Find out what you should do if someone has a heart attack

Find out what you should do if someone has a heart attack, and how can you tell if someone is having a heart attack. first aid,heart attack,emergency,CPR,cardiopulmonary resuscitation,mouth to mouth resuscitation,St John Ambulance,The Red Cross,first aid,cardiac arrest,British Red Cross,resuscitation,breathing,pulse,artificial respiration,sternum,breast bone,air passage

Find out what you should do if someone has a heart attack, and how can you tell if someone is having a heart attack. first aid,heart attack,emergency,CPR,cardiopulmonary resuscitation,mouth to mouth resuscitation,St John Ambulance,The Red Cross,first aid,cardiac arrest,British Red Cross,resuscitation,breathing,pulse,artificial respiration,sternum,breast bone,air passage

Find out heart attack.gif

Posted: 02/07/2012 03:52 PM IST
Find out what you should do if someone has a heart attack

Find_out_heart_attack2

గుండెనొప్పి వస్తే వెంటనే ఇలా!
Heart-attackప్రపంచంలో ఇతర వ్యాధుల కంటే కూడా హృద్రోగాలతోనే ఎక్కువమంది మరణిస్తున్నారు. ఆకస్మాత్తుగా గుండెనొప్పి వచ్చినపుడు వెంటనే చికిత్స చేయకపోవటంతో ఎక్కువమంది మృత్యువాత పడుతున్నారు. గుండెనొప్పి వచ్చినపుడు తక్షణం ప్రాథమిక చికిత్స చేస్తే ఏడు నుంచి పది శాతం మందిని రక్షించవచ్చు. ఎవరికైనా గుండెనొప్పి వచ్చినపుడు ఎలాంటి ప్రాథమిక చికిత్స చేయాలి? రోగి ఒక్కడే ఉంటే ఏం చేయాలి అనే అంశాలను వివరిస్తున్నారు కార్డియాలజిస్ట్ డాక్టర్ ఎ.గురుప్రకాష్. ఆకస్మాత్తుగా తీవ్రమైన గుండెనొప్పి వచ్చి ఎవరైనా సృహ కోల్పోయినపుడు పక్కన ఉన్న వారు వెంటనే ప్రాథమిక చికిత్స చేసి, వెంటనే అంబులెన్స్‌ను పిలిచి, జాప్యం లేకుండా సమీపంలోని ఆసుపత్రికి తరలిస్తే చాలా కేసుల్లో రోగి ప్రాణాలు కాపాడవచ్చు. కార్యాలయంలోనో, ఇతర బహిరంగ ప్రదేశాల్లోనే ఉన్నపుడు గుండెనొప్పితో పడిపోతే సమీపంలో ఉన్న వారు చేయాల్సిన ప్రాథమిక చికిత్సలపై అందరికీ అవగాహన అవసరం. వివిధ రకాల హృద్రోగాల వల్ల ఓ వ్యక్తి గుండె ఆగి మెదడుతోపాటు ఇతర శరీర భాగాలకు రక్త సరఫరా నిలచినపుడు సృహ కోల్పోతాడు. దాన్ని కార్డి రెస్పిటరీ అరెస్ట్ అంటారు. అలాంటపుడు పక్కనున్న వారు కార్డియాక్ రెసిస్టేషన్ కోసం ప్రాథమిక చికిత్స చేయటం వారి కర్తవ్యంగా భావించాలి. ఛాతీ వద్ద రెండు చేతులు ఒకదానిపై ఒకటి పెట్టి అదుముతుండాలి. అలా నిమిషానికి 60 నుంచి 70 సార్లు చేయాలి. మౌత్ టు మౌత్ ద్వారా సృహ కోల్పోయిన రోగికి శ్వాస కల్పించాలి. రోగి మెడ వెనుక చేయి పెట్టి డీఫిబ్రిలేటర్ మిషన్ సాయంతో షాక్ ఇవ్వాలి. దీనివల్ల ఆగిపోయిన గుండె బ్రెయిన్‌డెడ్ కాకముందే స్టిములేట్ అయి పనిచేయటం ఆరంభిస్తుంది. దీంతోపాటు వెంటనే అంబులెన్స్‌కు ఫోన్ చేసి, సత్వరం రోగిని ఆసుపత్రికి చేర్చాలి.

ఒంటరిగా ఉంటే...
ఆకస్మాత్తుగా గుండె నొప్పి వచ్చినపుడు మీరు ఇంట్లో ఒంటరిగా ఉంటే దీర్ఘంగా శ్వాస పీల్చి వదులుతుండాలి. తన రెండు చేతులతో గుండెను అదుముతూ కంప్రెషన్ చేసుకుంటే మంచిది. దీంతోపాటు వెంటనే ఫోన్ చేసి, అంబులెన్స్‌ను తెప్పించుకొని, వీలైనంత త్వరగా ఆసుపత్రికి చేరుకోవాలి. గుండెనొప్పి వచ్చినపుడు ఇంటి వద్ద, బహిరంగ ప్రదేశాల్లో తీసుకునే బేసిక్ లైఫ్ సపోర్టు రోగి ప్రాణాలు కాపాడేందుకు దోహదం చేస్తుంది. గుండెనొప్పి వచ్చినపుడు చేయాల్సిన ప్రాథమిక చికిత్సపై అందరిలో చైతన్యం రావాలి. అమెరికాలోని విమానాశ్రయాలు, బస్‌స్టాండ్‌లు, రైల్వేస్టేషన్‌లు, షాపింగ్‌మాల్స్, పెద్ద కార్యాలయాల్లో డీఫిబ్రిలేటర్ మిషన్‌లు ఉంటాయి. దీని వల్ల ఆగిపోయిన గుండెను పనిచేయించేందుకు ఇవి ఉపయోగపడతాయి. మన దేశంలోనూ ప్రభుత్వం బహిరంగ ప్రదేశాల్లో డీఫిబ్రిలేటర్ మిషన్‌లు నెలకొల్పాలి. దీంతోపాటు పాఠశాల స్థాయి నుంచే పిల్లలకు హృద్రోగులకు అందించాల్సిన ప్రాథమిక చికిత్సపై అవగాహన కల్పించాల్సిన అవసరముంది.అడ్వాన్స్

లైఫ్ సపోర్ట్
గుండెనొప్పి వచ్చిన రోగికి ఆసుపత్రికి తీసుకొచ్చాక అడ్వాన్స్ లైఫ్ సపోర్టు అందిస్తారు. నోరు లేదా ముక్కులో నుంచి ఎండో ట్రెకెల్ ట్యూబ్ పంపించి వెంటిలేటర్ ద్వారా ఆక్సిజన్‌ను అందిస్తారు. తొడ లేదా మెడలోని చిన్న రక్తనాళం ద్వారా గుండెలోపలకు పేస్‌మేకర్ ద్వారా విద్యుత్తు ఇచ్చి గుండెలో రక్తం పంపింగ్‌ను పెంచుతారు. ఇంట్రాఅయోటిక్ బెలూన్ పంపు, ఇంప్లెల్లా డివైజ్‌ల ద్వారా గుండె ఎడమవైపు నుంచి శరీరంలోని అన్ని భాగాలకు రక్త సరఫరాను పెంచుతారు. ఈ చికిత్స వల్ల ఆక్సిజన్‌తోపాటు రక్త సరఫరా మెరుగుపడి హృద్రోగి కోలుకుంటాడు.

కారణాలు
ఆకస్మాత్తుగా గుండెనొప్పి రావటానికి పలు కారణాలున్నాయి. 20 నుంచి 30 ఏళ్ల వయసు వారిలో గుండె కండరం మందంగా మారి హార్ట్‌బీటింగ్ ఎక్కువ అవుతుంది. దీన్ని హైపర్ ట్రోఫిక్ అబ్‌స్ట్రక్టివ్ కార్డియోమయోపతి అంటారు. లాంగ్ క్యూటీసిండ్రోమ్ వల్ల కూడా రోగికి గుండెనొప్పి వస్తుంది. ఊపిరితిత్తుల్లో రక్తం గడ్డ కట్టడం వల్ల గుండె నుంచి ఊపిరితిత్తులకు రక్తం సరఫరా ఆగిపోవటం వల్ల ఆక్సిజన్ లెవెల్ తగ్గి గుండెనొప్పి వస్తుంది. దీన్ని పల్మమనరీ అంబాల్కిమ్ అంటారు. కొందరికి పుట్టుకతో కంజనైటల్ హార్ట్‌డిసీజ్‌లు కూడా వస్తుంటాయి. కారణాలు ఏవైనా ఇలాంటి వ్యాధులు వచ్చినపుడు రోగికి ముందుగా కళ్లు తిరగటం, గుండెదడ రావటం, సృహ కోల్పోవటం లాంటివి జరుగుతుంటుంది.వైద్య పరీక్షలు ముఖ్యం సాధారణంగా గుండెకు సంబంధించి సమస్యలు వచ్చాయని అనుమానమున్నపుడు వెంటనే ఆసుపత్రికి వెళ్లి కార్డియాలజిస్ట్‌ల పర్యవేక్షణలో ఈసీజీ, 2డి ఇకో, టీఎంటీ, హోల్టర్‌మానిటరింగ్, ఎలక్ట్రోకార్డియోగ్రామ్, కొరోనరీ యాంజియోగ్రామ్ తదితర పరీక్షలను చేయించుకోవాలి. హృద్రోగులు అనుక్షణం అప్రమత్తంగా ఉండటంతోపాటు గుండెనొప్పి వచ్చినపుడు ప్రాథమిక చికిత్సతోపాటు వెంటనే ఆసుపత్రికి వెళ్లాల్సిన అవస రాన్ని గుర్తించాలి. ప్రాథమిక చికిత్స, సత్వర వైద్యంతో రోగి ప్రాణాలు కాపాడవచ్చని అందరూ గ్రహించాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Health tips which can help you to live long life
Psoriasis treatments  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Telugu content

    ఇంటా కలబంద.. ఆరోగ్యం మీ చెంత..

    Oct 24 | నేటి జీవనక్రమంలో కాలుష్య బారిన పడకుండా ఉండడం గమనార్హం.. అలా అని కాలుష్య బారిన పడి ఇటు చర్మాన్ని పాడు చేస్కోలేము.. ముఖం పై మచ్చలు,పొడిబరడం ఈ కాలుష్య జీవనానికి అందుకుంటున్న ముప్పు..వీటిని అరికట్టడం... Read more

  • Benefits of badam

    బాదంతో అందం - ఆరోగ్యం

    Oct 23 | నేటి  కాలంలో  మన  జీవన శైలిలో అందం - ఆరోగ్యం రెండు ఎంతో కీలకమైన భూమికను వహిస్తున్నాయి. రెండిట్లో దేని నిర్లక్ష్యం  చెయ్యలేని పరిస్థితి.. రెండిటిని బ్యాలన్స్ చెయ్యడం ఎలా అని ఆలోచించే వారందరికీ... Read more

  • Oninon and lemon are very good for face

    ఉల్లిపాయతో సౌందర్యం..

    Jun 09 | అందమైన ముఖానికి మరింత అందాన్నిచ్చే టిప్స్ ఒక్కోసారి మనకి అందుబాటులో ఉన్నా కూడ వాటిని పెద్దగా పట్టించుకోము. లేనిపోని రంగులతో ముఖాన్ని అందంగా మలచుకుంటుంటాము. ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నవాటితోనే మన ఫేస్ ని... Read more

  • Fat reduce drinks beauty tips

    మార్నింగ్ డ్రింక్స్ తో మెరుగైన రూపం..!

    Jun 04 | 'చక్కనమ్మా చిక్కినా అందమే' అంటారు. ఎందుకంటే బొద్దుగా, చబ్బీగా ఉండేవాళ్లు కొంచెం చిక్కితే ఆరోగ్యానికి ఆరోగ్యం, అందానికి అందం అని. అయితే ఇటీవల కాలంలో అనేక కారణాలవల్ల చాలామందికి ఊబకాయం వస్తోంది. ఆడవాళ్ల కంటే,... Read more

  • Get glamour with rice cleaning water

    భియ్యం కడిగిన నీళ్లతో అందం

    May 23 | బియ్యం కడిగే నీల్లాను అసలు మనం పట్టించుకోము.వాటిని పడేయడమో,లేక మొక్కలకు  వేయడమో చేస్తాము.అయితే ఈ బయ్యం కడిగే నీళ్ళు మొక్కలకే కాదు మనకి కూడా ఉపయోగాపడతుంది.మనకి అవసమైన గాలినిచ్చే మొక్కలకే ఉపయోగపడే ఆ నళ్లు... Read more