Urjit Patel appointed new RBI governor, to replace Raghuram Rajan

Urjit patel succeeds raghuram rajan as new rbi governor

Yale University, World Bank, Urjit Patel, Reliance Industries, Raghuram Rajan, Oxford, Nomura, Narendra Modi, monetary policy

Prime Minister Narendra Modi appointed Urjit Patel as the 24th governor of the Reserve Bank of India ending months of speculation about the successor to the high profile Raghuram Rajan

రఘురామ్ రాజన్ వారసుడిగా ఉర్జిత్ పటేల్.. ఉత్కంఠకు తెర..

Posted: 08/20/2016 06:12 PM IST
Urjit patel succeeds raghuram rajan as new rbi governor

ఆర్బీఐ ప్రస్తుత గవర్నర్ రఘురామ రాజన్ వచ్చే నెల 4న తన పదవికి వీడ్కోలు పలుకుతున్న తరుణంలో ఆయన వారసులుగా ఎవరిని నియమించనున్నారన్న ఉత్కంఠకు తెరపడింది. భారత దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు, రఘురామ్ రాజన్ నుంచి ఎవరు పగ్గాలను అందుకుంటారా..? అన్న ఉత్కంఠకు ఎట్టకేలకు కేంద్రప్రభుత్వం తెరదించింది. స్థానంలో ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. భారతీయ రిజర్వ్ బ్యాంక్ కొత్త గవర్నర్గా ఉర్జిత్ పటేల్ నియమితులయ్యారు.

ఈ పదవికి ప్రముఖంగా ఎనమిది మంది పేర్లను పరిశీలించిన తరువాత వాటిని కూడా కుదించిన కేంద్రం నలుగురి పేర్లను పరిశీలించింది. వీరిలో భారతీయ రిజర్వు బ్యాంకు ప్రస్తుత బ్యాంకు ఢిప్యూటీ గవర్నర్లతో పాటు మాజీ ఢిప్యూటీ గవర్నర్ల పేర్లు కూడా ముందుకు వచ్చాయి. అయితే తుదకు ఉర్జిత్ పటేల్ కు ఆ అవకాశం దక్కింది, ఆయన మూడేళ్లపాటు పదవిలో కొనసాగనున్నారు. ఆ మరుసటి రోజు ఉర్జిత్ ఆర్బీఐ 24వ గవర్నర్ గా బాధ్యతలు స్వీకరించే అవకాశముంది.

52 ఏళ్ల ఉర్జిత్ పటేల్ ప్రస్తుతం ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్గా పనిచేస్తున్నారు. ఉర్జిత్ లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుంచి బీఏ, ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ నుంచి ఎంఫిల్ చేశారు. యేల్ యూనివర్శిటీ నుంచి ఆర్థిక శాస్త్రంలో డాక్టరేట్ అందుకున్నారు. ఉర్జిత్ కెన్యా పౌరసత్వంతో గతంలో అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్)లో విధులు నిర్వహించారు. 1991-94 మధ్యకాలంలో ఐఎంఎఫ్‌లో పనిచేశారు. 2000-04 మధ్య కేంద్రంలోని పలు కమిటీల్లో పనిచేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Urjit Patel  new RBI Governor  Raghuram Rajan  Narendra Modi  monetary policy  

Other Articles