Y.S. Viveka murder case: Witness Suspected Death వైఎస్ వివేకా కేసులో సాక్షి గంగాధర్ రెడ్డి అనుమానాస్పద మృతి..

Ys viveka murder case witness kalluri gangadhar reddy suspected death

CBI, murder case, YS Rajasekhara Reddy, YS JaganMohan Reddy, YS Avinash Reddy, YS Bhaskar Reddy, YS Viveka, Kalluru Gangadhar Reddy, Devireddy Shankar Reddy, Yadiki, Ananthapuram,, YS Pratap Reddy, Y.S. Vivekananda Reddy, Pulivendula, Kadapa, Devireddy SivaShanker Reddy, Rajashekar reddy, Erra Gangireddy​, Jagadishwar Reddy, CBI, YS Vivekananda Reddy murder case, Pulivendula, kadapa, andhra pradesh, crime, Politics

Kalluri Gangadhar Reddy, a witness in the sensational murder case of former Andhra Pradesh minister Y. S. Vivekananda Reddy, died under suspicious circumstances in Anantapur district. The 49-year-old died in sleep at his house in Yadiki village, the family members informed the police. The police rushed there and collected the clues from the house and surroundings. The body was subsequently shifted to Tadipatri for autopsy.

వైఎస్ వివేకా కేసులో కీలక పరిణామం: సాక్షి కల్లూరు గంగాధర్ రెడ్డి అనుమానాస్పద మృతి..

Posted: 06/09/2022 04:23 PM IST
Ys viveka murder case witness kalluri gangadhar reddy suspected death

మాజీ మంత్రి వై.ఎస్‌.వివేకా హత్యకేసు విచారణను సీబిఐ అధికారులు కొనసాగిస్తున్న తరుణంలోనే కీలక పరిణామాం చోటుచేసుకుంది. వైఎస్ వివేకా హత్యకేసులో సాక్షిగా ఉన్న కల్లూరు గంగాధర్ రెడ్డి అనుమానాస్పద మృతి పలు సందేహాలకు కారణమవుతోంది. బుధవారం రాత్రి ఆయన మృతి చెందినట్టు కుటుంబసభ్యులు వెల్లడించారు. అనంతపురం జిల్లాలోని యాడికిలో గంగాధర్ రెడ్డి అనుమానాస్పద స్థితిలో మరణించడం తీవ్ర కలకలం రేపింది. ఇదిలావుండగా ఆయన కుటుంబసభ్యులు మాత్రం ఈ మరణాన్ని సీబిఐ మెడకు చుట్టుతున్నారు. సీబిఊ అధికారుల ఒత్తడే గంగాధర్ రెడ్డి మరణానికి కారణమని అరోపిస్తున్నారు.

అయితే వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ అధికారులు తనను తీవ్ర ఒత్తిడి చేశారని గంగారెడ్డి గతంలోనే ఆరోపణలు కూడా చేయడం.. ఇదే విషయంపై జిల్లా ఎస్పీకి కూడా ఫిర్యాదు ఇచ్చాడు. కాగా, వివేకానంద హత్యకేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న దేవిరెడ్డి శంకర్ రెడ్డికి గంగాధర్రెడ్డి అనుచరుడిగా ఉన్నాడు. ప్రేమవివాహం చేసుకున్న గంగాధర్‌ రెడ్డి... స్వగ్రామం పులివెందుల విడిచి యాడికిలో ఉంటున్నాడు. ఈ కేసులో తనకు ప్రాణానికి ముప్పుపొంచి ఉందంటూ అనంతపురం జిల్లా ఎస్పీని 2 సార్లు కూడా కలిసి వినతిపత్రం కూడా సమర్పించాడు. రక్షణ కల్పించాలని కోరాడు. అయితే  నిద్రలోనే అతను మృతి చెందినట్లు బంధువులు చెబుతున్నారు.

కేసు నమోదు చేసిన పోలీసులు గంగాధర్ రెడ్డి ఇంట్లోని పరిసరాలను పరిశీలిస్తున్నారు. అన్ని కోణాల్లో విచారిస్తున్నారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడుగా ఉన్న శ్రీనివాస్ రెడ్డి 2019 ఆత్మహత్య చేసుకున్నాడు. విచారణ పేరుతో సిట్ వేధిస్తోందంటూ కూల్ డ్రింక్ లో గుళికలు కలుపుకొని తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన అప్పట్లో పెద్ద సంచలనమే రేపింది.పోలీసుల వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకున్నట్లు శ్రీనివాస్ రెడ్డి సూసైడ్ నోట్ లో వెల్లడించారు. వివేకా హత్యకేసుతో తనకు సంబంధం లేదంటూ లేఖలో తెలిపారు. తాజాగా సాక్షి గంగాధర్ రెడ్డి చనిపోవటం... ఈ కేసు మరోసారి చర్చనీయాంశంగా మారింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles