fake news goes viral in karnataka elections గెలుపు కోసం సోషల్ మీడియాలో విషప్రచారం..

Spreading fake news via social media in karnataka elections

Siddaramaiah, Fake News, Pakistan, gujarat elections, manmohan singh, narendra modi, #AnswerMaadiModi, PM Modi, BS Yeddyurappa, Janardhan Reddy, Amit Shah, Rahul Gandhi, Congress, BJP, JDS, Kumara Swamy, karnataka, politics

From public meetings to the debate on governance by the different ruling parties was at large in past day campaign, but now social media is playing a vital role in spreading the fake news within minutes at large.

గెలుపు కోసం సోషల్ మీడియాలో విషప్రచారం..

Posted: 05/02/2018 03:13 PM IST
Spreading fake news via social media in karnataka elections

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు రసవత్తర ఘట్టానికి చేరకున్నాయి. అన్ని పార్టీల ప్రధాన అభ్యర్థులు, జాతీయ అధ్యక్షులు ఎన్నికల ప్రచారంలో బిజీబిజీగా వున్నారు. అయితే ఎన్నికలలో గెలుపు కోసం కొన్ని పార్టీలు విష ప్రచారం కూడా చేస్తున్నాయి. ఓటర్లను తీవ్ర ప్రభావానికి గురిచేసే సోషల్ మీడియా మాధ్యమం వేదికగా ఈ విషప్రచారం వేళ్లూనుకుంటూ సాగుతోంది. కర్ణాటక ఎన్నికల వేళ.. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పాకిస్తాన్‌ వెళ్లొచ్చారన్న వార్త తాజాగా కర్ణాటకలో ఓటర్లను తీవ్ర ప్రభావానికి గురిచేస్తుంది.

కర్ణాటకలో సిద్దరామయ్య ప్రభుత్వానికి పదింట ఏడుగురు ప్రజలు మద్దతు పలుకుతున్నారని సర్వేలు వెల్లడించిన క్రమంలో ఆయన ప్రతిష్టను మసకబారేలా చేసి.. ఓటమి అంచుల నుంచి పైకి రావాలని ప్రయత్నిస్తున్నాయి పలు పార్టీలు. ఇప్పటికే తమకు మద్దతుగా వార్తలు రాసే పత్రికలతో తప్పుడు అంచనాలను, తమ అభ్యర్థులే తప్పక విజయతీరాలను చేరుతారని.. వాటిని ప్రజల్లోకి పంపి.. పోటీ మరీ తీవ్రంగా వుందని పేర్కోంటూ.. ఇక ఈ ఉత్కంఠకరమైన పోరులో ప్రజలు తమ అభ్యర్థులకు మద్దుతు పలుకుతున్నట్లు కథనాలు రాయించుకుని తటస్థ ఓటరును ప్రభావితం చేస్తున్నాయి పార్టీలు.

ఇక తాజాగా వైరల్ అవుతున్న ఫేక్ న్యూస్ విషయంలోకి ఎంట్రీ ఇచ్చే ముందు.. ఇలాంటి ఓ సంచలనాత్మక విషయాన్ని దేశ ప్రధాని నరేంద్రమోడీ.. గుజరాత్ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ నేతలపై కూడా చేశారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సహా పలువురు పార్టీ అగ్రనేతలు పాకిస్థాన్ హైకమీషనర్ తో భేటీ అయ్యి.. తన హత్యకు కుట్ర చేస్తున్నారని.. ఇందుకు పాకిస్థాన్ కు చెందిన ఐఎస్ఐకి కూడా సుపారీ ఇచ్చారని అరోపించారు. సరిగ్గా గుజరాత్ రెండో విడత ఎన్నికలకు వెళ్లే రొజుల వ్యవధిలో ప్రధాని చేసిన వ్యాఖ్యలు సంచలనాత్మకంగా మారాయి. అయితే ప్రధాని ఆ తరువాత ఈ విషయాన్ని పూర్తిగా మర్చిపోయారు. కనీసం ఒక ఎంక్వైరీ కమీషన్ లేదా.. నిజనిర్థారణ కమిటీ.. లేదా కాంగ్రెస్ నేతలపై కేసులు ఇలా ఏ చర్య తీసుకోకుండానే వదిలేశారు.

సరిగ్గా ఇప్పుడు తెరపైకి వచ్చిన అంశం కూడా అలాంటిదే. సిద్ధరామయ్య పాకిస్తాన్‌కు వెళ్లారని, ప్రచార పర్వం జోరందుకున్న క్రమంలో ఈ నకిలీవార్త సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది. కర్ణాటక యువత సహా కన్నడిగుల వాట్సాప్, ట్విటర్లో సంచలనంగా మారింది. ఈ వార్తను నమ్మించేందుకు ఓ సంస్థకు చెందిన నకిలీ లెటర్ హెడ్ తో ఓ లేఖను కూడా క్రియేట్ చేసి మరీ విషప్రచారం చేస్తున్నాయి పార్టీలు. గత నెల 13న సాయంత్రం 5 గంటలకు ఒక చార్టర్ విమానంలో ముంబై నుంచి బయలుదేరి 6.15కు కరాచీకి చేరుకున్నారన్న సమాచారాన్ని కూడా పోస్టు చేశారు.

ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోడీ షెడ్యూలు లేకుండా పాక్ మాజీ ప్రధాని మనవరాలి పెళ్లికి వెళ్లినప్పడు.. సిద్దరామయ్య వెళ్తే తప్పేంటనేవాళ్లూ కూడా లేకపోలేదు. అయితే కరాచీ నుంచి రాత్రి 7 గంటలకు  సిద్ధరామయ్య (ఎస్‌ అనే ఇంటిపేరు లేకుండా) జమీర్‌ అహ్మద్‌  అనే ఇద్దరు వ్యక్తులతో ఆ విమానం రాత్రి 9.10 నిముషాలకు ఢిల్లీకి చేరుకుంది. అదే రోజు రాత్రి 11.45 నిముషాలకు ఢిల్లీలో బయలుదేరి తెల్లవారుజామున (14న) 2 గంటలకు బెంగళూరుకు చేరుకుంది. విమాన ప్రయాణ అనుమతికి బెంగళూరు ఎయిర్‌పోర్ట్‌  ఏటీసీని ఉద్ధేశించిన రాసినట్టుగా చెబుతున్న నకిలీ లేఖ సారాంశమిదీ...

ఎన్నికల నేపథ్యంలో పాకిస్థాన్‌ నుంచి డబ్బు రవాణా చేసేందుకు సిద్ధరామయ్య అక్కడకు వెళ్లినట్టుగా ప్రచారం చేసేందుకు సోషల్‌ మీడియాలో విస్తృతంగా  ఫేక్ న్యూస్‌ వ్యాపింపజేశాయి రాజకీయ పార్టీలు. ఎన్నికల్లో పంపిణీ కోసం నకిలీ కరెన్సీ, అందుకోసం తీవ్రవాదులతో ఒప్పందం ? బ్రేకింగ్‌న్యూస్‌ అంటూ ఈ వార్తను ప్రచారం చేశారు. దీనికి సమాధానంగా మళ్లీ జాతి వ్యతిరేక సీఎం, దీనికి కాంగ్రెస్‌ సమాధానం చెప్పాలి అంటూ యెడ్యూరప్ప, అనంతకుమార్‌ హెగ్డే, తదితరులు నిలదీసినట్టు...దేవుడిని దర్శించుకునేందుకు సిద్ధరామయ్య కరాచీకి వెళ్లారా ? లేక కర్ణాటకలో బీజేపీకి వ్యతిరేకంగా పోరాడేందుకు నకిలీ కరెన్సీ రూపంలో పాకిస్తాన్‌ సహాయం కోసం వెళ్లారా ? అంటూ సోషల్‌మీడియాలో ప్రచారాన్ని వేడెక్కించారు.

కేంద్రం ప్రభుత్వ అథీనంలో వున్న స్వత్రంత్య సంస్థ సీబీఐ.. కర్ణాటక రాష్ట్రంలో ఎన్నికలకు ముందుకు కాంట్రాక్టర్లకు ఇబ్బడిముబ్బడిగా బిల్లులకు చెల్లింపు చేశారని నోటీసులు జారీ చేసింది. అందుకుగానూ మూడు నెలల లెక్కలను మొత్తంగా చెప్పాలని కూడా అదేశించింది. అందుకు ప్రభుత్వ సీఎస్ కూడా సమ్మితించారు. ఇక తాజాగా సిద్దరామయ్య ప్రభుత్వంలో మంత్రిగా కొనసాగుతన్న వ్యక్తి నివాసంపై కూడా అదాయ దాడులు జరిగాయి. ఇక సోషల్ మీడియాలో చక్కర్లు కోడుతన్న వార్త నిజమే అయితే.. సీబీఐ, అదాయపన్నశాఖలే కాదు.. ఈడీ, రా లాంటి సంస్థలు కూడా రంగప్రవేశం చేసి సిద్దరామయ్యను అరెస్టు చేసేవి కాదా.? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

ఇక తమ అకాడమి లెటర్ హెడ్ పై ఈ ఫేక్ లెటర్ ను ముద్రించినట్టు న్యూఢిల్లీకి చెందిన వీఎస్‌ఆర్ ఎవియేషన్‌  సంస్థ స్పష్టం చేసింది. ఈ లేఖ నకిలీదేనని సంస్థ దృవీకరించింది. ఇక సిద్ధరామయ్య కరాచీ నుంచి ఢిల్లీకి వచ్చారని చెబుతున్న ఏప్రిల్‌ 13న ఆయన కాంగ్రెస్‌ అభ్యర్థుల ఎంపిక ప్రకియకు సంబంధించిన సమావేశంలో ఢిల్లీలోనే ఉన్నారని పేర్కొంది. ఏప్రిల్‌ 14 తెల్లవారు 2 గంటలకు సిద్ధరామయ్య బెంగళూరుకు చేరుకున్నారని నకిలీ లేఖలో పేర్కొనగా, ఆ రోజు ఢిల్లీలోని కర్ణాటక భవన్ లో జరిగిన అంబేద్కర్‌ జయంతి వేడుకల్లో పాల్గొన్నారని కాంగ్రెస్ స్పష్టం చేసింది.

దీనిపై కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి బ్రిజేష్‌ కాలప్ప స్పందిస్తూ... బీజేపీ మురికి రాజకీయాలకు పాల్పడుతోందని. ట్విటర్ వేదికగా సాగుతున్న ఈ దుష్ప్రచారంపై రాష్ట్ర సీఐడీ విభాగం వెంటనే విచారణ జరిపించాలంటూ  డిమాండ్ చేశారు. అయితే ఈ విషప్రచారాన్ని పార్టీలు చేస్తున్నాయా..? లేక పార్టీల వెనకనున్న కరుడగట్టిన కార్యకర్తలు చేస్తున్నారా.? లేక పార్టీల ఐటీ సెల్ అధ్వర్యంలోనే ఇవి సాగుతున్నాయా.? అన్న అనుమానాలు మాత్రం కలగమానడం లేదు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Siddaramaiah  Fake News  Pakistan  gujarat elections  manmohan singh  narendra modi  karnataka  politics  

Other Articles