KBR park Entrance ticket and annual passes fee hiked కేబీఆర్ పార్క్ సందర్శకులపై న్యూఇయర్ వడ్డింపులు

New year treat to kbr park entries visitors entrance ticket and annual passes fee hiked

Entry Fees Rate Hike, Annual entey pass renewal fee Hiked, senior citizen pass fees hiked, KBR Park, Banjara Hills, banjara hills police, Hyderabad

The Greater Hyderabad Municipal corporation is likely to increased the entrance ticket of the visitors to Kasu Bramhananda Reddy Park in Banjara Hills. Along with the day passes the GHMC also hikes the annual passes rates of Annual passes and senior citizen passes.

కేబీఆర్ పార్క్ సందర్శకులపై న్యూఇయర్ వడ్డింపులు

Posted: 12/17/2021 02:51 PM IST
New year treat to kbr park entries visitors entrance ticket and annual passes fee hiked

హైదరాబాద్ నగరంలోని సంపన్నులు ఉండే బంజారాహిల్స్‌ పరిధిలో ఉండే ప్రతిష్టాత్మక కాసు బ్ర‌హ్మానంద‌రెడ్డి (కేబీఆర్‌) పార్కు సందర్శకులపై కొత్త సంవత్సర వడ్డింపులు వడ్డించనుంది. ఓ వైపు జీహెచ్ఎంసీ అధికారులు పన్నులు వేసి.. అందులోనే పార్కుల నిర్వహణ, వీధి దీపాల రుసుమును బాదేస్తున్నా.. కొన్న పార్కులను ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చి వాటిని నిర్వహణకు అయ్య ఖర్చును సందర్శకులపై కూడా వేయడం పరిపాటే. అయితే ఇలా వడ్డిస్తున్న పార్కులలో కేబీఆర్ పార్కు కూడా ఒకటి. ఈ పార్కులోకి ఎంటర్ కావాలంటే.. తప్పకుండా ఎంట్రీ ఫీజు కట్టాల్సిందే.

అందులో విచిత్రమేముంది అంటే.. ఇకపై ఈ ప్రవేశ రుసుముతో పాటు వార్షిక పాస్‌ ధరలను అటవీశాఖాధికారులు భారీగా పెంచుతూ ఉత్తర్వులు జారీ చేశారు. జనవరి 1 నుంచి అమలు కానున్న ఈ ప్రవేశ రుసుముతో పాటు వార్షిక పాస్‌లను ఆన్‌లైన్‌లో రెన్యూవల్‌ చేసుకోవాలని నోటీసును అతికించారు. వార్షిక ఎంట్రీపాస్‌(జనరల్‌) 2021లో రూ. 2250 ఉండగా 2022 నుంచి రూ. 2500 చేశారు. అలాగే సీనియర్‌ సిటిజన్‌ వార్షిక ఎంట్రీ ఫీజు పాస్‌ కోసం గతంలో రూ. 1500 ఉండగా వచ్చే ఏడాది నుంచి రూ. 1700 వసూలు చేయనున్నారు.

ఇప్పటి వరకు నెలవారి ఎంట్రీఫీజు రూ. 600 మాత్రమే ఉండగా వచ్చే నెల 1వ తేదీ నుంచి రూ. 700 ఉండనుంది. అలాగే రోజువారి ప్రవేశ రుసుము పెద్దలకు గతంలో రూ. 35 ఉండగా ఇప్పుడది రూ. 40కి చేరింది. పిల్లలకు మొన్నటి వరకు ఎంట్రీఫీజు రూ. 20 ఉండగా ఇప్పుడది రూ. 25కు చేరింది. అలాగే పార్కు వేళలను కూడా కుదించారు. ఉదయం 5 నుంచి 9.30 గంటల వరకు, సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు  మాత్రమే వాకింగ్, సందర్శకులకు అనుమతిస్తారు.  

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles