Beauty benefits with kharbuja fruits | oily skin problems | beauty home remedies

Kharbuja beauty benefits oily skin problems healthy home remedies

Kharbuja face pack, Kharbuja beauty benefits, Kharbuja fruits tips, Kharbuja health tips, Kharbuja fruits juices, beauty juices, Kharbuja beauty benefits, beauty tips, beauty tips telugu, beauty home remedies

Kharbuja beauty benefits oily skin problems healthy home remedies : oily skin problems can get rid of by using kharbuja face pack.

జిడ్డు చర్మానికి చెక్ పెట్టే ‘ఖర్బూజ’

Posted: 05/25/2015 07:13 PM IST
Kharbuja beauty benefits oily skin problems healthy home remedies

వేసవికాలం వచ్చిందంటే చాలు.. ఎండతాపం ప్రభావానికి చెమట ఎక్కువగా విసర్జించడంతో చర్మం జిడ్డుగా మారుతుంది. ముఖ్యంగా అందంగా వుండే ముఖం చెమటతో జిడ్డుగా మారిపోయి.. అందవిహీనంగా తయారవుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో బయటికెళ్తే.. దుమ్ము, ధూళి, కాలుష్య వాతావరణంతో చర్మసమస్యలు మరీ ఎక్కువవుతాయి. ఫలితంగా నల్లని మచ్చలు ఏర్పడటం, మొటిమలు రావడం, కంటికింద నల్లటి వలయాలు ఏర్పడటం వంటివి సమస్యలు అధికమవుతాయి. అలాకాకుండా జిడ్డు చర్మం నుంచి త్వరగా ఉపశమనం పొందితే.. ఆ సమస్యలను అధిగమించవచ్చు.

జిడ్డు చర్మం సమస్య నుంచి ఉపశమనం పొందేందుకు మార్కెట్ లో రకరకాల బ్యూటీ ప్రోడక్ట్స్ లభ్యమవుతాయి. అయితే.. వాటికంటే ఇంట్లోనే కొన్ని పండ్లతో తయారుచేసుకునే ఫేస్ ప్యాక్స్ మరింత సమర్థవంతంగా పనిచేసి.. ఆ సమస్య నుంచి తక్షణమే రక్షణ కల్పిస్తాయని బ్యూటీషియన్లు అంటున్నారు. అలా ఇంట్లో చేసుకునే ఫేస్ ప్యాక్ లలో ఖర్బూతో తయారైన ప్యాక్ ఈ జిడ్డు చర్మం నుంచి త్వరగా ఉపశమనం కల్పించడంతోపాటు చర్మసౌందర్యాన్ని మరింత మెరుగుపరుస్తుందని వారు చెబుతున్నారు. చర్మంను రక్షించే పోషకాలు ఇందులో పుష్కలంగా వుంటాయి కాబట్టి.. దీంతో తయారయ్యే ఫేస్ ప్యాక్ చాలా మంచిదని సూచిస్తున్నారు. మరి.. ఖర్బూజతో ఫేస్ ప్యాక్ ఎలా చేస్తారో తెలుసుకుందామా..

ఖర్బూజ ఫేస్ ప్యాక్ :

ఖర్బూజ పండును ముందుగా ముక్కలుగా కోసుకోవాలి. అనంతరం ఆ ముక్కల్ని బ్లెండర్‌లో వేసి మెత్తటి గుజ్జులా పట్టాలి. అలా గుజ్జు చేసిన తర్వాత అందులో అర స్పూన్‌ నిమ్మరసం, కొద్దిగా శెనగపిండి వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఫేస్‌ప్యాక్‌లా తయారయ్యే వరకు కలుపుతుండాలి. అనంతరం ఈ పేస్టును ముఖం, మెడ మీద రాసుకోవాలి. పావుగంట తరువాత గోరు వెచ్చటి నీళ్లతో ముఖాన్ని శుభ్రంగా కడిగేయాలి. అంతే! ఇలా వారానికి మూడుసార్లు చేస్తే.. జిడ్డు చర్మం నుంచి త్వరగా ఉపశమనం పొందవచ్చు. ఖర్భూజను ముక్కలుగా కట్ చేస్తున్నప్పుడు జ్యూస్ వెలువడుతుంది. ఆ జ్యూస్‌ను టోనర్‌గా ఉపయోగించుకోవచ్చు.

పొడిచర్మానికి ఖర్బూజ ఫేస్ ప్యాక్ :

ఖర్బూజను ముక్కలుగా కోసుకున్న అనంతరం వాటిని మిక్సీలో వేసి గుజ్జులా తయారుచేసుకోవాలి. అనంతరం ఆ గుజ్జులో కొద్దిగా పాల మీగడ, ముల్తానీ మట్టి కలపాలి. ఈ మిశ్రమాన్ని ఫేస్‌ ప్యాక్‌లా వేసుకుంటే చర్మానికి అవసరమైన తేమ అందుతుంది. ఎండాకాలంలో చర్మం నిర్జీవం అయిపోకుండా మెరుస్తుంటుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kharbuja fruits  beauty tips  healthy home remedies  

Other Articles

  • Telugu content

    ఇంటా కలబంద.. ఆరోగ్యం మీ చెంత..

    Oct 24 | నేటి జీవనక్రమంలో కాలుష్య బారిన పడకుండా ఉండడం గమనార్హం.. అలా అని కాలుష్య బారిన పడి ఇటు చర్మాన్ని పాడు చేస్కోలేము.. ముఖం పై మచ్చలు,పొడిబరడం ఈ కాలుష్య జీవనానికి అందుకుంటున్న ముప్పు..వీటిని అరికట్టడం... Read more

  • Benefits of badam

    బాదంతో అందం - ఆరోగ్యం

    Oct 23 | నేటి  కాలంలో  మన  జీవన శైలిలో అందం - ఆరోగ్యం రెండు ఎంతో కీలకమైన భూమికను వహిస్తున్నాయి. రెండిట్లో దేని నిర్లక్ష్యం  చెయ్యలేని పరిస్థితి.. రెండిటిని బ్యాలన్స్ చెయ్యడం ఎలా అని ఆలోచించే వారందరికీ... Read more

  • Oninon and lemon are very good for face

    ఉల్లిపాయతో సౌందర్యం..

    Jun 09 | అందమైన ముఖానికి మరింత అందాన్నిచ్చే టిప్స్ ఒక్కోసారి మనకి అందుబాటులో ఉన్నా కూడ వాటిని పెద్దగా పట్టించుకోము. లేనిపోని రంగులతో ముఖాన్ని అందంగా మలచుకుంటుంటాము. ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నవాటితోనే మన ఫేస్ ని... Read more

  • Fat reduce drinks beauty tips

    మార్నింగ్ డ్రింక్స్ తో మెరుగైన రూపం..!

    Jun 04 | 'చక్కనమ్మా చిక్కినా అందమే' అంటారు. ఎందుకంటే బొద్దుగా, చబ్బీగా ఉండేవాళ్లు కొంచెం చిక్కితే ఆరోగ్యానికి ఆరోగ్యం, అందానికి అందం అని. అయితే ఇటీవల కాలంలో అనేక కారణాలవల్ల చాలామందికి ఊబకాయం వస్తోంది. ఆడవాళ్ల కంటే,... Read more

  • Get glamour with rice cleaning water

    భియ్యం కడిగిన నీళ్లతో అందం

    May 23 | బియ్యం కడిగే నీల్లాను అసలు మనం పట్టించుకోము.వాటిని పడేయడమో,లేక మొక్కలకు  వేయడమో చేస్తాము.అయితే ఈ బయ్యం కడిగే నీళ్ళు మొక్కలకే కాదు మనకి కూడా ఉపయోగాపడతుంది.మనకి అవసమైన గాలినిచ్చే మొక్కలకే ఉపయోగపడే ఆ నళ్లు... Read more