Allari naresh new look from bandipotu

Allari Naresh, Naresh, Allari Naresh latest news, Allari Naresh movies, Allari Naresh photos, Allari Naresh bandipotu movie, Naresh bandipotu movie, Allari Naresh movie collections, Allari Naresh latest updates, Allari Naresh movie news, Allari Naresh cinema News, Allari Naresh upcomming movies, Allari Naresh new look,

Allari Naresh gives his fans a first look of his part in bandipotu

అదరగొట్టే స్టిల్స్ తో అల్లరి నరేష్ బంధిపోటు ఫస్ట్ లుక్..

Posted: 12/21/2014 09:19 PM IST
Allari naresh new look from bandipotu

కామెడీ హీరోగా తనకంటూ కొత్త ఒరవడిని సృష్టించుకున్న హీరో అల్లరి నరేష్. తెలుగు ప్రేక్షకుల హృదయాలను కొల్లగోట్టడానికి బందిపోటుగా త్వరలో మనముందుకు రాబోతున్నారు. అయితే సాదాసీదా బందిపోటులా కాకుండా ఏకంగా మోడ్రన్ బందిపోటుగా తెలుగు ప్రేక్షకులను అలరించనున్నారు. మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో వస్తున్నబందిపోటు సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. త్వరలో నిర్మాణంతర కార్యక్రమాలు పూర్తి చేసి సంక్రాంతి తర్వాత సినిమాను విడుదల చేయడానికి సినిమా యూనిట్ సన్నాహాలు చేస్తుంది.

ఈ చిత్రానికి సంబంధించి ఇవాళ హీరో అల్లరి నరేష్, హీరోయిన్ ఈషాలపై ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. దీంతో పాటు కథానాయిక, నాయకులకు సంబంధించిన కొన్ని స్టిల్స్ విడుదల చేశారు. ఇవి సినిమా స్టిల్స్ అద్భుతంగా వున్నాయని, అల్లరి నరేష్ ను ఢిఫరెంట్ గెటప్ లో చూసిన ప్రేక్షకులలో బంధిపోటు చిత్రంపై ఆసక్తిని పెంచుకున్నారు. అల్లరి నరేష్ స్టైలిష్ లుక్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. అల్లరోడు నటించిన ఇతర సినిమాలకు భిన్నంగా చాలా అందంగా ఈ స్టిల్స్ లో అందంగా కనిపించాడు. గత సినిమాలు ఆశించిన విజయాని అందించకపోవడంతో ఈ సినిమాపై నరేష్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాడు. నరేష్ సరసన ‘అంతక ముందు ఆ తర్వాత’ ఫేం ఈషా జంటగా నటించిన ఈ సినిమాలో, శ్రద్ధా దాస్ ప్రత్యేక పాత్రలో నటించింది. ఓ స్పెషల్ సాంగులో శ్రద్ధా సందడి చేయనుంది. చిత్రానికి సంగీతాన్ని కళ్యాణి కోడూరి అందిస్తుండగా, ఇ.వి.వి. సినిమా పతాకంపై ఆర్యన్ రాజేష్ నిర్మిస్తున్నారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Allari Naresh  Bandipotu  Allari Naresh latest updates  

Other Articles