Does RSS masterminds federal front..? ఆర్ఎస్ఎస్ వ్యూహరచనతోనే ఫడరల్ ఫ్రంట్ ఏర్పాటు.?

Rss masterminds federal front to bring bjp into power

BJP, General Elections, Federal Front, Telangana CM KCR, KCR, KCR Federal Front, NDA, UPA, Gujarat results, Gujarat elections, DMK, JDS, SP, Lok Sabha elections, 2019, BJP, Congress, NDA, PM Modi, RSS, Amit shah, 2019 General elections, elections, national elections, political campaigns, political candidates, politics, elections

After surveys analyse that the 2019 general elections are not going to be a cakewalk for the NDA lead party.. RSS masterminds KCR's Federal front to divide anti incumbancy vote.

ఆర్ఎస్ఎస్ వ్యూహరచనతోనే ఫడరల్ ఫ్రంట్ ఏర్పాటు.?

Posted: 05/16/2018 09:26 AM IST
Rss masterminds federal front to bring bjp into power

2019 సార్వత్రిక ఎన్నికలలో మళ్లీ అధికారంలోకి వస్తామని అధికార బీజేపీ, ఇప్పటికే ధీమాను వ్యక్తం చేస్తున్నా.. సీట్లు మాత్రం గణనీయంగా తగ్గుతాయని ఇప్పటికే పలు సర్వేసంస్థల అంచనాలు పేర్కొంటున్నాయి. గుజరాత్ తరువాత ఉత్తర్ ప్రదేశ్ లోక్ సభ ఉప ఎన్నికల ఫలితాలు దేశవ్యాప్తంగా ప్రభావాన్ని చూపుతాయని, ఇక కర్ణాటక అసెంబ్లీ  ఎన్నికల ఫలితాలు కూడా బిజేపిపై ప్రభావాన్ని చాటుతాయని.. అంచనాలు స్పష్టం చేస్తున్నాయి.

కాగా అటు కాంగ్రెస్ అధ్యక్ష పగ్గాలను అందుకున్న రాహుల్‌ నేతృత్వంలో పార్టీ జోరందుకుందని, రాహుల్ కూడా పరిణితి చెందిన నేతలా వ్యవహరిస్తూ. చౌకబారు వ్యాఖ్యలు, దిగజారుడు విమర్శలకు దూరంగా. హుందాతనం కలిగిన రాజకీయ నేతగా వ్యవహరిస్తున్నారన్న అభిప్రాయాలు కూడా దేశ ప్రజల్లో వ్యక్తం కావడంతో.. రానున్న సార్వత్రిక ఎన్నికలు ఇటు అధికార బీజేపి, అటు విపక్ష కాంగ్రెస్‌ మధ్యన రసవత్తర పోరుగా మారనున్నాయని తెలుస్తుంది.

అయితే ఈ సారి బీజేపీ గెలుపు నల్లేరుపై బండి నడక కాబోదని బీజేపీ మాతృసంస్థగా భావించే ఆరెస్సెస్‌ కూడా అభి్ప్రాయపడింది. ఈ సారి ప్రధాని మోదీ మానియా మసకబారడం గ్యారంటీ అంటూ ఇప్పటికే విపక్షాలు ఓ వైపు కుండబద్దలు కొట్టేలా స్పష్టం చేస్తున్నాయి. అందుకు సాక్షాత్తు ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి లోక్ సభ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల ఫలితాలే కారణమని కూడా స్పష్టం చేస్తున్నాయి. ఇక బీహార్ లో గత అసెంబ్లీ ఎన్నికలలో అత్యధిక స్థానాలను గెలుచుకున్న అర్జేడి పార్టీని అధికారానికి దూరం చేయడం.. మహాగట్ బంధన్ ను చిన్నాభిన్నం చేసి.. అర్జేడి అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ను జైలు పాలుచేయడం కూడా ప్రజల్లో వ్యతిరేకతకు అజ్యంపోస్తుంది.

ఇక కాంగ్రెస్ మాజీ అధినేత్రి సోనియాగాంధీ రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్ రాజ్యసభ ఎన్నికలలో బీజేపి వేసిన పాచికలు పారకుండా చేసి.. ఆయన విజయం సాధించడం కూడా విపక్షాలకు కలసివచ్చే అంశంగానే మారింది. ఈ క్రమంలో బెంగళూరులో క్యాంప్ రాజకీయాలకు తెరతీసిన క్రమంలో అక్కడి మంత్రిపై ఐటీ దాడులు.. ఇక తీరా కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ రాష్ట్ర ప్రభుత్వానికి ఐటీ నోటీసులు, సీఎం సిద్దరామయ్యకు అత్యంత సన్నిహితుడైన మంత్రి నివాసంపై ఐటీ దాడులకు తెరలేపడం కూడా బీజేపి కక్షపూరిత రాజకీయాలపై ప్రజల్లో ఏహ్యభావం కలుగుతుందన్న విమర్శలు వస్తున్నాయి.

దేశవ్యాప్తంగా ప్రజలు నోట్ల రద్దు నేపథ్యంలో కరెన్సీ నోట్ల కోసం రోజుల కోద్ది బ్యాంకుల చుట్టూ ప్రదిక్షణలు చేస్తున్న క్రమంలో అదే కర్ణాటకలో గాలి జనార్థన్ రెడ్డి కూతురి వివాహం మాత్రం కోటాను కోట్ల రూపాయలను ఖర్చుతో అంగరంగ వైభవంగా జరిగింది. ఇక ఆయన నోట్లను ఎలా తెచ్చుకున్నారో కూడా చెప్పిన ఆయన డ్రైవర్ అత్మహత్య చేసుకునే ముందు తన మరణవాంగ్మూలంలో పేర్కోన్నా.. తనపై లేనిపోని నిందలేసి కొడుతున్నారని అవేదనను వ్యక్తం చేసి చనిపోయినా.. పెద్దగా పట్టించుకోలేదు. దీనికి ఎవరు కారణం.? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే వీరిపై లేని సీబిఐ దాడులు కేవలం తమ వ్యతిరేకులపైనే ఎందుకు సాగుతున్నాయన్న ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతూ.. కేంద్రంపై వ్యతిరేకతకు దారితీస్తుంది.

ఇక తమిళనాడులో అధికార అన్నాడీఎంకే కు చెందిన రెండు వర్గాలను ఒకటిగా చేయకముందు ఒక వర్గంలోని మంత్రిపై జరిపిన అదాయశాఖ దాడుల కేసు ఇప్పుడేమందన్న ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. దినకరణ్ విషయంలో పనిచేసినంత యాక్టివ్ గా ఈ మంత్రివర్యుల విషయంలో మాత్రం ఎందుకు పనిజరగడం లేదన్న ప్రశ్నలు సామాన్యుల నుంచి ఉత్పన్నమవుతున్నాయి. ఇక తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ తో ముందుకెళ్లడాన్ని కూడా అమిత్ షా స్వాగతిస్తున్న క్రమంలో.. ఇక దీనిపై కూడా అనుమానాలు వ్యక్తమవతున్నాయి.

దక్షిణభారతంలో బీజేపిపై కొంత వ్యతిరేకత వున్నధన్న విషయాన్ని ఇప్పటికే గమనించిన బీజేపి అధిష్టానం.. కేసీఆర్ ను ముందుపెట్టి ఫడరల్ ఫ్రంట్ కు తెరవెనుకగా సహాయసహకారాలను కూడా సంపూర్నంగా అందిస్తుందా..? అన్న సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలోనే కేసీఆర్.. జేడీఎస్ అధినేత కుమార స్వామితో పాటు పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ ప్రధాని దేవగౌడను కూడా కలిశారు. అటు అసెంబ్లీ ఎన్నికలలో వారికి మద్దతు పలికి.. వారి సహకారంతోనే బీజేపి అధికారంలోకి రావాలన్న ప్రయత్నాలకు కేసీఆర్ దోహదపడ్డారా.? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

