Shruti hassan plays prostitute role in telugu movie

Shruthi Hassan playing prostitute role in telugu, shruti hassan prostitute role in Gelupu Gurram, Gelupu guramm telugu movie, D-Day movie dub in telugu

Shruthi Hassan playing prostitute role in telugu

శృతిహాసన్ తెలుగులో వేశ్యగా...

Posted: 07/07/2014 06:43 PM IST
Shruti hassan plays prostitute role in telugu movie

తెలుగులో వేశ్యగా చేసే హీరోయిన్ల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుంది. ఇప్పటికే ‘వేదం ’ సినిమాలో అనుష్క వేశ్యగా నటించి మంచి మార్కులు కొట్టేసింది. ఇప్పుడు శృతి హాసన్ కూడా తెలుగులో వేశ్యగా కనిపించబోతుంది. ఏ సినిమాలో అని ఆశ్చర్యపోకండి. ఇది వరకే బాలీవుడ్ లో ‘డీ డే ’సినిమాలో వేశ్యగా నటించిన విషయం తెలిసందే.

ఇప్పుడు అదే సినిమాను ఉన్నది ఉన్నట్లుగా తెలుగులో డబ్ చేస్తున్నారు. అంటే ఈ అమ్మడు తెలుగులో కూడా వేశ్యగా కనిపించబోతున్నట్లే కదా. ఈ సినిమా డబ్బింగ్ కి సంబంధించిన కార్యక్రమాలు శరవేగంగా పూర్తి చేసి ఈ నెల చివరన తెలుగులో ‘గెలుపు గుర్రం ’ పేరుతో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాడు నిర్మాత. టాలీవుఢ్ లో ప్రస్తుతం శృతికి మంచి క్రేజ్ ఉంది. కేవలం ఆ క్రేజ్ ని క్యాష్ చేసుకోవడానికి ఇక్కడ విడుదల చేస్తున్నాడు.

ఈ సంవత్సరం ఇప్పటికే ఎవడు, రేసుగుర్రం లాంటి హిట్ సినిమాలతో ఈ అమ్మడు మంచి ఫాంలో ఉంది. మాఫియా స్టోరీ నేపథ్యం ఉన్న సినిమా అయినా ఆ సినిమాలో శృతిమించిన అందాలు ఆరబోసిన శృతిని ఇక్కడి జనాలు ఆదరిస్తారనడంలో ఎటువంటి సందేహం లేదు. మంచి రేసులో ఉన్న ఈ గుర్రం మరో ‘గెలుపు గుర్రం ’ అవుతుందో లేదో చూడాలి.

Knr

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles