2012 oscar award announced

2012 ,oscar ,award ,announced

2012 oscar award announced

2.gif

Posted: 02/27/2012 12:20 PM IST
2012 oscar award announced

        oscar_poster ప్రపంచ చలనచిత్ర రంగంలో అత్యున్నతంగా భావించే ఆస్కార్ అవార్డుల వేడుకలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుగా చూస్తున్న ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం లాస్ఏంజల్స్ కొడాక్ థియేటర్ లో జరుగుతోంది. ఈ ఏడాది రికార్డ్‌ స్థాయిలో హ్యూగో చిత్రం ఐదు ఆస్కార్‌లను దక్కించుకుంది.hugo

            'హ్యూగో ' చిత్రం ఈ ఏడాది సింహభాగం ఆస్కార్‌ అవార్డుల్ని ఎగరేసుకుపోయింది. ఐదు విభాగాల్లో ఈ సినిమా అవార్డులు గెలుచుకుంది. సినిమాటోగ్రఫీ, కళాదర్శకత్వం, సౌండ్‌ ఎడిటింగ్‌, సౌండ్‌ మిక్సింగ్‌, విజువల్‌ ఎఫెక్ట్స్‌ విభాగాల్లో ‘హ్యూగో’ ఆస్కార్‌లను కైవసం చేసుకుంది.artist_and_tintin
          2012 ఆస్కార్ లో హవా చాటిన మరికొన్ని చిత్రాల విషయానికొస్తే,  కాస్ట్యూమ్‌ డిజైన్‌లో 'ది ఆర్టిస్ట్‌' చిత్రం ఆస్కార్‌ దక్కించుకుంది. కాస్ట్యూమ్‌ డిజైనర్‌గా మార్క్‌ బ్రిడ్జెన్‌ అవార్డ్‌ గెలుచుకున్నాడు.
          మరోవైపు ఐరన్‌లేడీ సినిమాకి బెస్ట్‌ మేకప్‌ అవార్డ్‌ దక్కింది. ఫారెన్‌ లాంగ్వేజ్‌ చిత్రానికి ఇరాన్‌ మూవీ ది సెపరేషన్‌ ఆస్కార్‌ గెలుచుకుంది.వివిధ కేటగిరిలు, వాటి సినిమా వివరాలు మీకోసం....a_seperation

1. ఉత్తమ చిత్రం “ది ఆర్టిస్ట్.”
2. నటుడు: జీన్ డుజార్డిన్, “ది ఆర్టిస్ట్.”
3. నటి: మెరిల్ స్ట్రీప్, “ది ఐరన్ లేడీ.”
4. సహాయ నటుడు: క్రిస్టోఫర్ ప్లమ్మర్, “బిగినర్స్.”
5. సహాయ నటి: ఆక్టేవియ స్పెన్సర్, “ది హెల్ప్.”
6. దర్శకుడు: మిచెల్ హజానవిక్యుస్, “ది ఆర్టిస్ట్.”
7. విదేశీ ఉత్తమ చిత్రం: “ఎ సేపరేషణ్,” ఇరాన్.
8. ఆడాప్ఠెడ్ స్క్రీన్ప్లే: అలెగ్జాన్డర్ పేని, నాట్ ఫాక్సన్ మరియు జిమ్ రాష్, “ది డెసిడెన్ట్స్.”
9. ఒరిజినల్ స్క్రీన్ప్లే: వుడీ అలెన్, “మిడ్ నైట్ ఇన్ పారిస్.”        the_iron_lady.jpeg10. యానిమేటెడ్ ఫ్యూచర్ ఫిలిం: “రాంగో.”
11. ఆర్ట్ డైరెక్షన్: “హుగో.”
12. సినిమాటోగ్రఫీ: “హుగో.”
13. సౌండ్ మిక్సింగ్: “హుగో.”
14. సౌండ్ ఎడిటింగ్: “హుగో.”
15. ఒరిజినల్ స్కోర్: “ది ఆర్టిస్ట్.”
16. ఒరిజినల్ సాంగ్: “మ్యాన్ ఆర్ మప్పెట్” ఫ్రం “ది మప్పెట్స్ .”
17. కాస్ట్యూమ్ డిజైన్: “ది ఆర్టిస్ట్.”
18. డాక్యుమెంటరీ ఫ్యూచర్: “అన్డెఫీటెడ్.”
19. డాక్యుమెంటరీ షార్ట్: “సేవింగ్ పేస్.”
20. ఫిలిం ఎడిటింగ్: “ది గర్ల్ విత్ ది డ్రాగన్ టాటూ.”
21. మేక్అప్: “ది ఐరన్ లేడీ.”
22. యానిమేటెడ్ షార్ట్ ఫిలిం: “ది ఫెంటాస్టిక్ ఫ్లయింగ్ బుక్స్ అఫ్ మిస్టర్. మోరిస్ లెస్ మోర్.”
23. లైవ్ యాక్షన్ షార్ట్ ఫిలిం: “ది షోర్.”
24. విజువల్ ఎఫెక్ట్స్: “హుగో.”

best_actor_and
          కన్నుల పండువగా జరుగుతోన్న ఈ ప్రదానోత్సవ కార్యక్రమంలో అతిరధ మహారధులైన సినీ, ఇతర రంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు. 


...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Heroine sonia agarwal opens music learning centre
Bolly wood badsha sharukh khan house in dipute  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles