jagannath kajal agarwal bandla ganesh

యంగ్ టైగర్ ఎన్టీఆర్, కాజల్ అగర్వాల్ జంటగా పూరీజగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘టెంపర్’ చిత్రం ఆడియో ఈనెల 28వ తేదీన ఖచ్చితంగా రిలీజ్ కానున్నట్లు యూనిట్ బృందం అధికారికంగా ఖరారు చేసింది. గతంలో ఈ మూవీ ఆడియోను సంక్రాంతి కానుకగా జనవరి 18వ తేదీన విడుదల చేస్తున్నట్లుగా ప్రచారం సాగింది. తర్వాత మళ్లీ 26వ తేదీకి వాయిదా పడింది. నిన్నటివరకు 31వ తేదీన రిలీజ్ చేస్తున్నట్లుగా వార్తలొచ్చాయి. కానీ.. అధికారికంగా బృందం నుంచి ప్రకటన వెలువడి కాలేదు. కానీ తాజాగా జనవరి 28వ తేదీన ఆడియోను ఖచ్చితంగా రిలీజ్ చేస్తున్నట్లుగా ఓ పోస్టర్’ను విడుదల చేసింది.

నిజానికి ఈ మూవీ ఆడియో ఇన్నిసార్లు వాయిదా పడటానికి కొన్ని కారణాలు చోటు చేసుకున్నాయి. ఆమధ్య 24వర్గాల కార్మికులు సమ్మె జరిపిని కారణంగా ఈ మూవీ షూటింగ్ రెండుమూడు రోజులవరకు ఆగిపోయింది. అదికూడా గోవా షెడ్యూల్’లో వున్న సమయంలో ఆ సమ్మె జరగడంతో నిర్మాతకు ఆర్థికపరంగా సమస్యలు ఎదురయ్యాయి. అలాగే.. షూటింగ్ కూడా ఆలస్యంగా జరగడంతో బడ్జెట్ అనుకున్నదానికంటే అధికంగా పెరిగిపోయింది. దాదాపు రూ.35 కోట్ల రూపాయలకంటే ఎక్కువ ఖర్చయినట్లుగా ఇండస్ట్రీ వర్గాలు తెలుపుతున్నాయి. దీంతో నిర్మాతకు ఆర్థిక ఇబ్బందులు పెరగడంతో ఆడియో వేడుకను వాయిదా వేసుకుంటూ వచ్చారు. ఏదైతేనేం.. చివరికి 28వ తేదీన పాటలు రిలీజ్ అవుతున్నాయి.

పరమేశ్వర ఆర్ట్స్ బ్యానర్ లో బండ్లగణేష్ నిర్మించిన ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు. అనూప్ అందించిన పాటలు ప్రేక్షకులను అలరించడం ఖాయమని, ముఖ్యంగా ఇందులో వున్న స్పెషల్ సాంగ్ మాస్ ఆడియెన్స్’ను అలరిస్తుందని అంటున్నారు. అలాగే.. ఇందులో ఎన్టీఆర్, కాజల్ మధ్య కొన్ని రొమాంటిక్ సీన్స్ కూడా వున్నాయని బృందం చెబుతోంది. ఇక వరుసగా ఫ్లాపులను ఎదుర్కొంటున్న ఎన్టీఆర్.. ఈ చిత్రంపై భారీ ఆశలు పెట్టుకున్నాడు. పైగా ఈ మూవీకోసం మొదటిసారి సిక్స్ ప్యాక్ బాడీని ప్రదర్శించాడు కూడా! మరి.. అభిమానులు ఈ మూవీని ఏమేరకు ఆదరిస్తారో వేచి చూడాల్సిందే!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : temper movie news  junior ntr temper movie  kajal agarwal news  

Other Articles