Amaravati farmers protest reaches 78 days అంతర్జాతీయ కోర్టులో అమరావతిపై పిటీషన్

Amaravati farmers reachout to international court of justice

YCP Activists, slogans, Pro Govt, Anti Govt protest, Farmers agitations, Decentralisation, CRDA, Three Capital Plan, United Nations Human Rights Council,united kingdom,law,kaveti srinivas rao,International Criminal Court,DecisionAmaravati, three capital, State Assembly, joint action committee, YS Jagan, ys jagan mohan reddy, chandrababu naidu, andhra pradesh capital, amaravati lands case, Chief Justice JK Maheshwari, Justice AV Sesha Sai, Justice M Satyanarayana Murthy, Supreme Court, Vijayawada, farmers, Andhra Pradesh, Politics

A few NRIs who are the offsprings of Farmers who have given their lands for Amaravati have knocked the doors of the International Court of Justice regarding their issue. The international court of Justice (ICJ) is one of the Organs of the United Nations (UN). ICJ is located at The Hague in the Netherlands.

78రోజులకు దీక్షలు.. అంతర్జాతీయ కోర్టులో అమరావతిపై పిటీషన్

Posted: 03/04/2020 12:22 PM IST
Amaravati farmers reachout to international court of justice

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏకైక పూర్తిస్థాయి రాజధానిగా అమరావతిని కొనసాగించాలని కోరుతూ ఆ ప్రాంత రైతులు చేస్తున్న ఆందోళనలు 78వ రోజుకు చేరాయి. తమ దీక్షలు, నిరసనలను.. ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, తమ మొర వినడం లేదని, తమను, తమ సమస్యను నిర్లక్ష్యం చేస్తోందని అమరావతి రైతలు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ అమరావాతి ప్రాంత రైతులు, మహిళలు, విద్యార్థులు మధ్యాహ్నం 12 గంటలకు పళ్లెం గంటలను మోగించి పెద్ద శబ్దాలు చేస్తూ నిరనసను వ్యక్తం చేశారు. తాడేపల్లిలోని సీఎం జగన్ కు వినబడేలా శబ్దాలు చేస్తూ నిరనసను తెలపాలని క్రితం రోజునే అమరావతి జేఏసీ నేతలు నిర్ణయించారు.

అమరావతి జేఏసీ నేతల పిలుపు మేరకు ఇవాళ నిరసన శిభిరాల వద్దకు రైతులు, మహిళలు, విద్యార్థులు, యువత చేరుకునే సమయంలోనే వారంతా తమ వెంట గరిటలను తీసుకువచ్చారు. ఈ సందర్భంగా స్థానిక రైతులు, మహిళలు తమ ఆక్రందనను ఇప్పటికైనా ప్రభుత్వం అర్థం చేసుకోవాలని కోరారు. రాజధాని ప్రాంతంలోని 29 గ్రామల ప్రజలు.. ఆయా గ్రామాల పరిధిలో పళ్లెం, గరిటలను మోగిస్తూ నిరసనలు తెలియజేస్తున్నారు. ‘జై అమరావతి’, ‘ఒకే రాష్ట్రం.. ఒకే రాజధాని’, ‘రైతులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలి’ అంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

అంతర్జాతీయ కోర్టులో అమరావతిపై పిటీషన్

ఆంధ్రప్రదేశ్ లో పూర్తిస్థాయి రాజధానిని అమారావతిలోనే కొనసాగించాలంటూ స్థానిక రైతులు, ప్రజలు చేస్తున్న పోరాటం ది హేగ్ లోని అంతర్జాతీయ కోర్టు దృష్టికి వెళ్లింది. అమెరికాలో స్థిరపడ్డ ప్రవాస భారతీయ న్యాయవాది కావేటి శ్రీనివాసరావు అమరావతి విషయమై అంతర్జాతీయ న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖల చేశారు. రాజధాని నిర్మాణంలో రైతుల్ని భాగస్వాముల్ని చేస్తూ ప్రభుత్వం వారితో ఒప్పందాలు చేసుకుందని, వాటిని తాజాగా ఉల్లంఘిస్తుండటంతో రైతులు, మహిళలు 78 రోజులుగా దీక్షలు చేస్తున్నారని, దీంతో పాటు మానవహక్కులకూ విఘాతం కలుగుతోందని శ్రీనివాసరావు తన పిటిషన్ లో పేర్కొన్నారు.

కావేటి శ్రీనివాసరావు పిటీషన్ తమకు అందినట్టుగా అంతర్జాతీయ కోర్టు ప్రాసిక్యూటర్‌ కార్యాలయంలోని సమాచార, సాక్ష్యాల విభాగం అధిపతి మార్క్‌ పి.డిలాన్‌ ధృవీకరణ పత్రం జారీచేశారు. ‘మీరు పంపిన సమాచారాన్ని మా కార్యాలయం కమ్యూనికేషన్‌ రిజిస్టర్‌లో నమోదు చేశాం. అంతర్జాతీయ కోర్టు నిబంధనల ప్రకారం... మీ పిటిషన్‌ను పరిశీలించి, దానిపై మా నిర్ణయాన్ని మీకు తగిన సమయంలో తెలియజేస్తాం. ఈ ధ్రువీకరణ పత్రం జారీ చేసినంత మాత్రాన... మీ పిటిషన్‌పై మేం దర్యాప్తు ప్రారంభించినట్టుగా గానీ, ప్రారంభిస్తామని గానీ హామీ ఇచ్చినట్టు భావించరాదు.  మీ పిటిషన్ పై మేం ఒక నిర్ణయం తీసుకున్నాక... అదేంటో, ఆ నిర్ణయానికి రావడానికి కారణాలేంటో లిఖితపూర్వకంగా తెలియజేస్తాం’ అని పేర్కొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles