Kajal agarwal demands rs 1 crore for item song

Kajal Agarwal demands Rs 1 crore for Item song, Actress Kajal Agarwal, Kajal Item song in Geetanjali Movie, Kona Venkat Geetanjali movie

Kajal Agarwal demands Rs 1 crore for Item song

కొవ్వెక్కి కోటి డిమాండ్ చేస్తుంది...

Posted: 07/11/2014 11:40 AM IST
Kajal agarwal demands rs 1 crore for item song

టాలీవుడ్ లో టాప్ రేసులో దూసుకుపోతున్న కాజల్ ఇటీవలి కాలంలో కాస్తంత స్పీడు తగ్గించిన విషయం తెలిసిందే. దీనికి ఎన్నో కారణాలు చెబుతున్నా ఫిలింనగర్ నుండి మాత్రం వినిపించేది కాసుల కోసమే అనే మాట గట్టిగా వినిపిస్తుంది. కోటి, కోటిన్నర వీలైతే రెండు కోట్లు ఇచ్చినా తీసుకుంటానని చెప్పడంతో బెంబేలెత్తి పోయి ఈమె వైపు చూడటమే మానేశారు దర్శక నిర్మాతలు.
దీంతో అవకాశాల్లో వెనకబడిపోతున్నానని భావించి టాలీవుడ్ లో ఫామ్ లో ఉన్న వారికే కోటికంటే ఎక్కువ ఇవ్వరని మనస్సు నిమ్మలం చేసుకొని మెల్లిమెల్లిగా అవకాశాలు రాబట్టుకుంటున్న ఈమె కోనవెంకట్ దర్శకత్వంలో తెరకెక్కతున్న ‘గీతాంజలి ’ సినిమా లో ఐటెం సాంగుకు  కమీట్ అయిన విషయం తెలిసిందే.

ఈ సినిమా లేడీ ఓరియెంటెడ్ కావడం, తొలిసారి దర్శకత్వం వహిస్తున్న సినిమా కాబట్టి స్టార్లు ఉంటేనే సినిమాకు హైప్ వస్తుందని భావించిన కోన తనకున్న పరిచయాల ద్వారా కాజల్ ని ఐటెం చేయమని అడిగితే సింపుల్ గా కోటి కొడితే చేస్తానని నిర్మొహమాటంగా చెప్పేసిందట. దీంతో షాక్ తిన్న కోన వెంకట్ తిన్నాడు.

ఈమెకు ఐటెంసాంగులో చేయడం ఇష్టం లేక అంత అడిగిందో లేక కాస్తంత నేము, ఫేము ఉన్న నేను ఐటెం సాంగు చేస్తానంటే ఎంతడిగితే అంతిస్తారని అనుకుందో కానీ చాలా తెలివిగా సమాధానం చెప్పి, తీరా ఇప్పుడు నేను ఐటెం సాంగులో నటించడం లేదని చెప్పింది. ఈమె మాటలు విన్న సినిమా జనాలు కాజల్ కి కొవ్వెక్కి కోటి అడిగి, ఇవ్వరని తెలుసుకొని ఇప్పుడు తప్పించుకునే ప్రయత్నం చేస్తుందని అంటున్నారు.

Knr

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles