Mana vuri sakshiga movie

mana vuri sakshiga movie , audio release in prasad labs hyderabad

mana vuri sakshiga movie

12.gif

Posted: 09/14/2012 06:14 PM IST
Mana vuri sakshiga movie

mana_voori_inneree       వినడానికి కొత్తగానూ..వింతగానూ అనిపించే సినిమా ఓకటి త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఊరి జనమే నటీనటులుగా రూపొందుతోన్నఈ చిత్రం పేరు 'మన ఊరి సాక్షిగా'. కృష్ణ దర్శకుడు. ఫ్రెండ్స్‌ క్రియేషన్స్‌, వాల్మీకి పిక్చర్స్‌ పతాకంపై రూపొందుతోంది. ఈ చిత్రం ఆడియో ప్రసాద్‌ల్యాబ్స్‌ లో విడుదల చేశారు. బ్రహ్మానందం ఆడియోను ఆవిష్కరించి పరుచూరి గోపాలకృష్ణకు అందించారు. అనంతరం బ్రహ్మానందం మాట్లాడుతూ...'చిత్రానికి నాకూ సంబంధం లేదు. కానీ దర్శకుడు వచ్చి ఒక పల్లెటూరిలో జరిగిన సంఘటన ఇతివృత్తంగా ఊరిజనమే నటులుగా తీశామని చెప్పినప్పుడు నేనూ పల్లెటూరి నుంచి వచ్చాను గనుక ఈ కార్యక్రమానికి వచ్చి మాట్లాడాలనుకున్నా. పల్లె అంటే తీపి జ్ఞాపకాల గుర్తు. జొన్న అన్నం, ఉల్లిపాయ, మిరపకాయ ఇలా చాలా విషయాలు గుర్తుకువస్తాయి. ఈ సినిమాలో నటించినవారందరూ మట్టిలో మాణిక్యాలే. మంచి విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నా'నని అన్నారు. భరద్వాజ మాట్లాడుతూ..'ప్రతిభ, పట్టుదల గల ఇలాంటి దర్శకుల అవసరం ఇండిస్టీకి ఎంతైనా ఉంది. తక్కువ బడ్జెట్‌తో సినిమాను రూపొందించాడు. అందరికీ ఈ చిత్రం మార్గదర్శకం అవ్వాలని ఆశిస్తున్నా'నని అన్నారు. దర్శకుడు కృష్ణ మాట్లాడుతూ... 'మిత్రులతో కలిసి సినిమాను తీశాను. మా ఊరిలో వారే నాలుగువందల మంది నటించారు. చక్కటి వాతావరణంతో రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకాదరణ పొందుతుందనే నమ్మకముంది' అని తెలిపారు. ఇంకా చిత్ర కథనాయాకుడు పప్పుశ్రీను, కథానాయిక వెన్నెల, సంగీత దర్శకుడు గిడియోనులు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Cool boys hot girls
Eerojullo movie 175days  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles