Politician daughter harassing prabhas

oliticians Daughter Harassing, Harassing Prabhas, Prabhas Love Affair, love with Prabhas, Prabhas New look, Bahubali movie Prabhas looks, Bahubali Audio

Politicians Daughter Harassing Prabhas.

ప్రభాస్ వెంట పడుతున్న రాజకీయ నాయకుడి కూతురు

Posted: 04/25/2013 08:30 PM IST
Politician daughter harassing prabhas

టాలీవుడ్ లో రెబల్ స్టార్ గా అభిమానులను అలరిస్తు, ఇంత వరకు పెళ్ళి చేసుకుండా అమ్మాయిల మనస్సులను కలవరపెడుతున్న హీరో ప్రభాస్ పెళ్లికి ఇంకా రెండేళ్ల టైం పెట్టాడు. ఆ సంగతి ప్రక్కన పెడితే.... ఈ మధ్య వచ్చిన మిర్చి సినిమాలో యంగ్ అండ్ డైనమిక్ లుక్ లో అమ్మాయిల కలల రాకుమారుడిగా వారికి నిద్రపట్టకుండా చేస్తున్నాడు. ఎంత మంది అమ్మాయిలు ఇష్టపడ్డా ప్రభాస్ మాత్రం ఇంత వరకు ఏ అమ్మాయిని లవ్ చేయలేదు. కానీ ఈ మధ్య ఓ రాజకీయ నాయకుడి కూతురు ప్రభాస్ కి వీరాభిమానట. తన పలుకుబడితో ఆ అమ్మాయి రోజు ప్రభాస్ ను కలిసేదట. దీంతో ఆ అమ్మాయి ప్రభాస్ లేకుండా బతకలేనంత స్థితికి వచ్చేసిందట. ఈ మధ్య తరుచూ ప్రభాస్ కి ఫోన్ చేస్తూ విసిగించడమే కాకుండా , నీవు లేని జీవితాన్ని నేను ఊహించుకోలేను.... నేను నిన్ను గాఢంగా ప్రేమిస్తున్నాను నిన్ను తప్ప వేరే వారిని పెళ్లి చేసుకోను అని టార్చర్ చేస్తుందని టాలీవుడ్ జనాల నుండి వచ్చిన వార్త. మరి ఆ అమ్మాయి ప్రేమను ప్రభాస్ అంగీకరిస్తాడో లేదో తెలియదు కానీ ప్రభాస్ కు ఓ లవర్ దొరికిందని అనుకుంటున్నారు సినీ జనాలు. మరి రాజమౌళి సినిమా తరువాత పెళ్లి చేసుకుంటానని చెప్పిన ఇతను ఈమెనే చేసుకుంటాడా ? లేక మరెవరినైనా చేసుకుంటాడో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles