Tollywood latest movies released posters and looks on the occasion of diwali

rajinikanth lingaa posters, rajinikanth in lingaa movie, nithin chinnadana neekosam, nithin next movie, surya mass movie posters, surya mass movie latest updates, surya next movie, rajashekar gaddam gang movies, rajashekar next movie, tollywood latest news, koliwood latest news

tollywood latest movies released posters and looks on the occasion of diwali : tollywood fans creating diwali festival with their stars looks and posters released for festival nithin chinnadana neekosam, surya mass movie , rajinikanth lingaa and gaddam gang of rajashekar movies posters released for diwali

దీపావళికి తెగ లుక్కులు ఇచ్చేస్తున్నారు

Posted: 10/22/2014 05:06 PM IST
Tollywood latest movies released posters and looks on the occasion of diwali

ఈ దీపావళి టాలీవుడ్, కోలివుడ్ సినిమా అభిమానులకు కొత్త పండగను తీసుకువచ్చింది. హీరోలంతా అభిమానుల కోసం తమ సినిమాల పోస్టర్లు, ఫస్ట్ లుక్ లు విడుదల చేస్తున్నారు. ఇందుకు టాలీవుడ్, కోలీవుడ్ అనే తేడా లేదు. అంతా వరుసపెట్టి ఫొటోలను విడుదల చేస్తున్నారు. వీటిని చూసి ఫ్యాన్స్ తెగ సంబరపడుతున్నారు. హీరోల లుక్కులను చూసి పండగ చేసుకుంటున్నారు. తమ అభిమాన నటులు కొత్త సినిమాల్లో ఇలా ఉన్నారా అని చర్చించుకుంటున్నారు. ఈ దీపావళికి వచ్చిన హీరోల పోస్టర్లు, లుక్ లపై మీరూ ఓ లుక్కేయండి.

నితిన్ హీరోగా వస్తున్న కొత్త సినిమా ‘చిన్నదాన నీకోసం’ సినిమా రెండవ పోస్టర్ బుధవారం విడుదల అయింది. అభిమానులకు పండగ కానుకగా ఈ సెకండ్ లుక్ విడుదల చేశారు. రెండవ లుక్ కోసం రెండు పోస్టర్లను రిలీజ్ చేశారు. ఒక పోస్టర్ లో చిన్నదాన్ని ఊహించుకుంటూ హీరో స్టెప్పులేస్తుంటే.. రెండవ పోస్టర్ లో ఏకంగా హీరోయిన్ ను పట్టుకుని ఓ పాట పాడుకుంటున్నాడు. లవర్ బాయ్ లుక్.., నీట్ గా ఉన్న పోస్టర్ ను చూసి ఫ్యాన్స్ తెగ సంతోష పడుతున్నారు. శ్రేష్ట్ మూవీస్ బ్యానర్ పై కరుణాకర్ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాను నితిన్ సోదరి నిఖితా రెడ్డి నిర్మిస్తోంది. అనూప్ రూబెన్స్ ఈ మూవీకి సంగీతం అందిస్తున్నాడు.

ఇక సీనియర్ యాక్టర్ రాజశేఖర్ హీరోగా వస్తున్న ‘గడ్డం గ్యాంగ్’ పోస్టర్ కూడా దీపావళి కానుకగా విడుదల అయింది. తమిళంలో సూపర్ హిట్ అయిన ‘సూదుకవ్వుమ్’ సినిమాకు ఇది రిమేక్. ‘పంజా’ ఫేం అంజలి ఈ ప్రాజెక్టులో హీరోయిన్ గా నటిస్తోంది. జర్నీ సినిమాను తీసిన శరవణన్ దగ్గర పనిచేసిన పి.సంతోష్ ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నారు. శివాజీ శివాత్మక మూవీస్ బ్యానర్ పై జీవితా రాజశేఖర్ నిర్మిస్తున్నారు. కామెడి థ్రిల్లర్ గా ఈ మూవీ తెరకెక్కుతోంది. అచ్చు ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.

Gaddam-Gang

అటు తమిళ సూపర్ స్టార్ రజినికాంత్ కూడా అభిమానులకు దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ ‘లింగా’ సెకండ్ లుక్ రెండ్రోజుల ముందుగా విడుదల చేశారు. సూపర్ స్టార్ డబుల్ రోల్స్ చేస్తున్న ఈ మూవీలో అనుష్క షెట్టి, సోనాక్షి సిన్హా హీరోయిన్లుగా నటిస్తున్నారు. రాక్ లైన్ నిర్మాణ సంస్థ ఆద్వర్యంలో వస్తున్న ఈ సినిమాకు రెహ్మాన్ సంగీతం అందిస్తున్నాడు.  కె.ఎస్. రవికుమార్ డైరెక్షన్ లో వస్తున్న ‘లింగా’ సినిమా రజినీకాంత్ పుట్టినరోజు కానుకగా డిసెంబర్ 12న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. శరవేగంగా జరుగుతున్న ప్రాజెక్టులో భాగంగా.., రజినీ ఇప్పటివరకు షూట్ జరిగిన తన పాత్రలకు డబ్బింగ్ ను ఒకే రోజులో చెప్పేసి అందర్నీ ఆశ్చర్యానికి గురిచేశాడు.

Linga-Mass

మరోవైపు కోలివుడ్ హ్యాండ్సమ్ స్టార్ సూర్య ‘మాస్’ సినిమా కూడా తక్కువ తీసిపోలేదు. ఆయన కూడా అభిమానుల కోసం పోస్టర్ విడుదల చేశారు. హారర్ కధ, కామెడి కధాంశంతో రూపొందుతున్న ఈ సినిమా లుక్ చూసినవారంతా సూర్య సూపర్బ్ అంటున్నారు. సోషల్ మీడియాలో ఈ ఫొటోకు పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. ఇందులో నయనతార, అమీజాక్సన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. వెంకట్ ప్రభు డైరెక్షన్ లో కె.ఈ. జ్ఞానవేల్ ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. స్టూడియో గ్రీన్ బ్యానర్స్ పై వస్తున్న ఈ సినిమాకు యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నాడు. 2015వేసవి కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇలా హీరోలంతా తమ అభిమానుల కోసం తాజా ప్రాజెక్టుల పోస్టర్లు, ఫొటోలు విడుదల చేశారు. ఫ్యాన్స్ కళ్ళలో ఆనందం చూసి స్టార్లు కూడా పండగ చేసుకుంటున్నారు. దీంతో టాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ర్టీల్లో దీపావళి సంబరాలు అప్పుడే మొదలయ్యాయి. మీకు కూడా ‘తెలుగు విశేష్’ తరపున దీపావళి శుభాకాంక్షలు.


కార్తిక్ 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : rajinikanth  surya  nithin  rajashekar  movies  

Other Articles