Preity zinta files complaint on ness wadia and says he threw cigerettes on her

preity zinta files complaint on ness wadia and says he threw cigerettes on her, preity zinta latest news, preity zinta files complaint on ness wadia, preity zinta and ness wadia controversy, ness wadia harrasses preity zinta, preity zinta with ness wadia, ness wadia with preity zinta, preity zinta files complaint on wadia

preity zinta files complaint on ness wadia and says he threw cigerettes on her

ప్రీతిజింటాను సిగరెట్ ముక్కలతో వాడియా కాల్చాడా..?

Posted: 07/23/2014 02:01 PM IST
Preity zinta files complaint on ness wadia and says he threw cigerettes on her

(Image source from: preity zinta files complaint on ness wadia and says he threw cigerettes on her)

గతంలో దావూద్ ఇబ్రహీం ముఠా నుంచి బెదిరింపులు వస్తే... ఏమాత్రం భయపడకుండా నేరుగా పోలీస్ కమిషనర్ కు ఫిర్యాదు చేసి సంచలనంగా పేరు తెచ్చుకున్న హీరోయిన్ ప్రీతిజింటా! ఈ వివాదం తరువాత ప్రీతి బాలీవుడ్ చిత్రపరిశ్రమలోనే డేరింగ్ అండ్ డ్యాషింగ్ యాక్ట్రెస్ గా పేరు నమోదు చేసుకుంది. ఆ తరువాత ప్రతిఒక్కరు ఈమెతో చాలావరకు జాగ్రత్తగా వ్యవహరించడం మొదలుపెట్టేశారు. దావూద్ ఇబ్రహీం ముఠా కూడా ఈమెను ఏమీ చేసుకోలేకపోయింది.

అయితే కొన్ని నెలలక్రితం ప్రీతిజింటాకు, ఆమె మాజీప్రియుడు-ఐపీఎల్ ఓనర్ నెస్ వాడియాకు మధ్య వున్న సంబంధం చెడిన విషయం తెలిసిందే! ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా వాడియా తనతో అసభ్యకరంగా ప్రవర్తించాడని, అసభ్య పదజాలంతో అందరీ ముందు తనమీద చెయ్యి చేసుకున్నాడని ఆమె అతనిపై కేసు వేసింది. దాంతో పోలీసులు ఆమె ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టింది. అప్పట్లో ఆ కేసు ఎన్నో మలుపులు తిరిగింది. నెస్ వాడియాకు బెదిరింపులు కాల్స్ వస్తున్నాయంటూ అతని తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడం, మళ్లీ ప్రీతి-వాడియా మధ్య వ్యవహారం తెరపైకి రావడం జరిగింది.

ఇప్పుడు తాజాగా నెస్ వాడియా నుంచి తనకు ప్రాణహాని వుందని, ఏ క్షణంలోనైనా అతను తనను చంపే ప్రయత్నాలు చేయవచ్చునంటూ ప్రీతి జింటా పోలీస్ కమిషనర్ కు లేఖ రాసింది. అంతేకాదు.. ఆ లేఖలో వాడియా తనను గతంలో ఏ విధంగా చిత్రహింసలకు గురిచేసేవాడో మొత్తం చెప్పింది. ‘‘గతంలో నెస్ వాడియా తనను ఒక గదిలో వేసి బంధించేవాడని, కాల్చిన సిగరెట్ ముక్కలను తన మొహం మీద విసిరేవాడని’’ ఆమె అందులో పేర్కొంది. అలాగే తనను తీవ్రంగా కొట్టేవాడని, నిత్యం మానసిక వేధింపులకు గురిచేసేవాడని... అందువల్లే తాను వాడయా నుంచి దూరమయినట్లు అందులో పేర్కొంది.

నెస్ వాడియాపై పోలీసులకు ఈ విధంగా ఫిర్యాదు చేయడంతో భవిష్యత్తులో తనను అంతమొందించే ప్రయత్నం చేయవచ్చునని... అందుకు తనకు తగిన రక్షణ కల్పించి కాపాడాలని ఆమె కమిషనర్ కు వేడుకుంది. తన చెర నుంచి ఎలాగైనా విడిపించండంటూ ప్రీతిజింటా పోలీసులకు విన్నవించింది. బాలీవుడ్ లో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా కొనసాగిన ప్రీతికి కూడా ఇలా వేధింపులకు గురికావడం చాలా అవమానకరంగానే భావించాలి. ఇంకెన్నాళ్లవరకు మహిళల మీద ఇటువంటి అఘాయిత్యాలు జరుగుతూనే వుంటాయని కొంతమంది మహిళాసంఘాలు ఆమెకు మద్దతుగా నిలిచాయి.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles