Emerald goes missing from Basara temple బాసర సరస్వతి అమ్మవారి కిరీటంలో మరకతం మాయం.!

Emerald goes missing from the crown of goddess gnana saraswathi in basara temple

Goddess Gnana Saraswathi, Adilabad district, Basara temple, Hyderabad, Emerald, Endowment department, Telangana, politics

An emerald has gone missing from a crown belonging to Goddess Gnana Saraswathi from the famous Basara temple in Adilabad ddistrict of Telangana. The endowments department has ordered.

బాసర సరస్వతి అమ్మవారి కిరీటంలో మరకతం మాయం.!

Posted: 05/06/2019 06:53 PM IST
Emerald goes missing from the crown of goddess gnana saraswathi in basara temple

నిర్మల్‌ జిల్లాలోని బాసర జ్ఞానసరస్వతి ఆలయంలో మరో వివాదం చెలరేగింది. రేండేళ్ల క్రితం అమ్మవారి ఉత్సవ విగ్రహ త‌ర‌లింపు అంశాన్ని భక్తజనం మర్చిపోకముందే మరోమారు బాసర ఆలయం వార్తల్లో నిలిచింది. తాజాగా ఆలయంలో అమ్మవారికి అలంకరించే బంగారు కిరీటంలోని మరకతం (పచ్చ) అదృశ్యమైంది. గత కొంతకాలంగా కనిపించటం లేదు. 2006లో హైదరాబాద్‌కు చెందిన ఓ భక్తుడు అమ్మవారికి బంగారు కిరీటం సమర్పించారు. ప్రతిరోజు అభిషేకం అనంతరం అమ్మవారికి బంగారు కిరీటం అలంకరిస్తారు.

కిరీటంలో నాలుగు మరకతాలు, నాలుగు వజ్రాలు, ఒక కెంపు పొదిగి ఉన్నాయి. అందులో ఒక పచ్చ గత కొంతకాలంగా కనిపించటం లేదు. అమ్మవారి అభిషేక పూజ సమయాల్లో ఊడిపోయినట్లు ఆలయం అధికారులు పేర్కొంటున్నారు. ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఆలయ ఈవో సంధ్యారాణి తెలిపారు. ఈ వ్యవహారంపై రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి విచారణకు ఆదేశించారు. పూర్తి వివరాలతో కూడిన నివేదికను ఇవ్వాలని ఉన్నతాధికారులకు సూచించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.

ఇప్పటికే బంగారు, వెండి కానుకల విషయంలో దేవాదాయశాఖ బాధ్యతారాహిత్యం బయటపడినా.. అధికారులు మాత్రం ఇంకా పాఠాలు నేర్చుకోకుండా భక్తుల మనోభావాలతో ఆడుకుంటున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అమ్మవారి ఉత్సవ విగ్రహం అదృశ్యమైన కేసును విచారిస్తున్న క్రమంలో అమ్మవారి వెండి, బంగారు కానుక‌ల‌కు సంబంధించిన అక్రమం వెలుగు చూసింది. అమ్మవారి ఉత్సవ మూర్తిని త‌ర‌లించిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న ప్రధాన అర్చకుడి ఆధీనంలో గల బీరువాల్లో భక్తులు సమర్పించిన బంగారు, వెండి కానుకలు బ‌య‌ట‌ప‌డ్డిన విషయం తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles