Idea Cellular rejects Vodafone India merger talk

Vodafone idea in exploratory talks for mega merger

telecom industry, idea cellular, vodafone, merger, bharati airtel, telecom barati airtel, indian telecommunications, reliance jio, reliance info com, aircel, telenor

The market's number two and three players may merge to create India's number one telecoms firm by a distance.

టెలికాం రంగంలో భారీ మెర్జర్.. వోడాఫోన్, ఐడియా విలీనం

Posted: 08/24/2016 07:59 PM IST
Vodafone idea in exploratory talks for mega merger

మొబైల్ ఫోన్లు అందుబాటులోకి వచ్చి రాగానే ఫోన్ వినియోగం విరివిగా పెరగడం ప్రారంభించి.. స్మార్ట్ ఫోన ఆగమనంలో మరింతగా దూసుకెళ్తూ.. ప్రతీ ఒక్కరి చేతిలో ఫోన్ తప్పనిసరి వస్తువుగా, అవసరంగా మారిపోయింది. దీంతో వాణిజ్యపరంగా ఎదురులేకుండా వుండేందుకు పలు సర్వీసులు తమ కస్టమర్లకు కొత్త  కొత్త ఆఫర్లు, పథకాలతో అకర్షిస్తునే వున్నాయి. కాగా నెంబర్ వన్ స్థానంలో కొనసాగేందుకు తాజాగా దేశ టెలికాం రంగంలోనే కనీవినీ ఎరుగని రీతిలో రెండు బడా సంస్థలు ఏకం అవుతున్నాయన్న సంకేతాలు వెలువడ్డాయి.

అగ్రగామి కంపెనీలు ఐడియా సెల్యులర్, వొడాఫోన్ విలీనానికి ఉన్న అవకాశాలపై ఇరు సంస్థల మధ్య చర్చలు జరుగుతున్నట్టు జాతీయ మీడియా సంస్థ ఒకటి వెలుగులోకి తెచ్చింది.  ఇదే నిజమైతే ఐడియా, వొడాఫోన్ విలీనంతో మార్కెట్ పరంగా దేశ టెలికం రంగంలో అతిపెద్ద కంపెనీ ఆవిర్భవించనుంది. ఒకపక్క సేవల పరంగా టెలికం కంపెనీల మధ్య తీవ్ర పోటీ నడుస్తుండగా... మరోవైపు రిలయన్స్ జియో అత్యంత వేగంతో కూడిన 4జీ సేవలను అతి తక్కువ ధరలకే అందించడం ద్వారా మార్కెట్‌ను కొల్లగొట్టడానికి రంగం సిద్ధం చేసుకున్న క్రమంలో తాజా విలీన వార్తలు రావడం ఆసక్తికి దారితీసింది.

అయితే విలీనం వార్తలను ఐడియా సెల్యూలార్ సంస్థ తోసిపుచ్చింది. అవన్నీ కల్పిత వార్తలని పేర్కోంది. వొడాఫోన్ ఐపీవోకు రావాలని గత కొంత కాలంగా ఆలోచన చేస్తోంది. ఈ సంస్థ విలువ 11 బిలియన్ డాలర్లుగా ఉంటుందని... ఐడియా సెల్యులర్ విలువ 5 బిలియన్ డాలర్లు ఉండవచ్చని అంచనా. రెండు కంపెనీలు విలీనమైతే సంయుక్త సంస్థ మార్కెట్ విలువ 16 బిలియన్ డాలర్లు అవుతుందని తెలుస్తోంది. ఐడియా సెల్యులర్ ఇప్పటికే స్టాక్ మార్కెట్లలో లిస్ట్ అయి ఉండడంతో వొడాఫోన్ ఐపీఓకు రావాల్సిన అవసరం తప్పుతుంది.

అయితే, సంయుక్త కంపెనీ మార్కెట్ వాటా కొన్ని సర్కిళ్లలో 50 శాతానికి మించనుండడంతో నియంత్రణపరమైన అనుమతులు కష్టతరం కావచ్చని విశ్లేషకుల అభిప్రాయం. వొడాఫోన్ గతంలో టాటా టెలీసర్వీసెస్ వంటి ఇతర సంస్థలతోనూ విలీనంపై చర్చలు సాగించినా కార్యరూపం దాల్చలేదు. కాగా, తాజా విలీన వార్తలపై స్పందించేందుకు వొడాఫోన్ నిరాకరించింది. ఈ నేపథ్యంలో ఈ రెండు సంస్థలు విలీనం దిశగా అడుగులు వేస్తాయా.. లేదా..? అన్నది వేచి చూడాల్సిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : telecom industry  idea cellular  vodafone  merger  bharati airtel  telecom  

Other Articles