Chiranjeevi 150 movie shootiing date finalised by vv vinayak

chiranjeevi 150 movie shootiing date finalised by vv vinayak, chiranjeevi 150 film news, chiranjeevi latest news, chiranjeevi with vv vinayak, chiranjeevi latest news, chiranjeevi news, chiranjeevi in 150 movie, vv vinayak writing script for chiru 150 movie

chiranjeevi 150 movie shootiing date finalised by vv vinayak

చిరు 150వ చిత్రానికి ముహూర్తం ఖరారయినట్టే!

Posted: 07/23/2014 02:27 PM IST
Chiranjeevi 150 movie shootiing date finalised by vv vinayak

(Image source from: chiranjeevi 150 movie shootiing date finalised by vv vinayak)

మెగాస్టార్, మాజీ కేంద్రమంత్రి చిరంజీవి 150వ చిత్రానికి ముహూర్తం దాదాపుగా ఖరారయినట్టేనని ఫిల్మ్ నగర్ లో టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే టాలీవుడ్ మాస్ డైరెక్టర్ అయిన వివి వినాయక్, చిరు 150వ సినిమాకోసం ప్రత్యేకంగా ఒక స్ట్రాంగ్ స్ర్కిప్టును తయారుచేస్తున్నాడని... ఇందుకు సంబంధించిన వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని ఆయన పేర్కొన్నారు. చిరంజీవికి తగ్గట్టుగా ఒక పవర్ ఫుల్ స్ర్కిప్టును సిద్ధం చేసి, గతంలో కంటే భిన్నంగా చిరు పాత్ర వుండేలా ఆలోచిస్తున్నామంటూ ఆయన చెప్పారు.

జి.మామిడాడలోని సూర్యదేవాలయంలో మంగళవారంనాడు స్వామివారిని దర్శించుకున్న వివి వినాయక్... చిరు 150వ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియజేశారు. చిరంజీవి పుట్టిన రోజైన ఆగస్టు 22వ నాటికి స్ర్కిప్టు రెడీ అవుతుందని, ఆరోజే ఆయనకు చూపించి సినిమా షూటింగ్ ముహూర్తాన్ని ఖరారు చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈ సినిమాకు హీరో రామ్ చరణ్ తేజ నిర్మాతగా వ్యవహరించనున్నాడని అన్నారు. వినాయక్ తాజాగా దర్శకత్వం వహించిన ‘‘అల్లుడు శీను’’ సినిమా విజయవంతం కావాలని కోరుకోవడానికి స్వామివారిని దర్శించుకున్నట్లు ఆయన తెలిపారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles