Tamannaa krishna vamsi next movie

tamanna krishna vamsi movie, tamanna krishna vamsi next movie updates, tamanna movie updates, tamannaah arya movie updates, krishna vamsi next movie cast and crew , krishna vamsi next movie updates, tollywod latest news updates, dil raju tamannah movie updates

tamannaa krishna vamsi next movie : director Krishna Vamsi is discussing with Tamanna to do a movie in dil raju production. with govindudu andarivadele average hit krishna vamsi gears up with tamanna

ఉందిలే మంచి కాలం ముందుముందునా..

Posted: 12/19/2014 08:05 AM IST
Tamannaa krishna vamsi next movie

సినిమా కెరీర్ ముగిసిందనీ.., ఇక సర్దుకోక తప్పదని అనుకున్న సమయంలో తమన్నాకు ఊహించని ఆఫర్లు వస్తున్నాయి. డైరెక్టర్లు వరుసగా సినిమా ఛాన్సులు ఇస్తున్నారు. ‘గోవిందుడు అందరివాడేలే’ సినిమాతో మళ్లీ  ఊపందుకున్న కృష్ణవంశీ త్వరలోనే ఓ సినిమా చేయాలని ప్లాన్ చేస్తున్నాడు. పూర్తి లేడి ఓరియంటెడ్ కథతో వస్తున్న ఈ మూవీలో అనుష్కను తీసుకోవాలని భావించారట. అయితే అమ్మడు చాలా బిజీగా ఉండటంతో ప్రస్తుతం ఖాళీగా ఉన్న తమన్నా అయితే బెటర్ అనుుకున్నారు.

ఈ ప్రాజెక్టుపై తమన్నాతో ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయని టాలీవుడ్ టాక్. ఇప్పుడు ఎక్కువగా సినిమాలు లేకపోవటంతో పాటు... క్రియేటివ్ డైరెక్టర్ కథ కావటంతో ఓకే చెప్తుందనే అంటున్నారు. ప్రి ప్రొడక్షన్ పనులు వేగవంతంగా జరుగుతున్న ఈ ప్రాజెక్టులో త్వరలోనే తమన్నా వచ్చి చేరుతుందని తెలుస్తోంది. ఈ సినిమాను ప్రముఖ నిర్మాత దిల్ రాజు, నటుడు ప్రకాష్ రాజు కలిసి నిర్మిస్తున్నారు. త్వరలోనే సినిమాకు సంబంధించి అధికారంగా ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

‘గోవిందుడు అందరివాడేలే’ సినిమాను డైరెక్ట్ చేసిన కృష్ణవంశీ మరోసారి ట్రాక్ లోకి వచ్చాడు. ఈ సినిమా కమర్షియల్ హిట్ కాకపోయినా సినిమాకు మంచి స్పందన వచ్చింది. దీంతో మళ్ళీ సినిమాలు చేయాలని ప్లాన్ చేస్తున్నాడు. అటు మిల్కీ బ్యూటి ప్రస్తుతం ఆర్యతో కలిసి తమిళంలో సినిమా చేస్తోంది. దీంతో పాటు ‘బాహుబలి’ సినిమాలో కూడా హీరోయిన్ గా నటిస్తోంది.


కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : tamanna movie updates  krishna vamsi next movie  tollywood  

Other Articles