woman asks President for help to buy helicopter ‘‘హెలికాప్టర్ కావాలంటూ’’ రాష్ట్రపతికి లేఖ రాసిన మహిళా రైతు

Woman farmer asks president kovind for help to buy helicopter know why

woman farmer, Basanti Bai, local authorities, Mandsaur, President Ram Nath Kovind, MLA Yashpal Singh, social media, Madhya Pradesh, Politics

A woman from Madhya Pradesh's Mandsaur district, in a strange request, has written a letter to President Ram Nath Kovind, asking him to provide her with a loan to purchase a helicopter. The woman was compelled to write the letter after the owner of the neighbouring farm blocked her way, making it impossible for her to reach her farm.

‘‘హెలికాప్టర్ కావాలంటూ’’ రాష్ట్రపతికి లేఖ రాసిన మహిళా రైతు

Posted: 02/12/2021 08:53 PM IST
Woman farmer asks president kovind for help to buy helicopter know why

తనకు హెలికాప్టర్ కావాలంటూ.. దానిని కొంచెం కొనిపెట్టండి సారూ.. అంటూ ఓ మహిళా రైతు నేరుగా రాష్ట్రపతికి లేఖ రాసింది. ఔనండీ.. ఇప్పుడీ మహిళఆ రైతు లేఖ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నది. ఇటు సోషల్ మీడియాలో అటు రాష్ట్రమీడియాలో అమె లేఖ పెను సంచలనంగా మారింది. దీంతో స్థానిక అధికారులతో పాటు అమె నియోజవర్గానికి చెందిన ఎమ్మెల్యే కూడా వెనువెంటనే స్పందించారు. తాను అమెకు సాయం చేసి పెడతానని కూడా హామీ ఇచ్చారు. ఇంతకు అంత ఆఘమేఘాల మీద అధికారులు, శాసనసభ్యుడు స్పందించేందుకు కారణమేంటి.?

ఈ ప్రశ్నలను తెలుసుకునేందుకు ముందు అసలు ఈ మహిళా రైతుకు హెలికాప్టర్ తో ఏం పని.. అమెకు అంతటి అవసరమేంటి.. అన్న ప్రశ్నల్లోకి ఎంట్రీ ఇస్తే కానీ అసలు వివరాలు తెలియవు. మధ్యప్రదేశ్ రాష్ట్రం మాండ్సౌర్ జిల్లాలొని బర్ఖేడా గ్రామంలో బసంతి బాయి అనే మహిళా రైతు నివసిస్తున్నారు. ఆమెకు గ్రామంలో కొంత భూమి ఉంది. అయితే ఆ పొలానికి వెళ్లేందుకు దారి లేదు. దీంతో అమె ఇతరుల పొలాలను దాటుకుంటూ వరాల మీదుగా వెళ్లాల్సిందే. అయితే ఇతర పొలాల వాళ్లు ఆమెను రానివ్వడం లేదు.

ఈ సమస్యను పలుమార్లు స్థానిక రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు బసంతి బాయి. అయితే ఎవరూ పట్టించుకోవడం లేదు. దీంతో ఆమె నేరుగా రాష్ట్రపతికి ఓ లేఖ రాసింది. ఆ లేఖలో ఇలా ఉంది. ‘అయ్యా మాది బర్ఖేడా గ్రామం. నాకు ఈ గ్రామంలో పొలం ఉంది. కానీ పొలానికి వెళ్లడానికి మార్గం లేదు. ఇతరులకు చెందిన పొలాలను దాటుకుంటూ వెళ్లాలి. నన్ను పొలాల గుండా రానివ్వడం లేదు. మీరు దయతలిచి హెలికాప్టర్ ఇప్పిస్తే నేను హెలికాప్టర్లో నా పొలానికి వెళ్తా’ అంటూ ఆమె లేఖ రాసింది. ఈ లేఖ సోషల్మీడియాలో తెగవైరల్ అవుతోంది.

బసంతి బాయి తన సమస్య అధికారులకు చెప్పేందుకు స్థానికంగా ఉండే ఓ టైపిస్ట్ సాయంతో ఈ లేఖ రాయించింది. ఈ లేఖ ప్రస్తుతం విపరీతంగా వైరల్ కావడంతో స్థానిక ఎమ్మెల్యే యశ్ పాల్ సింగ్ హెుటాహుటిన స్పందించారు. ఈ విషయంపై యశ్పాల్ మాట్లాడుతూ.. ‘సదరు మహిళా రైతుకు నేను హెలికాప్టర్ అయితే ఇప్పించలేను. కానీ కచ్చితంగా ఆమె సమస్యను పరిష్కరిస్తా’ అంటూ ఆయన పేర్కొన్నారు. అంతేకాదు వెనువెంటనే సంబంధిత తహసిల్ అధికారులతో పాటు గ్రామ రెవెన్యూ అధికారులను కూడా మహిళా రైతు సమస్యపై వివరణ అడిగారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : woman farmer  Mandsaur  President Ram Nath Kovind  MLA Yashpal Singh  Madhya Pradesh  

Other Articles