Eerojullo movie 175days

eerojullo movie 175days

eerojullo movie 175days

16.gif

Posted: 09/14/2012 05:58 PM IST
Eerojullo movie 175days

ee_rojullo_inner        ఇటీవల అంతా యువనటులతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ‘ఈరోజుల్లో’. ఈ సినిమా గురించే ఇప్పుడు ఫిల్మ్ నగర్ లో భారీ చర్చ జరుగుతుంది. ఈరోజుల్లో ఏసినిమా అయినా వందరోజులు ఆడటమే గగనం. అలాంటిది ‘ఈరోజుల్లో’ మూవీ నిన్నటితో ఏకంగా 175 రోజులు ప్రదర్శించటం విశేషం. కొత్తవారితో గుడ్‌సినిమా గ్రూప్‌ నిర్మాణ సారథ్యంలో గుడ్‌ఫ్రెండ్స్‌ అయిన శ్రీనివాస్‌, మారుతీలు కలిసి ఈ చిత్రాన్ని తీశారు. ఈ సందర్భంగా శ్రేయ మీడియా కార్యాలయంలో నూతనోత్సాహం వెల్లివిరుస్తోంది.  చిత్ర దర్శకుడు కేక్‌ కట్‌చేసి తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. స్నేహితులంతా కలిసి ఒక సినిమా చేద్దామని ప్రారంభించిన 'ఈరోజుల్లో' సినిమా ఓ ట్రెండ్‌ సెట్టర్‌ అయింది. అతి తక్కువ బడ్జెట్‌తో తీసిన మా సినిమా ఎన్నో నూతన చిత్రాలకు ఆదర్శంగా నిలిచింది. మాకు 75 సినిమాలు తీసేంత ఎనర్జీ వచ్చింది. ఒక హగ్‌ జీవితాన్ని మార్చేసిందన్నట్టు...ఈ సినిమా మా జీవితాల్ని మార్చేసింది' అని అన్నారు.నిర్మాత ఎస్‌కెఎన్‌ మాట్లాడుతూ..'ఎలాంటి సినిమా అయినా 4,5 వారాలకన్నా ఎక్కువ ఆడని ఈరోజుల్లో మా చిత్రం 175 రోజులు ఆడడం చాలా ఆనందంగా ఉంది. కాకినాడలోని ఓ థియేటర్‌లో విజయవంతంగా ప్రదర్శిస్తున్నారు. కొత్తకథలతో వచ్చే ప్రతి సినిమానూ ప్రేక్షకులు ఆదరిస్తారని నిరూపించా'నని తెలిపారు. త్వరలో మా నూతన చిత్రం 'రొమాన్స్‌' రెగ్యులర్‌ షూటింగ్‌కు వెళ్ళబోతుందని వెల్లడించారు. ఈ సందర్భంగా ప్రత్యేక ట్రైలర్ ను విడుదల చేశారు.

..avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Mana vuri sakshiga movie
Ms narayana as gadafi role  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles