I movie release date postponed post productions and dubbing works not completed

i movie, i movie release date, i movie songs, i movie news, i movie latest news, i movie review, i movie cast, i movie telugu review, director shankar, i telugu movie, telugu i movie, chiyan vikram, amy jackson, amy jackson hot photos, kollywood news, telugu news

according to chennai media.. i movie release date postponed by 2015 february because post productions and dubbing works not completed yet

‘‘కన్ను’’కొట్టాడు.. దూరంగా వెళుతున్నాడు..

Posted: 11/08/2014 02:53 PM IST
I movie release date postponed post productions and dubbing works not completed

భారీ సైంటిఫిక్ - ప్రతిష్టాత్మక చిత్రాలను తెరకెక్కించడంలో తనకంటూ ఒక ముద్ర వేసుకున్న శంకర్ దర్శకత్వంలో మరో వండర్ మూవీ ‘‘ఐ (మనోహరుడు)’’ రూపొందిన విషయం తెలిసిందే! దాదాపు రెండేళ్లపాటు షూటింగ్ జరుపుకున్న ఈ మూవీ సుమారు 180 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు. అప్పటివరకు ఎవరూ దీనిమీద అంతగా ఆసక్తి చూపించని ప్రేక్షకులు... ఈ మూవీ టీజర్ రిలీజ్ అయిన తర్వాత సినిమాకోసం వెయ్యికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఊహించని విధంగా ఇతర భాషల్లో డిస్ట్రిబ్యూటర్లు భారీ రేట్లకు చిత్రాన్ని కొనుగోలు చేస్తున్నారు. గత చిత్రాల రికార్డులను బద్దలు కొడుతుందని నమ్మకాన్ని ట్రేడ్ వర్గాలు వ్యక్తపరుస్తున్నారు. మొత్తానికి ఈ చిత్రం విడుదల కోసం తెగ వెయిట్ చేస్తున్నారు.

అయితే ఈ మనోహరుడు మాత్రం మొదట్లో ‘‘కన్ను’’కొట్టి దూరంగా పారిపోతున్నట్లు కనిపిస్తోంది. నిజానికి ఈ సినిమా నవంబర్ నెలలోనే విడుదల కావలసి వుంది. అయితే అనుకోకుండా రిలీజ్ డేట్ ను డిసెంబర్ కి వాయిదా వేసేశారు. దీంతో అభిమానులు ఓ మోస్తరు ఆగ్రహానికి గురైనా.. అందుకు వెయిట్ చేయడానికి సిద్ధంగా వున్నారు. కానీ ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఈ సినిమా డిసెంబర్ లో రావడం అనుమానమేనని తెలుస్తోంది. చెన్నైవర్గాల సమాచారం ప్రకారం.. ఈ విజువల్ వండర్ మూవీ వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకు వస్తుందని టాక్! పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్, డబ్బింగ్ వర్క్స్ పూర్తిగా కాకపోవడమే రిలీజ్ కు లేట్ అవుతోందని యూనిట్ బృందాలు తెలుపుతున్నాయి. దీంతో మరో 100 రోజులకుపైగా ఈ సినిమాకోసం ప్రేక్షకులు నిరీక్షణ చేయక తప్పదు. అయితే ఈ విషయంపై నిర్మాతలు ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.

విక్రమ్, అమీ జాక్సన్ జంటగా నటించిన ఈ సినిమాను 180 కోట్ల భారి వ్యయంతో ఆస్కార్ రవిచంద్రన్ నిర్మించారు. పిసి శ్రీరామ్ సినిమాటోగ్రాఫర్ పనిచేసిన ఈ మూవీకి ఏఅర్ రెహమాన్ సంగీతం అందించారు. తెలుగు ఆడియో త్వరలో విడుదల కానుంది. ఇండియాలో తెలుగు, తమిళ, హిందీ భాషలతోపాటు చైనాలో కూడా ఒకేసారి విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : i movie  director shankar  chiyan vikram  amy jackson  telugu news  

Other Articles