Sundeep kishan not interested in multistarrer movies

sundeep kishan next movie, sundeep kihan on multistarrer movies, telugu multistarrer movies, tollywood latest updates, joru movie collections, joru movie review rating

sundeep kishan not interested in multistarrer movies : young hero sundeep kishan says he is not interested in doing multi starrer movies. in sundeep angle multistarrer movies have no use to develope individually so always prefers to do solo or hero roles

అలా చేస్తే మనల్నెవరు చూస్తారు బాసూ...!

Posted: 11/08/2014 01:42 PM IST
Sundeep kishan not interested in multistarrer movies

తెలుగు ఫిలిం ఇండస్ర్టీలో ప్రస్తుతం ఓ క్రేజ్ కొనసాగుతోంది. ఒకే హీరోతో సినిమాలు చేసి.., చూసి ప్రేక్షకులు బోర్ ఫీల్ అవుతుండటంతో కొత్తదనం కోసం ఇద్దరు లేదా ముగ్గురు హీరోలను పెట్టి ఒకే సినిమా తీస్తున్నారు. ఇలా చేయటం వల్ల అందరి హీరోల ఫ్యాన్స్ మూవీకి వచ్చి కలెక్షన్లు పెరగటంతో పాటు, ప్రేక్షకులకు కూడా కొత్తగా ఉంటుందని ప్లాన్లు చేస్తున్నారు. ప్రస్తుతం గోపాల గోపాల, ఆ తర్వాత మరో మూవీ కూడా మల్టీస్టారర్ విభాగంలో సిద్దంగా ఉంది. ఇంతలా క్రేజ్ ఉన్న ఈ సినిమాలను హీరో సందీప్ కిషన్ మాత్రం వద్దు అంటున్నాడు.

కారణం ఏమిటని అడిగితే.., మల్టీస్టారర్ సినిమా అయితే అందర్లో ఒకరిలా కన్పిస్తాం అప్పుడు మనకంటూ ఇమేజ్, క్రేజ్ ఎక్కడ వస్తుంది? అంతేకాదు పర్సనల్ గా కూడా త్వరగా డెవలప్ కాలేము కదా అని చెప్తున్నాడు. ఇందుకు గత అనుభవం కూడా ఉండటంతో ఈ సినిమాల జోలికి వెళ్ళటం లేదంటున్నాడు. గతంలో ఆఫ్ బీట్ సినిమాలు చేసినా హిట్ రాలేదు. దీనికి తోడు ఈ మూవీలు కెరీర్ కు నష్టం కల్గించాయట. దీంతో సొంత కష్టం, నటనపైనే నమ్మకంతో సినిమాలు తీస్తున్నట్లు చెప్పాడు.

హీరో రోల్స్ తో పాటు ఎక్కువగా ఎంటర్ టైన్ మెంట్ కు ప్రాధాన్యం ఇస్తానని చెప్తున్నాడు. కామెడి, కమర్షియల్ యాంగిల్స్ ఉన్న సినిమాలతో పాటు కథ ఉండే ప్రాజెక్టులకు ప్రియారిటీ అని స్పష్టం చేస్తున్నాడు. తాజా సినిమా ‘జోరు’ మాస్ యాక్షన్ కామెడి ఎంటర్ టైనర్ అని.., ఇది తనకు చాలా కొత్తగా ఉందని సందీప్ చెప్పాడు.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sundeep kihan  multi starrer  tollywood  latest news  

Other Articles