Kajal have no offers in tollywood

Tollywood actresses, Heroines, Tamanna, Kajal, No offers to Tamanna and Kajal, Telugu movies, Milky beauty, Actress Kajal,

No offers to Kajal in Tollywood

ఈ అమ్మడు పెంచడమే శాపమా ?

Posted: 05/10/2013 06:26 PM IST
Kajal have no offers in tollywood

టాలీవుడ్ అగ్ర తారల్లో ఒకరిగా వెలిగిపోతున్న కాజల్ కి ఏమీ లేవా ? అంటే చేతిలో ఒక్క సినిమా కూడా లేదా అంటే అవుననే అనిపిస్తుంది. బాలీవుడ్ హీరోలు ఈ అమ్మడు పై మోజు పడుతున్నా, తెలుగు లో మాత్రం ఈ అమ్మడు చేతిలో ఒకే ఒక్క సినిమా మాత్రమే ఉంది. అది ఎప్పుడో కాల్షీట్లు ఇచ్చేసిన ‘ఎవడు ’. ఆ సినిమా తరువాత తెలుగులో ఒక్క అవకాశం కూడా రాలేదు. దీనికి కారణం అమ్మడు అత్యాశకు పోయి, భారీగా పారితోషికం పెంచేయడమే కారణం అని టాలీవుడ్ వర్గాలు చెబుతున్న మాట. ఈ విషయం పై మీడియారు ప్రశ్నించగా అదేం కాదంటూ కాస్తంత ఘాటుగానే స్పందించింది. నేను ప్రస్తుతం తమిళ సినిమాల్లో బిజీగా ఉండటం వల్లనే తెలుగులో సినిమాలు ఒప్పుకోవడం లేదని కవర్ చేసుకునే ప్రయత్నం చేసింది. ప్రస్తుతం ఈ అమ్మడు తమిళ హీరో విజయ్ ప్రక్కన ‘జిల్లా ’ సినిమాలో, కార్తీతో ఓ సినిమాలో చేస్తుంది. వీటితోనే టైం సరిపోతుంది. ఇక కొత్త సినిమాలు చేసే టైం ఎక్కడుందని ఎదురు ప్రశ్నిస్తుంది. ఇక మీరన్నట్లు పారితోషికం పెంచిన కారణంగా అవకాశాలు రావడం లేదనటం కరెక్టు కాదు అని చెప్పుకొచ్చింది. మొన్నటి వరకు నాలుగు కంటే ఎక్కువ సినిమాల్లో నటించిన ఈ అమ్మడు మూడు సినిమాలకే డేట్లు లేవనడం వెనుక రేటు భారీగా పెంచడం తోనే కాజల్ ని ప్రక్కన పెట్టేశారని అనుకుంటున్నారు సినీ జనాలు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles