Balakrishna satya deva movie title changed

balakrishna movie name changed, balakrishna satya deva movie name changed, balakrishna satya deva movie updates, balakrishna lion movie latest news updates, telangana film chamber on balakrishna movie, balakrishna warrior movie cast and crew, tollywood latest new updates

balakrishna satya deva movie title changed : nandamuri hero balakrishna latest movie with satya deva is going to end shooting latest news that this movie title lion changed as warrior because of telangana film producers council force

తెలంగాణ వల్ల పేరుమార్చుకున్న లయన్

Posted: 12/19/2014 09:02 AM IST
Balakrishna satya deva movie title changed

నందమూరి నట సింహం బాలకృష్ణ లేటెస్ట్ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఓ వైపు సినిమా షూటింగ్ జరపుకుంటూనే.., జనవరి 1  కానుకగా అభిమానుల కోసం ట్రైలర్ విడుదల (డిసెంబర్ 31న అర్ధరాత్రి) చేసే పనిలో మూవీ యూనిట్ బిజీగా ఉంది. ఈ సినిమా టైటిల్ వివాదం కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. తెలంగాణ వారితో గొడవ ఎందుకని ‘లయన్’అనుకున్న సినిమా పేరును  ‘వారియర్’గా మార్చినట్లు గుసగుసలు వస్తున్నాయి. బాలయ్య లేటెస్ట్ మూవీకి ‘లయన్’ లేదా ‘వారియర్’ టైటిల్ పెడతారని గతంలోనే ఊహాగానాలు వచ్చిన విషయం తెలిసిందే.

నరసింహుడి పేరుతో సినిమా వస్తే హిట్ అవుతుందని బాలకృష్ణ సెంటిమెంట్. అందుకోసమే ‘లక్ష్మి నరసింహ’, ‘సింహ’ తరహాలో ‘లయన్’ పేరు పెట్టారు. అయితే ఈ టైటిల్ అప్పటికే తెలంగాణ ఫిలిం ఛాంబర్ లో రిజిస్టర్ అయింది. దీంతో వివాదం మొదలయింది. సెంటిమెంట్ కోసం సినిమా టైటిల్ ను తనకు ఇవ్వాలని బాలయ్య స్వయంగా విజ్ఞప్తి చేసినా తెలంగాణ ఫిలిం ఛాంబర్ తగ్గలేదని తెలిసింది. అయితే ఈ విషయంలో చాంబర్ ను తప్పుబట్టలేము. టైటిల్ రిజిస్టర్ చేసినవారు వెనక్కి తగ్గి ఉంటే ఛాంబర్ కు అభ్యంతరం ఉండేది కాదు.

సత్యదేవ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో త్రిష, రాధికా ఆప్టే హీరోయిన్లుగా నటిస్తున్నారు. కొద్దిరోజుల క్రితం విడుదల అయిన ఫస్ట్ లుక్ కు మంచి స్పందన వచ్చింది. సమాజంలో మార్పు కోసం ఓ సామాన్యుడు చేసిన కృషి ఈ సినిమాలో చూపిస్తారని మూవీ యూనిట్ తెలిపింది. దీంతో ఈ ప్రాజెక్టు కూడా ‘లెజెండ్’ తరహాలో హిట్ అవుతుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.

 

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : balakrishna movies  warrior updates  telangana film chamber  

Other Articles