ఇదే జరిగితే రానున్న ఎన్నికలలో బీజేపికి మరోమారు అధికారాన్ని అందించడానికి కూడా కేసీఆర్ ఫడరల్ ప్రంట్ దోహదం చేస్తుందన్న విపక్షాల వాదనలకు కూడా బలం చేకూరినట్లే. రానున్న సార్వత్రిక ఎన్నికలలో పూర్వవైభవాన్ని అందుకుంటుందన్న ధీమా వ్యక్తం చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి అధికారాన్ని అందని ద్రాక్షాలా మార్చడం కోసమే ఫడరల్ ఫ్రెంట్ అవిర్భావం సాగుతుందన్న వార్తలు కూడా తెరపైకి వస్తున్నాయి. కేంద్రంలోని ప్రభుత్వ ఓటును తమకు అనుకూలంగా మార్చుకుని.. కాంగ్రెస్ కు అధికారాన్ని దూరం చేయడంతో పాటు మరోమారు ఎన్డీయేకు అధికారాన్ని అందించాలన్న ఆ పార్టీ స్ట్రాటజీనే ఫడరల్ ప్రంట్ కొనసాగిస్తుందన్న అనుమానాలకు కూడా జేడీఎస్ కు ఓటు వేయాలన్న టీఆర్ఎస్ పిలుపు బీజాలు వేస్తుంది.

రానున్న సార్వత్రిక ఎన్నికలలో బీజేపికి సగానికి పైగా బలం తగ్గినా.. ఎన్డీయేలో భాగస్వామ్యమైన పక్షాలతో అధికారాన్ని అందుకోవచ్చునన్న అంచనాలు వున్నాయి. అయితే ఎన్టీయే పక్షాలకు కూడా అధికారం అందని పక్షంలో కేసీఆర్ ఫడలర్ ప్రంట్ మద్దతును కూడా ఎన్డీయే కూడగట్టుకోవచ్చు. ప్రజాస్వామ్య దేశంలో పదే పదే ఎన్నికలు రావడం ఇష్టం లేక.. ప్రజాధనం వృధా చేయడం సమంజసం కాదని భావించి.. ప్రస్తుతం నెలకొన్న అత్యవసర పరిస్థితుల నేపథ్యంలో మద్దతు తెలుపుతున్నామన్న పాత ప్రసంగాలనే కొత్తగా వల్లించి మరీ ఎన్డీయేకు ఫడరల్ ప్రంట్ మద్దతు పలకవచ్చునన్న ఊహాగానాలు కూడా తెరపైకి వస్తున్నాయి.

నికి తోడు ఈ రాష్ట్రాలకు వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. సార్వత్రిక ఎన్నికలకు సెమీఫైనల్ గా నిలిచే మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాల ఎన్నికలలో విజయం సాధించడం విషయాన్ని పక్కనబెడితే.. ఈ ఫలితాలు తప్పక ఆ వెనువెంటనే వచ్చే లోక్ సభ ఎన్నికలపై పడతాయని విశ్లేషకుల అంచనా. ఫడరల్ ఫ్రంట్ ఏర్పాటు కూడా అరెస్సెస్ వ్యూహరచనలో భాగంగానే ఉత్పన్నమైందా అన్న సందేహాలు కూడా వినబడుతున్నాయి. గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో అరెస్సెస్ అంచనాలు నిజమయ్యాయి. అధికారాన్ని అత్యంతకష్టం మీద నిలబెట్టుకున్న బీజేపి.. మ్యాజిక్‌ ఫిగర్‌ కంటే కేవలం ఏడుసీట్లే ఎక్కువ లభించి చావు తప్పి కన్ను లోట్టపోయిందన్న చందంగా ఫలితాలను అందుకుంది.

ఈ క్రమంలో 2014 సార్వత్రిక ఎన్నికల్లో 543సీట్లకు గాను ఎన్డీయే 336 సీట్లు సాధించిన బీజేపీ సొంతంగా 282 సాధించి మ్యాజిక్‌ ఫిగర్‌ కంటే పది సీట్లు ఎక్కువే పోగేసుకుంది. ఆ పరిస్థితి 2019లో ఉండదని, బీజేపీ సీట్ల సంఖ్యలోనే దాదాపు 100 తగ్గవచ్చని అంచనాలు వెలువడుతున్నాయి. ఇక ఎన్డీయే మిత్రపక్షాలుగా వున్న శివసేన ఇప్పుడే విమర్శలను ఎక్కుపెడుతుంది. దీనికి తోడు టీడీపీ గూటి నుంచి ఎగిరిపోయింది. ఈ నేపథ్యంలో మిత్రపక్షాలైన అకాలీదళ్‌, లోక్‌జనశక్తి లాంటి ప్రధాన పార్టీలు కూడా సరిగా సీట్లు సాధించలేకపోతే బీజేపీ పెనుసవాల్ ను ఎదుర్కొంటుంది.

మొన్నటి గుజరాత్‌ ఫలితాల్లో చావుతప్పి కన్ను లొట్టబోయినట్లు గెలిచామని గ్రహించిన మోదీ ఇప్పటికే మిత్రపక్షాల వేటలో పడ్డారు. ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు వీడగానే జగన్ ను దగ్గరికి చేర్చుకున్నారన్న వార్తలు ఇప్పటికే వస్తున్నాయి. ఇక అటు తమిళనాడు వెళ్ళి డీఎంకే అధినేత కరుణానిధిని పరామర్శించి.. 2జీ కేసులో నిందితులుగా వున్న కనిమొళికి విముక్తి కల్పించడంలో కేంద్రం పాత్ర ఉందన్న విమర్శలూ ఉన్నాయి. అయితే వీరితో నేరుగా జతకట్టలేమని తెలిసే వారిని ఫడరల్ ఫ్రంట్ గొడుగు నీడకు తీసుకువస్తున్నారన్న వార్తలు వినబడుతున్నాయి.

ఇక దీనికి తోడు దేశంలోని ఏ విఫక్షం లేకుండా చేయాలని కంకణం కట్టుకున్న బీజేపి జాతీయ అధ్యక్షుడు అటు కాంగ్రెసై్ ముక్త్ భారత్, ఇటు కమ్యూనిస్టు రహిత భారత్ అంటూ నినాదాలిస్తున్న క్రమంలో కేసీఆర్ ఫడరల్ ఫ్రంట్ ను మాత్రం ఆయన తన మనస్పూర్తిగా స్వాగతిస్తున్నానని వ్యాఖ్యానించడం కూడా సందేహాలకు తావిస్తుంది. తమకు ఏ పార్టీ ఎదరువుండకూడదని, అనేక వ్యూహరచనలు వేసి మరీ అన్ని రాష్ట్రాల్లో తమ పార్టీ జయభేరి మ్రోగించేసేలా ప్రణాళికలు రచిస్తున్న షా.. కేసీఆర్ తృతీయ కూటమిని మాత్రం స్వాగతిస్తున్నానని వ్యాఖ్యనించడం పట్ల సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సురవం సుధాకర్రెడ్డి కూడ తప్పబట్టారు.

గుజరాత్ లో ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టిన తరువాత నరేంద్ర మోడీ తన వ్యతిరేకులను ఒక చోట చేరకుండా విచ్ఛిన్నం చేసి.. తన అధికారానికి అడ్డులేకుండా చేసుకున్నారని ఇప్పటికే పలువురు రాజకీయా విశ్లేషకులు వెల్లడించిన క్రమంలో అదే విధానాన్ని జాతీయస్థాయిలో కూడా అమలు పర్చి.. ప్రభుత్వ వ్యతిరేక ఓటుకు ఫడరల్ ఫ్రంట్ తో తీసివేయాలని, ఇక కాంగ్రెస్ మిత్రపక్షాలను కూడా దూరం చేసి.. దానికి అధికారాన్ని అందని ద్రాక్షలా చేయాలన్న ఆర్ఎస్ఎస్ వ్యూహంతోనే ఫడరల్ ఫ్రంట్ అవిర్బవించిందా.? అన్న అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఇక యూపీఏ కూటమిలో వున్న భాగస్వామ్యపక్షాల వద్దకు, లేదా తటస్థంగా వున్న రాజకీయ పక్షాలకు వద్దకు మాత్రమే కేసీఆర్ వెళ్లడం.. ఎన్డీయేలో వున్న మిత్రపక్షాలను కలసి కూటమిలో చేరాలని విన్నవించేందుకు కూడా వెళ్లకపోవడం ఇందుకు బలాన్ని చేకూర్చుతుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : BJP  Gujarat results  Lok Sabha elections  PM Modi  RSS  NDA  UPA  Amit shah  2019 General elections  BJP  Congress  NDA  politics  

Other Articles