Victory venkatesh imitates baalayya in drishyam

victory venkatesh imitates baalayya in drishyam, baalayya imitated by venki in drishyam, venkatesh has imitated nandamuri balakrishna, drishyam movie release, dirshyam movie release date, actress meena, hero venkatesh

Victory Venkatesh Imitates Baalayya in Drishyam

వెంకీ కూడా బాలయ్యనే వాడుకున్నాడు...

Posted: 07/08/2014 09:54 AM IST
Victory venkatesh imitates baalayya in drishyam

ఒకప్పుడు స్టార్ హీరోలు ఫైట్లు, రొమాన్స్ చేసి మమా అనిపించేవారు. కానీ ప్రస్తుతం సదరు హీరోల నుండి యాక్షన్, రొమాన్స్ తో పాటు కామెడీని కూడా కోరుకోవడంతో ఇప్పుడు హీరోలు కామెడీ కూడా చేస్తూ ప్రేక్షకుల్ని నవ్విస్తున్నారు. ఒకప్పుడు చిన్నహీరోలే స్టార్ హీరోలను ఇమేటేట్ చేసేవారు ఇప్పుడు స్టార్ హీరోలు కూడా తోటి కథానాయకుల్ని ఇమిటేట్ చేస్తూ మరింత వినోదాన్ని పండిస్తున్నారు.

 ఆ మధ్యన పవన్ ‘గబ్బర్ సింగ్ ’ సినిమాలో , వెంకీ షాడో సినిమాలో కొంతమందిని ఇమేటేట్ చేసి బాగా నవ్వించారు. ఇది బాగా వర్కౌవుట్ కావడంతో వెంకటేష్ ఇటీవల నటించిన ‘దృశ్యం ‘ లో కూడా మరోసారి ఇమిటేట్ చేశాడని టాక్. మరి ఆయన ఎవర్ని ఇమిటేట్ చేశాడనేది టాలీవుడ్ లో ఆసక్తికరమైన చర్చసాగుతుంది. సాధారణంగా సినీ జనాలు బాలయ్యను ఇమిటేట్ చేస్తుంటారు.

ఇప్పుడు వెంకీ కూడా బాలయ్యనే ఇమిటేట్ చేశాడని అంటున్నారు. ‘దృశ్యం ’ సినిమాలో కేబుల్ ఆపరేటర్‌గా సినిమా పిచ్చోడు రాంబాబు‌గా నటిస్తూ బాలకృష్ణను ఇమిటేట్ చేసి సందడి చేశాడని సమాచారం. అయితే వెంకీ మాత్రం బాలకృష్ణను కాదని చెప్పాడు. నాకు తెలిసి అది రజినీ స్టైల్ అని కవర్ చేసే ప్రయత్నం చేశాడు. కానీ సినీ జనాల ఇన్ సైడ్ టాక్ మాత్రం బాలయ్యనే ఇమిటేట్ చేశాడని వినిపిస్తుంది.

మలయాళ వెర్షన్‌లో మమ్ముట్టి‌ని ఇమిటేట్ చేసి మోహన్‌లాల్ థియేటర్స్‌లో జోష్ నింపినట్టే ఇక్కడ వెంకీ కూడా బాగా నవ్వుల్ని పండిచడం ఖాయం అంటున్నారు.  ఈ సినిమా నెల 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

Knr

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles