Allu arjun rudramadevi and trivikram combination movies will release in 2015 february

allu arjun in rudramadevi, allu arjun getup in rudramadevi, gona ganna reddy look, allu arjun trivikram srinivas latest movie, allu arjun next movie, rudramadevi release date, allu arjun movie latest updates, tollywood latest updates

allu arjun rudramadevi and trivikram combination movies will release in 2015 february : stylish star allu arjun latest movies rudrama devi and a unnamed project with trivikram srinivas will release by february of 2015 this will give double dhamaka to fans of stylish star

అభిమానులకు బన్నీ డబుల్ ధమాకా!

Posted: 10/22/2014 04:54 PM IST
Allu arjun rudramadevi and trivikram combination movies will release in 2015 february

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అభిమానులకు దీపావళి వేళ డబుల్ ధమాకా అందించే వార్త ఇది. పండగకు తమ అభిమాన నటుడి సినిమా రావటం లేదే అని బాదపడుతున్న ఫ్యాన్స్ కు ఫిలింనగర్ నుంచి ఓ సమాచారం వస్తోంది. అదేమంటే బన్నీ నటించిన రెండు సినిమాలు ఒకేసారి విడుదల అవుతున్నాయట. అనుష్క ప్రధాన పాత్రలో వస్తున్న ‘రుద్రమదేవి’ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ఈ సినిమాను 2015 ఫిబ్రవరిలో విడుదల చేస్తామని సినిమా యూనిట్ వర్గాలు చెప్తున్నాయి.

‘రుద్రమదేవి’లో బన్నీ గోన గన్నారెడ్డి అనే పాత్రలో నటించారు. దీని ఫస్ట్ లుక్ కూడా ఈ మద్య విడుదలై బాగా ఆకట్టుకుంది. ఇక ‘జులాయి’ తర్వాత త్రివిక్రమ్ కాంబినేషన్ లో బన్నీ చేస్తన్న మరో సినిమా కూడా ఫిబ్రవరి 2015లోనే విడుదల అవుతుందట. ముగ్గురు హీరోయిన్లతో కలిసి ఆడే ఈ సినిమాకు ఇంకా పేరు పెట్టలేదు. ప్రస్తుతం షూటింగ్ దశలో ప్రాజెక్టు ఉంది. సమంత, అదాశర్మ తర్వాత మూడవ హీరోయిన్ గా నిత్య మీనన్ ను తీసుకున్నట్లు రెండ్రోజులుగా వార్తలు వస్తున్నాయి. అయితే ఈ విషయాన్ని సినిమా యూనిట్ ఇంకా ప్రకటించలేదు.

అటు తాజా ప్రాజెక్టులో కోలీవుడ్ సూపర్ స్టార్ ఉపేంద్రతో పాటు నటి స్నేహ కూడా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. త్రివిక్రమ్ కాంబినేషన్ తోపాటు ముగ్గురు హీరోయిన్లు, కోలీవుడ్ దిగ్గజం నటిస్తుండటంతో ఈ ప్రాజెక్టుపై భారీ అంచనాలున్నాయి. ఇలా రెండు సినిమాలు ఒకేసారి విడుదల అవుతుండటంతో ఫిబ్రవరి బన్నీ ఫీవర్ తో ఊగిపోవటం ఖాయం అని అంతా చెప్తున్నారు. సో స్టైలిష్ స్టార్ ఫ్యాన్స్ ఈ డబుల్ ధమాకా కోసం  ఇంకా నాలుగు నెలలు ఆగక తప్పదు.

కార్తిక్ 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : allu arjun  rudramadevi  trivikram srinivas  tollywood  

Other Articles