possible cyclone formation in Bay of Bengal బంగాళాఖాతంలో అల్పపీడనం.. బలపడే అవకాశాలు అధికం..

Possible cyclone formation in bay of bengal effected districts asked to take measures

Odisha, cyclone formation, Bay of Bengal, Odisha cyclone, cyclone, bay of bengal, south andaman sea, india meteorological department, andhra cyclone, odisha, imd cyclone, Andhra Pradesh cyclone, cyclone effect on Telangana, IMD, NDRF, Rapid Action Force

Amid a possibility of a cyclone formation over the South Andaman Sea and its neighboring areas, the Odisha government has asked collectors of 18 districts to be prepared considering the possibility of a cyclonic storm in the state.

అప్రమత్తం: బంగాళాఖాతంలో అల్పపీడనం.. బలపడే అవకాశాలు అధికం..

Posted: 05/07/2022 01:43 PM IST
Possible cyclone formation in bay of bengal effected districts asked to take measures

దక్షిణ అండమాన్‌ సముద్రం, దాన్ని ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. బంగాళాఖాతంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులు అల్పపీడనం మరింత బలపడేందుకు దోహదపడతున్నాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఇది వాయవ్య దిశగా కదులుతూ ఇవాళ వాయుగుండంగా మారుతుందని.. ఇక ఆదివారానికి తుపానుగా బలపడే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. ఈ తుపానుకు అసాని అని పేరు పెట్టనున్నారు. తుపాను వాయవ్య దిశగా ప్రయాణించి మంగళవారం అనగా మే10వ తేదీన ఉత్తరాంధ్ర–ఒడిశా మధ్య తీరందాటే అవకాశం ఉందని వాతావరణ అధికారులు తెలిపారు.

ఇది బంగ్లాదేశ్‌ వైపు ప్రయాణించే సూచనలు కూడా ఉన్నాయని, అయితే 10వ తేదీన విశాఖపట్నం తీరం సమీపానికి వచ్చే అవకాశం ఉందని చెప్పారు. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మూడురోజుల పాటు ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశాలున్నాయని తెలిపారు. తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నందున సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని  విపత్తుల నిర్వహణ సంస్థ డైరెక్టర్‌ అంబేడ్కర్‌ తెలిపారు. మత్స్యకారులు వేటకు వెళ్లరాదని, వెళ్లినవారు వెంటనే తిరిగి రావాలని కోరారు.

ఇక ఒడిశాలో తుఫాను తీరం దాటుందన్న వార్తలతో రాష్ట్రయంత్రాంగం అప్రమత్తమైంది. ఈ తుపాను వల్ల ఒడిశాలోని 18 రాష్ట్రాలపై తీవ్రప్రభావం చూపనుందని ఐఎండీ హెచ్చరికలతో రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు చర్యలకు పూనుకుంది. ముందుజాగ్రత్త చర్యగా మల్కన్‌గిరి నుంచి మయూర్‌భంజ్‌ వరకు ఒడిశాలోని 18 జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని ఒడిశా స్పెషల్‌ రిలీఫ్‌ కమిషనర్‌ పీకే జెనా అదేశాలు జారీ చేశారు. తుఫాను తీరం దాటే సమయంతో పాటు అందుకుముందు కురిసే వర్షాల నేపథ్యంలో తుఫాను ప్రభావిత 18 జిల్లాలోని లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత కేంద్రాలకు తరలించాలని అదేశించారు.

తుపాను నేపథ్యంలో అవసరమైతే 17 ఎన్డీఆర్ఎఫ్, 20 ఒడిశా ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ సహా అగ్నిమాపక సేవల విభాగానికి చెందిన 175 బృందాలు అత్యవసరమైన పరిస్థితులలో  పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నాయని జెనా పేర్కోన్నారు. ఇక అసాని తుపాను నేపథ్యంలో పూరి గుడిసెలు, కచ్చ ఇళ్లలోని నివసించే లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించే ప్రణాళికను జిల్లా కలెక్టర్లు సిద్ధం చేయాలని జెనా కోరారు. వృద్ధులు, వికలాంగులు, మహిళలు పిల్లలను.. జియో-ట్యాగ్ చేయబడిన పునరావాస కేంద్రాలకు తరలించేందాలని అదేశించారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles