ఏపీ ప్రభుత్వంతో ఢీ అంటే ఢీ అంటున్న నిమ్మగడ్డ రమేశ్ పై ఇటీవల మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. దీనిపై సీరియస్ అయిన రాష్ట్ర ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేశ్.. మంత్రి కొడాలి నానికి షోకాజ్ నోటీసులు పంపాడు. వీటికి తాజాగా మంత్రి కొడాలి నాని వివరణ ఇచ్చాడు. తాను ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డకు వ్యతిరేకంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదన్నారు. టీడీపీ అరాచకాల్ని వివరించడానికే ప్రెస్ మీట్ నిర్వహించానని అన్నారు.
ఉద్ధేశపూర్వకంగా రాష్ట్ర ఎన్నికల అధికారిని కించపరిచేలా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని కొడాలి నాని తెలిపారు. తన వ్యాఖ్యల్ని ఎస్ఈసీ అపార్ధం చేసుకున్నారని కొడాలి వివరణ ఇచ్చారు. తాను ప్రెస్మీట్లో చేసిన వ్యాఖ్యల నిజమైన భావాన్ని ఎస్ఈసీ అర్ధం చేసుకోలేదని కొడాలి నాని తెలిపారు. ఎస్ఈసీ నిమ్మగడ్డ జారీ చేసిన షోకాజ్ నోటీసులో తనకు వ్యతిరేకంగా చేసిన ఆరోపణలు అవాస్తవమని మంత్రి కొడాలి నాని వివరణ ఇచ్చారు. ఈ ఆరోపణలను ఖండిస్తున్నానన్నారు.
రాజ్యాంగ బద్ధ సంస్ధలంటే తనకు ఎంతో గౌరవమని ముఖ్యంగా ఎస్ఈసీ అంటే తనకు గౌరవమని మంత్రి కొడాలి పేర్కొన్నారు. అంతకుముందు ప్రెస్ మీట్లో చంద్రబాబు నిమ్మగడ్డ ఎవరు అడ్డొచ్చినా పంచాయతీ ఎన్నికల ఫలితాలు వైసీపీకే అనుకూలంగా ఉంటాయని.. వీరంతా జగన్నాథ రథచక్రాల కింద పడి నలిగిపోవడం ఖాయమని కొడాలి నాని నిప్పులు చెరిగారు. దీంతో ఎస్ఈసీ షోకాజ్ నోటీసులు జారీ చేశారు. నాని వివరణ ఇవ్వడంతో తదుపరి చర్యలను ఎస్ఈసీ నిమ్మగడ్డ తీసుకునే అవకాశం ఉంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more