Anti aging foods glowing skin beauty tips green vegetables dark chocolates

anti aging foods, beauty tips, beauty tips in telugu, anti aging foods beauty, dark chocolates, green vegetables, anti aging foods beauty tips

anti aging foods glowing skin beauty tips green vegetables dark chocolates

నిత్యం యవ్వనంగా కనబడాలంటే...

Posted: 11/28/2014 04:41 PM IST
Anti aging foods glowing skin beauty tips green vegetables dark chocolates

వయసు మీద పడేకొద్దీ ప్రతిఒక్కరు వృద్ధాప్యబారిన పడటం సహజం. అయితే కొంతమందిలో జన్యులోపాలు, జీవనశైలి, తీసుకునే ఆహారం, నివసించే ప్రదేశాన్ని బట్టి వృద్ధాప్య లక్షణాలు కనిపిస్తాయి. ఈ లక్షణాలు కనబడనీయకుండా ఉండేందుకు కొన్ని రకాల ప్రొడక్ట్స్ అందుబాటులో వున్నాయి కానీ.. అందులో వుండే రసాయనాలు చర్మానికి హానికలిగించే ప్రమాదం వుంటుంది. పైగా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశాలూ వుంటాయి. కాబట్టి.. వాటి వాడకం లేకుండా వృద్ధాప్య లక్షణాలు కనబడకుండా వుండాలంటే.. జీవనశైలిలో మార్పులు తీసుకురావాలి. ముఖ్యంగా ఆహారపు అలవాట్లను మార్చుకుంటే మంచిది. పోషక విలువలు కలిగిన కొన్ని ఆహారపదార్థాలను తీసుకుంటే.. అవి స్కిన్ టోన్’ను మరింతగా మెరుగుపరిచి, అందాన్ని సంరక్షిస్తాయి. ఫలితంగా వృద్ధాప్య లక్షణాలు తొలగిపోయి, యవ్వనంగా కనిపిస్తారు. మరి.. ఆ ఆహారాలేంటో తెలుసుకుందాం...

1. బెర్రీస్ : వీటిలో ‘యాంటీఆక్సిడెంట్స్’ పుష్కలంగా ఉన్నాయి. ఇవి చర్మాన్ని ఆరోగ్యంగా వుంచడంలో ప్రధానపాత్రను పోషిస్తాయి. డార్క్ కలర్ బెర్రీస్ అయితే మరింత ఉత్తమంగా పనిచేస్తాయి. వాటిల్లో ‘విటమిన్-’సి పుష్కలంగా ఉండి చర్మసౌందర్యానికి మేలు చేస్తాయి.

2. డార్క్ చాక్లెట్ : ఇందులో కూడా యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా వుంటాయి. డార్క్ చాక్లెట్స్’ను నిరంతరం తీసుకుంటుంటే.. అందులో వుండే యాంటీఆక్సిడెంట్స్ చర్మంలో రక్త ప్రసరణను పెంచుతాయి. ఇలా చర్మానికి నిరంతరం తగినంత రక్తప్రసరణ అందడం వల్ల యంగ్’గా కనబడుతుంటారు.

3. వెజిటేబుల్స్ : ఇవి అన్నిటికంటే బెస్ట్ యాంటీఆక్సిడెంట్ ఫుడ్. ఇవి ఏజింగ్ ప్రొసెస్ ను తగ్గిస్తాయి. ఈ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ పచ్చిగా లేదా ఉడికించి తీసుకోవచ్చు.

4. బీన్స్ : వీటిల్లో కూడా యాంటీఆక్సిడెంట్స్ అధికంగా వుంటాయి. ఇది అనేక వ్యాధులతో పోరాడి, శరీరానికి శక్తినందిస్తుంది... బలహీనతను తగ్గిస్తుంది. దాంతో చర్మం చూడటానికి యవ్వనంగా ఉంటుంది.

5. అవొకాడో : ఇందులో విటమిన్ ఈ, పొటాషియం, మోనో సాచురేటెడ్ ఫ్యాట్స్’తోబాటు పెద్దమొత్తంలో యాంటీఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇవన్నీ స్కిన్ హెల్త్’ను మెరుగుపర్చడంలో ప్రముఖపాత్రను పోషిస్తాయి. దీన్ని యాంటీఏజింగ్ ఫుడ్’లో చేర్చబడినది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : beauty tips  anti aging food items  dark chocolates  green vegetables  telugu news  

Other Articles

  • Telugu content

    ఇంటా కలబంద.. ఆరోగ్యం మీ చెంత..

    Oct 24 | నేటి జీవనక్రమంలో కాలుష్య బారిన పడకుండా ఉండడం గమనార్హం.. అలా అని కాలుష్య బారిన పడి ఇటు చర్మాన్ని పాడు చేస్కోలేము.. ముఖం పై మచ్చలు,పొడిబరడం ఈ కాలుష్య జీవనానికి అందుకుంటున్న ముప్పు..వీటిని అరికట్టడం... Read more

  • Benefits of badam

    బాదంతో అందం - ఆరోగ్యం

    Oct 23 | నేటి  కాలంలో  మన  జీవన శైలిలో అందం - ఆరోగ్యం రెండు ఎంతో కీలకమైన భూమికను వహిస్తున్నాయి. రెండిట్లో దేని నిర్లక్ష్యం  చెయ్యలేని పరిస్థితి.. రెండిటిని బ్యాలన్స్ చెయ్యడం ఎలా అని ఆలోచించే వారందరికీ... Read more

  • Oninon and lemon are very good for face

    ఉల్లిపాయతో సౌందర్యం..

    Jun 09 | అందమైన ముఖానికి మరింత అందాన్నిచ్చే టిప్స్ ఒక్కోసారి మనకి అందుబాటులో ఉన్నా కూడ వాటిని పెద్దగా పట్టించుకోము. లేనిపోని రంగులతో ముఖాన్ని అందంగా మలచుకుంటుంటాము. ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నవాటితోనే మన ఫేస్ ని... Read more

  • Fat reduce drinks beauty tips

    మార్నింగ్ డ్రింక్స్ తో మెరుగైన రూపం..!

    Jun 04 | 'చక్కనమ్మా చిక్కినా అందమే' అంటారు. ఎందుకంటే బొద్దుగా, చబ్బీగా ఉండేవాళ్లు కొంచెం చిక్కితే ఆరోగ్యానికి ఆరోగ్యం, అందానికి అందం అని. అయితే ఇటీవల కాలంలో అనేక కారణాలవల్ల చాలామందికి ఊబకాయం వస్తోంది. ఆడవాళ్ల కంటే,... Read more

  • Get glamour with rice cleaning water

    భియ్యం కడిగిన నీళ్లతో అందం

    May 23 | బియ్యం కడిగే నీల్లాను అసలు మనం పట్టించుకోము.వాటిని పడేయడమో,లేక మొక్కలకు  వేయడమో చేస్తాము.అయితే ఈ బయ్యం కడిగే నీళ్ళు మొక్కలకే కాదు మనకి కూడా ఉపయోగాపడతుంది.మనకి అవసమైన గాలినిచ్చే మొక్కలకే ఉపయోగపడే ఆ నళ్లు... Read more