Sumathi Satakam in Telugu 51505 Sumathi Satakalu

Sumati satakam

Sumathi Satakam, Sumathi Satakalu, Telugu Satakalu, Sumathi Satakalu in Telugu అప్పుగొని = ఋణము తెచ్చుకొని ; చేయు = అనుభవించు ; విభవమున = పటాలోపమును ; ముప్పునన్ = ముసలితనమున ; ప్రాయంపు + ఆలు = వయసుగల పెండ్లాము ; మూర్ఖుని = తెలివి లేనివాని; తపమున్ = తపస్సును ; తప్పు + అరయని = మంచి చెడ్డ విచారింపని ; నృపురాజ్యమున్ = రాజు పరిపాలనయు ; దెప్పరమై = భయంకరమై ; మీఁద = మునుముందు ; కీడున్ = హానికి ; తెచ్చు(ను)ర = కలిగించును.

Get the Sumathi Satakam అప్పుచేసి వైభోగాలను అనుభవించడం, ముసలితనం వచ్చిన తరువాత మంచి వయసులో వున్న అమ్మాయిని వివాహం చేసుకోవడం, తెలివి తక్కువవాని తపస్సు, మంచి-చెడుల గురించి విచారించని రాజు పరిపాలన చాలా భయంకరమైనవి. రానురాను మున్ముందు కాలంలో ఈ అలవాట్లన్నీ హాని కలిగిస్తాయి. In Telugu Sumathi Satakalu

సుమతీ శతకము

Posted: 04/04/2014 10:41 AM IST
Sumati satakam

అప్పుగొని చేయు విభవము 

ముప్పునఁ బ్రాయంపుటాలు, మూర్ఖుని తపమున్ 

దప్పరయని నృపురాజ్యము 

దెప్పరమై మీఁదఁ గీడు దెచ్చుర సుమతీ !

టీకా : అప్పుగొని = ఋణము తెచ్చుకొని ; చేయు = అనుభవించు ; విభవమున = పటాలోపమును ; ముప్పునన్ = ముసలితనమున ; ప్రాయంపు + ఆలు = వయసుగల పెండ్లాము ; మూర్ఖుని = తెలివి లేనివాని; తపమున్ = తపస్సును ; తప్పు + అరయని = మంచి చెడ్డ విచారింపని ; నృపురాజ్యమున్  = రాజు పరిపాలనయు ; దెప్పరమై = భయంకరమై ; మీఁద = మునుముందు ; కీడున్ = హానికి ; తెచ్చు(ను)ర = కలిగించును. 

తాత్పర్యము : అప్పుచేసి వైభోగాలను అనుభవించడం, ముసలితనం వచ్చిన తరువాత మంచి వయసులో వున్న అమ్మాయిని వివాహం చేసుకోవడం, తెలివి తక్కువవాని తపస్సు, మంచి-చెడుల గురించి విచారించని రాజు పరిపాలన చాలా భయంకరమైనవి. రానురాను మున్ముందు కాలంలో ఈ అలవాట్లన్నీ హాని కలిగిస్తాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Sumati satakam

    సుమతీ శతకము

    Apr 15 | ఉడుముండదె నూఱేండ్లును బడియుండదె పేర్మిఁబాము పదినూఱేండ్లున్ మడువుఁ గొక్కెర యుండదె కడు నిల బురుషార్థపరుఁడు కావలె సుమతీ! టీకా : పేర్మిన్ = జీవించడంలోని ఎక్కువదనంతో ; పదనూఱేండ్లున్ = వేయి సంవత్సరాల కాలం... Read more

  • Sumati satakam

    సుమతీ శతకము

    Apr 14 | ఇమ్ముగ జదువని నోరును నమ్మా యని పిలిచి యన్న మడుగని నోరున్ దమ్ములఁ బిలువని నోరును గుమ్మరి మనుఁద్రవ్వినట్టి గుంటర సుమతీ! టీకా : ఇమ్ముగన్ = ఇష్టంతో ; చదువని నోరును =... Read more

  • Sumati satakam

    సుమతీ శతకము

    Apr 12 | ఇచ్చునదె విద్య, రణమునఁ జొచ్చునదె మగతనంబు, సుకవీశ్వరులున్  మెచ్చునదె నేర్పు, వాడుకు వచ్చునదె కీడుసుమ్ము, వసుధను సుమతీ! టీకా : వసుధను = ప్రపంచంలో ; ఇచ్చునదె = జీవిత ధనమిచ్చునది ; విద్య... Read more

  • Sumati satakam in telugu

    సుమతీ శతకము

    Apr 11 | ఆకలి యుడగని కుడుపును వేఁకటియగు లంజ పడుపు విడువని బ్రతుకున్ బ్రాఁకొన్న నూతి యుదకము మేఁకల పొడియును రోఁత మేదిని సుమతీ! టీకా : ఆకలి ఉడుగని = ఆకలి పోగొట్టని ; కుడుపును... Read more

  • Sumati satakam

    సుమతీ శతకము

    Apr 08 | ఆఁకొన్న కూడె యమృతము తాఁగొంకక నిచ్చువాఁడె దాత ధరిత్రన్  సోఁకోర్చువాఁడె మనుజుఁడు తేఁకువ గలవాఁడె వంశతిలకుఁడు సుమతీ! టీకా : ఆఁకొన్న = ఆకలితో వున్నప్పుడు ; కూడు = అన్నము ; అమృతము... Read more