cop caught on camera stealing tumbler చలివేంద్రంలో ఆ గ్లాసుదొంగలు ఆ పోలీసులే..!

Tamil nadu cop caught on camera stealing tumbler

silver tumbler, police constable, home guard, CCTV camera, Merpanaikkadu, Keeramangalam police station, Pudukkottai, Tamil Nadu

The footage from the CCTV camera showed that the constable, identified Ayyappan, 30, attached to Keeramangalam police station, and home guard Vadivazhagan, 31, coming to the spot on a two-wheeler.

ITEMVIDEOS: చలివేంద్రంలో వెండి గ్లాసు మాయం.. దొంగలు పోలీసులే..!

Posted: 05/06/2019 05:59 PM IST
Tamil nadu cop caught on camera stealing tumbler

దొంగలను పట్టుకోవాల్సిన పోలీసులే దొంగలుగా మారింతే.. ఈ ప్రశ్న ఎంతటి అందోళనను కలిగిస్తుందో కదూ.. నమ్మశక్యం కాకపోయినా ఇదే నిజం! చలివేంద్రంలో ప్రతీరోజు మాయమవుతున్న గ్లాసును దొంగిలించింది పోలీసులే. ఈ దొంగల్ని పట్టించింది మాత్రం నిఘానేత్రాలే. దీంతో పోలీసులపై నెట్ జనులు తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ‘మరీ ఇంత కక్కుర్తా?’ అని ట్రాల్ చేస్తున్నారు. తమిళనాడులోని పుదుకొట్టై జిల్లాలో జరిగిందీ ఘటన. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వీడియో ప్రకారం..
 
వేసవి ఎండలు మండిపోతుండడంతో జిల్లాలోని మెరపనైక్కడు గ్రామానికి చెందిన యువత మసీదు సమీపంలో చలివేంద్రం ఏర్పాటు చేసింది. అయితే, చలివేంద్రం నిర్వాహకులు స్టీలు గ్లాసుకు బదులు వెండి గ్లాసు పెట్టారు. వెండి గ్లాసుతో నీళ్లు తాగడం వల్ల శరీరానికి చలువ చేస్తుందని ఈ విధంగా ఏర్పాటు చేశారు. జనం రావడం, నీళ్లు తాగి వెళ్లడం రోజూ జరుగుతూనే ఉంది. అయితే, దీంతో పాటు వారు ఏర్పాటు చేసిన వెండి గ్లాసు కూడా రోజు మాయమైతొంది. తొలిరోజు మలిరోజు ఇలా నాలుగు రోజులు నాలుగు గ్లాసులు పోయిన తరువాత అక్కడి యువతకు ఓ ఐడియా వచ్చింది.

దీంతో వారు గ్లాసు దొంగను పట్టుకునేందుకు స్థానికంగా ఓ సీసీటీవీని ఏర్పాటు చేశారు. దీంతో ఐదవ రోజు కూడా గ్లాసు పోయిన తరువాత అరవ రోజు సీసీటీవీ ఫుటేజీని పరిశీలించిన నిర్వాహకులు నిర్ఘాంతపోయారు. గ్లాసు దొంగలు ఎవరో వారు తెలిసి ముక్కున వేలేసుకున్నారు. పెట్రోలింగ్ చేస్తూ రాత్రి సమయంలో చలివేంద్రం వద్దకు వచ్చిన కీరమంగళం పోలీస్ స్టేషన్ కు చెందిన కానిస్టేబుల్ అయ్యప్పన్, హోంగార్డు వడివళగన్‌లు ఈ దొంగతనం చేసినట్టు అక్కడి కెమెరాల్లో రికార్డైంది. రోడ్డుపై బైక్ ఆపగా, హోంగార్డు వెళ్లి గ్లాసును దొంగిలించి తెచ్చాడు. ఈ వీడియో కాస్తా సోషల్ మీడియాకెక్కడంతో పోలీసుల పరువు కాస్తా బజారునపడింది. మరోవైపు గ్లాసు దొంగతనంపై యువకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్పందించిన పుదుకొట్టై ఎస్పీ సెల్వరాజ్.. అయ్యప్పన్‌ను ఆర్మ్‌డ్ రిజర్వ్ పోలీస్‌కు ట్రాన్స్‌ఫర్ చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles