Karnataka MLA apologises for insensitive comments మహిళలకు క్షమాపణలు చెప్పిన కర్నాటక నేత

Karnataka mla kr ramesh kumar apologizes in assembly for his enjoy rape comment

Karnataka Assembly, rape comments, Karnataka leader rape remark, KR Ramesh Kumar, apologize women, Hubballi, rape remark, ramesh kumar, KR Ramesh Kumar, Karnataka assembly, karnataka, congress Karnataka, Congress, Karnataka politics

After Karnataka MLA KR Ramesh Kumar's statement on women and rape became controversial, the Congress politician apologized in the Assembly on Friday. He was forced to do so when female Legislators and other women's organizations publicly opposed Ramesh Kumar's statements.

‘‘ఎంజాయ్ రేప్’’ వ్యాఖ్యలపై మహిళా లోకానికి క్షమాపణలు చెప్పిన కర్నాటక నేత..

Posted: 12/17/2021 04:07 PM IST
Karnataka mla kr ramesh kumar apologizes in assembly for his enjoy rape comment

కర్ణాటక కాంగ్రెస్‌ సీనియర్‌ నేత రాష్ట్ర అసెంబ్లీలో మహిళల పట్ల చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను శుక్రవారం అసెంబ్లీలో ఉపసంహరించుకున్నారు. అంతేకాదు తన వ్యాఖ్యలపై ఆయన మహిళాలోకానికి బేషరతు క్షమాపణలు చెప్పారు. తన వ్యాఖ్యలు మహిళా సమాజాపు సెంటిమెంట్లను గాయపర్చివుంటే.. తాను తన హృదయపూర్వకంగా.. క్షమాపణలు కోరుతున్నానని కర్నాటక అసెంబ్లీ మాజీ స్పీకర్ కేఆర్ రమేష్ కుమార్ ఇవాళ అసెంబ్లీలో అన్నారు. తాను కావాలని మహిళల మనోభావాలను అగౌరపర్చలేదని.. కేవలం స్పీకర్ చేసిన వ్యాఖ్యలను తాను ఇలా పోల్చి.. రైతుల సమస్యలను లేవనెత్తాలనే ఇలా అన్నానని సంజాయిషీ ఇచ్చుకున్నారు.

కాగా, గురువారం అసెంబ్లీలో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు రైతుల సమస్యలపై చర్చ జరపడానికి సమయం కేటాయించాలని పట్టుబట్టిన సమయంలో.. కాంగ్రెస్‌ ఎమ్మెల్యే రమేష్‌ కుమార్‌ విధానసభలో చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలకు ఆయన క్షమాపణలు చెప్పారని స్పీకర్ విహెచ్ కగేరి సభకు తెలిపారు. ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేయాలని ఆయన సభలోని సభ్యులను కోరారు. దీనిని మరింత వివాదాస్పదంగా చేయరాదని స్పీకర్ సభ్యులను కోరారు. కాగా గురువారం కర్నాటక విధాన సభలో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు రైతు సమస్యలపై చర్చించాలని సభలో డిమాండ్ చేశారు. అయితే దీనిపై స్పందించిన స్పీకర్‌ రైతుల చర్చ అప్రస్తుతమని వారించారు.

దీంతో కల్పించుకున్న సదరు ఎమ్మెల్యే కేఆర్ రమేష్ కుమార్.. ‘అత్యాచారం అనివార్యం అయిన స‌మ‌యాల్లో.. మ‌హిళ‌లు ఆ చర్యను ఆనందించాల‌ని అనే చందాన స్పీకర్‌ వ్యవహారం ఉంద’ని సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ఆయన రైతుల అంశంపై చర్చ అనివార్యమని చెప్పేందుకు ఈ వ్యాఖ్యలు చేయగా.. అవి కాస్తా వివాదాస్పదమై.. ఆయన మెడకు చుట్టుకున్నాయి. దీంతో ఆయన వ్యాఖ్యలను అధికార, ప్రతిపక్ష ఎమ్మెల్యేలు తీవ్రంగా ఖండించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియా వైర‌ల్‌గా మారింది. సొంత పార్టీ ఎమ్మెల్యేలు సైతం రమేష్ కుమార్ వ్యాఖ్య‌ల‌పై తప్పుపట్టారు.

అనుచిత వ్యాఖ్య‌లు చేసిన ఎమెల్యేను పార్టీ నుంచి స‌స్పెండ్ చేయాల‌ని మ‌హిళా ఎమ్మెల్యేలు డిమాండ్‌ చేశారు. దీనిపై స్పందించిన స్పీకర్‌ మాట్లాడుతూ.. అందరికీ సమయం కేటాయిస్తే సభను ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించారు. ‘మీరు ఏది నిర్ణయించుకున్నా. నేను సమాధానం ఇస్తాను. నేను ఆలోచిస్తున్నది ఏమిటంటే.. సభా పరిస్థితిని ఆస్వాదిద్దాం. విధాన సభను హెందాగా నడపడమే నా బాధ్యత’ అని తెలిపారు. అయితే అసెంబ్లీలో కాంగ్రెస్‌ ఎమ్మెల్యే  చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఆయన చేసిన వ్యాఖ్యలపై అధికార, ప్రతిపక్ష ఎమ్మెల్యేలు, రాజకీయనేతల నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు రావటంలో కాంగ్రెస్‌ ఎమ్మెల్యే రమేష్‌ కుమార్‌ క్షమాపణలు చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles